అన్వేషించండి

పరీక్షలకు సిద్దమా? ఎవరు దోషి, ఎవరు నిర్దోషి తేలేది ఎలా?

అధికార బీఆర్‌ఎస్‌, బీజేపీ అవినీతి, డ్రగ్స్‌, మనీలాండరింగ్‌ వంటి వాటిపై దృష్టి పెట్టాయి. ప్రస్తుతం ఈడీ-ఐటీ -సిట్‌ వంటి కేంద్ర, రాష్ట్ర దర్యాప్తు సంస్థల సహకారంతో ఇరు పార్టీలు యుద్ధం చేస్తున్నాయి.

నిన్నటి వరకు అభివృద్ధిపై పార్టీల మధ్య సవాళ్లు ఉండేవి. కానీ ఇప్పుడు స్కాంలు, డ్రగ్స్‌ వంటి వాటిపై పార్టీల మధ్య సవాళ్లు నడుస్తున్నాయి. పాలనలో పోటీపడాల్సిన రాజకీయనేతలు, పార్టీలు ఇప్పుడు అవినీతిలో పోటీపడుతున్నాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. తెలంగాణలో రాజకీయ విమర్శలు ఎప్పుడో వ్యక్తిగతంగా మారిపోయాయి. అయితే నిన్నటివరకు నీ హయాంలో ఏం అభివృద్ధి జరిగింది.. మీ పార్టీ ప్రజలకు ఏం చేసింది అన్నదానిపై రాజకీయనేతలు, పార్టీలు సవాళ్లు చేసుకునేవి. ఎనీ సెంటర్‌ ఎనీ టైమ్‌ ప్రజా వేదికపై చర్చకు సిద్ధమా అని నేతలు సవాళ్లకు తెరలేపేవారు. 

ఇప్పుడు రోజులు మారాయి. రాజకీయాలు మారాయి. కొత్త ట్రెండ్‌ లో కొత్త సవాళ్లతో కొత్త పోకడలకు పోతున్నారు రాజకీయనేతలు, పార్టీలు అన్న వాదన బలంగా వినిపిస్తోంది. అధికార బీఆర్‌ఎస్‌, బీజేపీ ప్రస్తుతం అవినీతి, డ్రగ్స్‌, మనీలాండరింగ్‌ వంటి వాటిపై దృష్టి పెట్టాయి. ప్రస్తుతం ఈడీ-ఐటీ -సిట్‌ వంటి కేంద్ర, రాష్ట్ర దర్యాప్తు సంస్థల సహకారంతో ఇరు పార్టీలు యుద్ధం చేస్తున్నాయి. ఈ ఫైటింగ్‌ ఎప్పటివరకు ఉంటుందో తెలియదు కానీ ప్రస్తుతం మాత్రం ఇరు పార్టీల నేతలు ఎవరు ఎంత అవినీతికి పాల్పడ్డారు..ఏ రూపంలో స్కాంలు చేస్తున్నారు.. ఎవరు ఏ దందాలు నడిపిస్తున్నారు అన్నదానిపై  సవాళ్లు చేసుకుంటున్నారు. ఇది ఇంకా నడుస్తూ ఉండగానే ఇప్పుడు ఇంకాస్త దూకుడు పెంచారు. 

బెంగళూరు డ్రగ్స్‌ కేసులో మంత్రి కెటిఆర్‌ హస్తం ఉందని ఆరోపిస్తోంది బీజేపీ. అంతేకాదు డ్రగ్స్‌ అలవాటున్న కెటిఆర్‌ దమ్ముంటే పరీక్షలు చేయించుకోవాలని సవాల్‌ విసిరారు. అసలు కెసిఆర్‌ ఆయన పార్టీ నేతలంతా కూడా డ్రగ్స్‌ పరీక్షలు చేయించుకుంటే అసలు నిజాలు బయటకొస్తాయని బీజేపీ గతకొంతకాలంగా ఆరోపిస్తూనే ఉంది. అంతేకాదు బెంగళూరు డ్రగ్స్‌ కేసుని తిరగతోడతామని చెప్పిన కొద్దిగంటల్లోనే ఈడీ రంగంలోకి దిగడంతోపాటు ఇప్పుడు న్యూఇయర్‌ వేడుకల సందర్భంగా నగరంలో పెద్ద ఎత్తున జరిపిన దాడుల్లో భారీగా మత్తుపదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సవాల్‌ పై స్పందించిన కెటిఆర్‌ మొన్నా మధ్య నా బొచ్చుతో సహా శరీరంలోని అన్ని భాగాలు ఇస్తాను టెస్ట్‌ చేసుకోమని బీజేపీ నేతలకు ప్రతిసవాల్‌ విసిరారు. అంతేకాదు తప్పని తేలితే కరీంనగర్‌ నడిబోడ్డున చెప్పుతో కొట్టుకోవాలని బండి సంజయ్‌తో పాటు బీజేపీ నేతలకు సవాల్‌ విసిరారు. 

