అన్వేషించండి

Cases against KTR: ఫార్ములా ఈ రేసు కేసుతో కేటీఆర్‌ను పక్కాగా ఇరికించారా? అరెస్టులు లేకుండా నేరుగా చార్జిషీటు వెనుక రేవంత్ వ్యూహం ఏమిటి?

KTR Case: ఫార్ములా-ఈ రేస్ వ్యవహారం ఇప్పుడు కీలక మలుపు తిరిగింది. కేటీఆర్‌ను ఈ కేసులో ఏ1 గా చేరుస్తూ ఏసీబీ దాఖలు చేసిన ఛార్జిషీట్ రాష్ట్ర రాజకీయాల్లో కొత్త మలుపులకు కారణం అవుతోంది.

Formula E race case KTR in trouble:  తెలంగాణ రాజకీయాల్లో గత కొంతకాలంగా వినిపిస్తున్న  ఫార్ములా-ఈ రేస్ వ్యవహారం ఇప్పుడు కీలక మలుపు తిరిగింది. మాజీ మంత్రి కేటీఆర్‌ను ఈ కేసులో ఏ1 గా చేరుస్తూ ఏసీబీ దాఖలు చేసిన ఛార్జిషీట్ రాష్ట్ర రాజకీయాల్లో  కొత్త మలుపులకు కారణం అవుతోంది.   అరెస్టుల వంటి హడావుడి లేకుండానే, పక్కాగా సాక్ష్యాధారాలతో కేటీఆర్‌ను రేవంత్ రెడ్డి ప్రభుత్వం చట్టపరమైన చిక్కుల్లో పడేసిందనే విశ్లేషణలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తున్నాయి.  

పక్కాగా సాక్ష్యాధారాల సేకరణ 

సాధారణంగా అవినీతి కేసుల్లో రాజకీయ నేతలపై ఆరోపణలు వస్తే వెంటనే అరెస్టులు చేసి హడావుడి చేయడం చూస్తుంటాం. కానీ, ఫార్ములా-ఈ కేసులో రేవంత్ ప్రభుత్వం భిన్నమైన వ్యూహాన్ని అనుసరించింది. సుమారు 55 కోట్ల రూపాయల నిధులు హెచ్‌ఎండీఏ  ఖాతా నుండి విదేశీ సంస్థ అయిన ఎఫ్.ఈ.ఓ  కు ఎలా మళ్లాయనే అంశంపై బ్యాంకింగ్ లావాదేవీల రికార్డులను పక్కాగా సేకరించింది. ఏ ఒత్తిడి వల్ల, ఏ నిబంధనలను ఉల్లంఘించి ఈ నిధులు విడుదలయ్యాయో అధికారుల స్టేట్‌మెంట్ల ద్వారా నిర్ధారించింది.

విధానపరమైన లోపమే అసలు సమస్య

కేటీఆర్ ఈ కేసును లొట్టపీసు కేసు  అని కొట్టిపారేస్తున్నప్పటికీ, సాంకేతికంగా ఆయన ఇక్కడ ఇరుక్కుపోయినట్లు కనిపిస్తోంది. ప్రభుత్వ నిధులను విదేశాలకు పంపాలంటే క్యాబినెట్ ఆమోదం, ఆర్థిక శాఖ అనుమతి ,  సెంట్రల్ బ్యాంక్ నిబంధనలు పాటించాలి. అయితే, రేసు నిర్వహణ కోసం తొందరపాటుతో ఈ ప్రక్రియను పక్కన పెట్టి నిధులు మళ్లించడమే ఇప్పుడు ఆయనకు శాపంగా మారింది.  పని చేశాము కానీ ప్రాసెస్ పాటించలేదు  అనే వాదన న్యాయస్థానంలో చెల్లదు. అవినీతి నిరోధక చట్టం ప్రకారం నిబంధనల ఉల్లంఘన కూడా నేరమే అవుతుంది.