కేటీఆర్‌ సవాల్‌పై కాషాయం పార్టీ కూడా ఘాటుగానే స్పందించింది. ఎప్పుడో సవాల్‌ చేస్తే ఇప్పుడా స్పందించేది.. విదేశాలు వెళ్లి ట్రీట్‌ మెంట్‌ చేయించుకున్నాక స్పందించం కాదని ఎద్దేవా చేసింది. ఇక ఇప్పుడు లైడిటెక్టర్‌ , నార్కో ఎనాలిసిస్‌ టెస్ట్‌ల వంతు వచ్చింది. ఎమ్మెల్యేల కోనుగోళ్లు కేసుని తెలంగాణ హైకోర్టు సిబీఐకి అప్పగించడంపై బీజేపీ హర్షం వక్తం చేసింది. అంతేకాదు అధికార పార్టీ తీరుపై కాషాయం నేతలు తమదైన స్టైల్లో విమర్శలు చేయడంతో మంత్రి కెటిఆర్‌ సీరియస్‌ గానే తీసుకున్నారు. స్కాంతో సంబంధంలేదన్నోళ్లు ఇప్పుడు సీబీఐకి కేసు వెళ్లగానే ఎందుకు చంకలు గుద్దుకుంటున్నారు అని కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డిని ప్రశ్నిస్తూనే  సెంట్రల్‌ బీజేపీ ఇన్వేస్టిగేషన్‌ గా మారిన సీబీఐ దర్యాప్తుతో పాటు నార్కో , లైడిటెక్టర్‌ పరీక్షలకు సిద్ధమా అని సవాల్‌ విసిరారు. మరి ఈ సవాల్‌ పై బీజేపీ రియాక్షన్‌ ఎలా ఉంటుందో తెలియదు కానీ ఇక రానున్న రోజుల్లో ఎలాంటి సవాళ్లు ప్రజల ముందుకు వస్తాయన్నది ఆసక్తికరంగా మారింది.

టాప్ హెడ్ లైన్స్

మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని బీజేపీ దగ్గరకు రానీయడం లేదు: ఏపీ మంత్రి సంచలనం
మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని బీజేపీ దగ్గరకు రానీయడం లేదు: ఏపీ మంత్రి సంచలనం
Telangana Politics: రాజకీయాల కోసం ఉత్తరాది - దక్షిణాదినే కాదు, దేవుళ్లను విడతీస్తావా.. రేవంత్ రెడ్డిపై బండి సంజయ్ ఫైర్
రాజకీయాల కోసం ఉత్తరాది - దక్షిణాదినే కాదు, దేవుళ్లను విడతీస్తావా.. రేవంత్ రెడ్డిపై బండి సంజయ్ ఫైర్
Revanth Reddy Sircilla Visit: కేసీఆర్, కేటీఆర్ కోటలపై రేవంత్ కన్ను - సిరిసిల్ల, గజ్వేల్‌లలో వేల కోట్ల అభివృద్ధి పనుల వ్యూహం.. గులాబీ పట్టును తగ్గించడం సాధ్యమేనా?
కేసీఆర్, కేటీఆర్ కోటలపై రేవంత్ కన్ను - సిరిసిల్ల, గజ్వేల్‌లలో వేల కోట్ల అభివృద్ధి పనుల వ్యూహం.. గులాబీ పట్టును తగ్గించడం సాధ్యమేనా?
AP Sachivalayam Sports Quota Scam: డీఎస్సీ ఆరోపణలపై కౌంటర్ ఎటాక్ - ఏపీ సచివాలయ ఉద్యోగాల్లో క్రీడా కోటా అక్రమాలపై త్వరలోనే శ్వేతపత్రం ?
డీఎస్సీ ఆరోపణలపై కౌంటర్ ఎటాక్ - ఏపీ సచివాలయ ఉద్యోగాల్లో క్రీడా కోటా అక్రమాలపై త్వరలోనే శ్వేతపత్రం ?

వీడియోలు

Virat Kohli's Century Sparks Viral Moment | కోహ్లీ సెంచరీ కొట్టినా స్పందించని గంభీర్
Virat Kohli Completes 15,000 ODI Runs | కెప్టెన్ గిల్‌తో బంధంపై విరాట్ కోహ్లీ కామెంట్స్
Sunil Gavaskar about Selection Committee | చీఫ్ సెలెక్టర్ పదవిపై గవాస్కర్ సంచలన వ్యాఖ్యలు
Shubman Gill After Win Over West Indies | విరాట్ పై ప్రశంసలు కురిపించిన కెప్టెన్
King Kohli's Record 55th ODI Century | వన్డేల్లో కింగ్ కోహ్లీ సరికొత్త చరిత్ర

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Essar Group US Investment : అమెరికాలో ఎస్సార్ గ్రూప్ భారీ పెట్టుబడి.. అయోవాలో రూ.1.4 లక్షల కోట్ల ఉక్కు కర్మాగారం
అమెరికాలో ఎస్సార్ గ్రూప్ భారీ పెట్టుబడి.. అయోవాలో రూ.1.4 లక్షల కోట్ల ఉక్కు కర్మాగారం
Telangana Politics: రాజకీయాల కోసం ఉత్తరాది - దక్షిణాదినే కాదు, దేవుళ్లను విడతీస్తావా.. రేవంత్ రెడ్డిపై బండి సంజయ్ ఫైర్
రాజకీయాల కోసం ఉత్తరాది - దక్షిణాదినే కాదు, దేవుళ్లను విడతీస్తావా.. రేవంత్ రెడ్డిపై బండి సంజయ్ ఫైర్
Nara Lokesh Visits Tirumala: సింగపూర్ హోంమంత్రితో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి నారా లోకేష్
సింగపూర్ హోంమంత్రితో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి నారా లోకేష్
Machilipatnam To Kurnool Trains: రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. మచిలీపట్నం - కర్నూలు మధ్య కొత్త రైలు, వారానికి 3 రోజులు సేవలు
రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. మచిలీపట్నం - కర్నూలు మధ్య కొత్త రైలు, వారానికి 3 రోజులు సేవలు
Neeru Dhanda Clinches Shooting Gold: వానలోనూ గురి తప్పని షాట్ తో నీరు ధాండా ఖాతాలో  పసిడి, వ్య‌క్తిగ‌త విభాగంలో ఇండియాకు మొట్ట‌మొద‌టి స్వర్ణం అందించి రికార్డు.. బాక్సింగ్‌లో పంచ్ పవర్ తో జోరు
వానలోనూ గురి తప్పని షాట్ తో నీరు ధాండా ఖాతాలో  పసిడి, వ్య‌క్తిగ‌త విభాగంలో ఇండియాకు మొట్ట‌మొద‌టి స్వర్ణం అందించి రికార్డు.. బాక్సింగ్‌లో పంచ్ పవర్ తో జోరు
Hepatitis B vs C : హెపటైటిస్ బి vs హెపటైటిస్ సి.. రెండింటి మధ్య తేడాలేంటి? లక్షణాలు, వ్యాప్తి, చికిత్సలు ఇవే
హెపటైటిస్ బి vs హెపటైటిస్ సి.. రెండింటి మధ్య తేడాలేంటి? లక్షణాలు, వ్యాప్తి, చికిత్సలు ఇవే
Tiger Tension in Nirmal: గడప దాటితే గండమే! సుర్జాపూర్ అడవుల్లో పెద్దపులి కలకలం- నిర్మల్ జిల్లాలో అధికారుల వార్నింగ్
గడప దాటితే గండమే! సుర్జాపూర్ అడవుల్లో పెద్దపులి కలకలం- నిర్మల్ జిల్లాలో అధికారుల వార్నింగ్
కుర్రాళ్ల బైక్‌ Triumph Tracker 400ను కేవలం రూ.30,000 డౌన్‌పేమెంట్‌తోనే సొంతం చేసుకోండి!
యూత్‌ఫుల్‌ బైక్‌ Triumph Tracker 400ను కొనడానికి లోన్‌ ఇస్తున్నారు.. డౌన్‌పేమెంట్‌, EMI డిటైల్స్‌
Embed widget