అరెస్టులు లేవు.. నేరుగా ట్రయల్స్ 

రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇక్కడ ఒక తెలివైన వ్యూహాన్ని అమలు చేసింది. కేటీఆర్‌ను అరెస్టు చేస్తే అది  రాజకీయ కక్షసాధింపు గా మారి ఆయనకు సానుభూతి వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే, అరెస్టుల జోలికి వెళ్లకుండానే విచారణ పూర్తి చేసి, ఏసీబీ కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేయించింది. ఇప్పుడు కేసు నేరుగా ట్రయల్  దశకు చేరుకుంది. కోర్టులో సాక్ష్యాధారాలు నిరూపితమైతే, అది కేటీఆర్ రాజకీయ భవిష్యత్తుకు పెద్ద గండంగా మారుతుంది. ఈ కేసులో ఏ2గా ఉన్న ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ఇచ్చిన వివరణలు కేటీఆర్‌కు ఇబ్బందికరంగా మారాయి. పైస్థాయి ఒత్తిళ్ల వల్లే నిధులు విడుదల చేయాల్సి వచ్చిందని అధికారులు పేర్కొన్నట్లు సమాచారం. ప్రభుత్వ యంత్రాంగం ద్వారా జరిగిన ఈ పొరపాటుకు రాజకీయ నాయకత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఏసీబీ తన ఛార్జిషీట్‌లో బలంగా పేర్కొంది. రికార్డుల్లో ఉన్న సంతకాలు, అధికారిక ఆదేశాలు కేటీఆర్‌ను డిఫెన్స్‌లో పడేశాయి.

రాజకీయ ఎఫెక్ట్ - ఇమేజ్ డ్యామేజ్ 

తెలంగాణను గ్లోబల్ మ్యాప్‌లో పెట్టడానికే రేసు నిర్వహించామని కేటీఆర్ చెబుతున్నప్పటికీ, నిధుల మళ్లింపు ఆరోపణలు ఆయన  క్లీన్ ఇమేజ్ ను దెబ్బతీస్తున్నాయి. చట్టపరంగా శిక్ష పడితే ఆయన ఎన్నికల్లో పోటీ చేసే అర్హతపై కూడా ప్రభావం పడే అవకాశం ఉంటుంది. అదే జరిగితే, బీఆర్ఎస్ పార్టీకి ఇది కోలుకోలేని దెబ్బ అవుతుంది. రేవంత్ రెడ్డి ఎక్కడా తొందరపడకుండా, నిశ్శబ్దంగా కేటీఆర్‌ను న్యాయపరమైన ఉచ్చులో బిగించడంలో సఫలమయ్యారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పుడు బంతి న్యాయస్థానం పరిధిలో ఉంది. నిందితులకు సమన్లు జారీ చేయడం, సాక్షుల విచారణ వంటి ప్రక్రియలు వేగవంతం కానున్నాయి. ఒకవేళ కోర్టు ఈ కేసులో సీరియస్ నిర్ణయం తీసుకుంటే, కేటీఆర్ కుదుటపడటం అంత సులభం కాదు. ఇది కేవలం రాజకీయ ఆరోపణ మాత్రమే కాదు, పక్కాగా రికార్డులతో కూడిన ఆర్థిక నేరం కాబట్టి, న్యాయ పోరాటం ఆయనకు అగ్నిపరీక్షగా మారనుంది. 

టాప్ హెడ్ లైన్స్

Konda Surekha: నన్ను తొలగించడం కుట్రే.. కాంగ్రెస్‌లోనే ఉంటా - కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు!
నన్ను తొలగించడం కుట్రే.. కాంగ్రెస్‌లోనే ఉంటా - కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు!
Konda Surekha Out: మంత్రివర్గం నుంచి కొండా సురేఖ బర్తరఫ్ - రాజీనామాకు నిరాకరించడంతో రేవంత్ సంచలన నిర్ణయం
మంత్రివర్గం నుంచి కొండా సురేఖ బర్తరఫ్ - రాజీనామాకు నిరాకరించడంతో రేవంత్ సంచలన నిర్ణయం
Rahul Gandhi PM Hopes: రాహుల్ ప్రధాని ఆశలకు తెలంగాణ, కర్ణాటకలే కీలక పరీక్ష - కానీ ఆ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పరిస్థితి బాగుందా?
రాహుల్ ప్రధాని ఆశలకు తెలంగాణ, కర్ణాటకలే కీలక పరీక్ష - కానీ ఆ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పరిస్థితి బాగుందా?
Narsapuram Janasena MLA: జనసేన ఎమ్మెల్యేకు చంద్రబాబు క్లాస్ - కూటమిలో మైక్రో మేనేజ్‌మెంట్ - ప్రమాద ఘంటికలా?
జనసేన ఎమ్మెల్యేకు చంద్రబాబు క్లాస్ - కూటమిలో మైక్రో మేనేజ్‌మెంట్ - ప్రమాద ఘంటికలా?

వీడియోలు

Gundenininda Gudigantalu Serial September 3 | సంజూ రాజకీయాన్ని దెబ్బకొట్టిన మీనా
Asian Games Accommodation Issue | ఏషియన్ గేమ్స్‌ వివాదంపై జపాన్ క్రికెట్ కామెంట్స్
Vaibhav Creates History In Duleep Trophy | దులీప్ ట్రోఫీలో వైభవ్ సూర్యవంశీ ఆల్ టైమ్ రికార్డ్
IND vs AFG T20s | అఫ్గాన్‌ సిరీస్‌ పై కృనాల్ పాండ్యా పోస్ట్ వైరల్
Gundenininda Gudigantalu Serial August 31 | రోహిణి మోసాలపై బాలు ఫైర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Cabinet Meeting: పొగాకు, పౌల్ట్రీ రైతులకు గుడ్ న్యూస్.. ఏపీ క్యాబినేట్ కీలక నిర్ణయాలివే!
పొగాకు, పౌల్ట్రీ రైతులకు గుడ్ న్యూస్.. ఏపీ క్యాబినేట్ కీలక నిర్ణయాలివే!
AP Local Elections: స్థానిక ఎన్నికలకు కూటమి పార్టీలు కసరత్తు.. టీడీపీ ఎమ్మెల్యేలకు శిక్షణా తరగతులు
స్థానిక ఎన్నికలకు కూటమి పార్టీలు కసరత్తు.. ఎమ్మెల్యేలకు శిక్షణా తరగతులు
Konda Surekha: నన్ను తొలగించడం కుట్రే.. కాంగ్రెస్‌లోనే ఉంటా - కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు!
నన్ను తొలగించడం కుట్రే.. కాంగ్రెస్‌లోనే ఉంటా - కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు!
Konda Surekha Out: మంత్రివర్గం నుంచి కొండా సురేఖ బర్తరఫ్ - రాజీనామాకు నిరాకరించడంతో రేవంత్ సంచలన నిర్ణయం
మంత్రివర్గం నుంచి కొండా సురేఖ బర్తరఫ్ - రాజీనామాకు నిరాకరించడంతో రేవంత్ సంచలన నిర్ణయం
AP IPS Officers Suspension Lifted: ఐపీఎస్‌లు కాంతి రాణా, విశాల్ గున్నీలకు రిలీఫ్ - రెండేళ్ల తర్వాత సస్పెన్షన్ ఎత్తివేత - త్వరలో పోస్టింగులు !
ఐపీఎస్‌లు కాంతి రాణా, విశాల్ గున్నీలకు రిలీఫ్ - రెండేళ్ల తర్వాత సస్పెన్షన్ ఎత్తివేత - త్వరలో పోస్టింగులు !
Abhinandan Varthaman: ఎయిర్‌ఫోర్స్ నుంచి అభినందన్ వర్థమాన్ రిటైర్ - ప్రైవేటు విమానయాన సంస్థలో కీలక బాధ్యతలు
ఎయిర్‌ఫోర్స్ నుంచి అభినందన్ వర్థమాన్ రిటైర్ - ప్రైవేటు విమానయాన సంస్థలో కీలక బాధ్యతలు
YS Jagan: సాగునీటి ప్రాజెక్టులపై సీఎం చంద్రబాబు డ్రామాలు.. ముందు పోలవరం ఎత్తు తేల్చండి? - వైఎస్ జగన్
సాగునీటి ప్రాజెక్టులపై సీఎం చంద్రబాబు డ్రామాలు.. ముందు పోలవరం ఎత్తు తేల్చండి? - వైఎస్ జగన్
Son Kills Father Chittoor: తల్లి మందిలిస్తే తండ్రి నవ్వాడట - గొంతు కోసి చంపేసిన కొడుకు - సైకో అంటే వీడే !
తల్లి మందిలిస్తే తండ్రి నవ్వాడట - గొంతు కోసి చంపేసిన కొడుకు - సైకో అంటే వీడే !
Embed widget