News
News
X

KCR Pan Inida Movie : పాన్ ఇండియా " ఫామ్ హౌస్ ఫైల్స్ " కి డివైడ్ టాక్ ! సైలెంట్ హిట్ కొడుతుందా ? మరుగునపడిపోతుందా ?

కేంద్రం పునాదులు కదిలిపోయే ఆధారాలు బయటపెడతానన్న కేసీఆర్ విడుదల చేసిన వీడియోలు.. అనుకున్నంతగా ఆకట్టుకోలేదు. అందులో ఏముందన్న వాదన ఎక్కువ మంది వినిపిస్తున్నారు. తర్వాతేం జరగబోతోంది?

FOLLOW US: 

KCR Pan Inida Movie : ఇప్పుడు చూసింది ట్రైలరే.. ముందు పాన్ ఇండియా సినిమా చూపిస్తాం. తెలుగు సినిమాలు పాన్ ఇండియా హిట్లు కొడుతూంటే.. మేము ఎందుకు కొట్టలేము అని చెబుతూ.. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫామ్ హౌస్ ఫైల్స్ విషయంలో అంచనాలు పెంచేశారు. లీకైన రెండు ఆడియోలు కేలవం ట్రైలరేనని ఆయన ఉద్దేశం. అదే సమయంలో వీడియోలు కూడా ఉన్నాయని వాటిని బయట పెడతారని చెప్పుకున్నారు. అదే సమయంలో మునుగోడులో బహిరంగసభలో ప్రసంగించిన కేసీఆర్ కేంద్ర ప్రభుత్వం పునాదులు కదిలిపోయే సమాచారం తమ దగ్గర ఉందన్నారు. దీంతో అంచనాలు పెరిగిపోయాయి. పోలింగ్ ముగిసిన వెంటనే.. కేసీఆర్ ప్రెస్ మీట్ అని చెప్పడం.. వెంటనే సిబ్బంది అక్కడ వీడియోలు చూపించడానికి ఓ భారీ టీవీని ఏర్పాటు చేయడంతో.. "పాన్ ఇండియా" సినిమా రిలీజ్ ఫిక్సయిందనుకున్నారు. అందరూ ఉత్కంఠగా చూశారు. కేసీఆర్, కేటీఆర్ చెప్పిన పాన్ ఇండియా సినిమా చూపించారు. తీరిగ్గా చూడమని అందరికీ పంపారు. మరి టాక్ ఎలా ఉంది?

బాక్సులు బద్దలైపోతాయన్నట్లుగా అంచనాలు పెంచేసిన  టీఆర్ఎస్ పెద్దలు !

అదేదో సినిమాలో హీరో చెప్పినట్లుగా ఈ విజిటింగ్ కార్డే పెద్ద విష్ణుచక్రం అన్నట్లుగా ఈ వీడియోలే పెద్ద బ్రహ్మస్త్రం అన్నట్లుగా చేసిన ప్రచారానికి తీరా ఆ వీడియోలు విడుదలైన తర్వాత వచ్చిన స్పందనకు సంబంధం లేకుండా పోయింది. జాతీయ స్థాయిలో అసలు ఈ వీడియోలను ఎవరూ పట్టించుకోలేదు. గంటకుపైగా ఉన్న వీడియోలో తెలుగు మీడియాకు కూడా  అంత పెద్ద స్టఫ్ కనిపించలేదు. నిజంగా కుట్రలు చేసే వారు అంత వివరంగా మాట్లాడుకోరని.. వారేదో కావాలని చెబుతున్నట్లుగా ఇదంతా చెప్పినట్లుగా ఉందన్న అభిప్రాయం ఎక్కువ మంది వినిపించారు. ఎవరికీ తెలియని రామచంద్ర భారతి, సింహయాజిలు నేరుగా ఎమ్మెల్యేలను కొనేంత ఎక్కడిదని ఎక్కువ మంది భావిస్తున్నారు. ఎమ్మెల్యేలు కూడా ముక్కూముఖం తెలియని వారితో ఎందుకు డీల్ మాట్లాడుకుంటారన్నది ప్రధానంగా వస్తున్న సందేహం. దీంతో ఈ వీడియోలు అనుకున్నంతగా ప్రజల్లోకి వెళ్లలేదు. 

కేసీఆర్ ఏమైనా తక్కువ చేశారా అన్న విశ్లేషణలు !

News Reels

నిజానికి ఎమ్మెల్యేల కొనుగోలు చాలా సీరియస్ ఇష్యూ. అందుకే కేసీఆర్ చాలా సీరియస్‌గా స్పందించారు. ప్రజాస్వామ్య హత్య జరుగుతోందన్నారు. ఎనిమిది రాష్ట్రాల్లో ప్రభుత్వాలను ఎలా పడగొట్టారో కూడా వివరించారు. ముందు ముందు ఏ ఏ రాష్ట్ర ప్రభుత్వాలను టార్గెట్ చేయాలనుకుంటున్నారో కూడా చెప్పారు. దానికి ఆధారాలు కూడా.. వీడియో రూపంలో ఉన్నాయి. కానీ ఈ ప్రెస్ మీట్ పెట్టిన వెంటనే చాలా మంది ఇంత కాలం కేసీఆర్ చేసినదేమిటి ? అనే అభిప్రాయాన్ని బయటకు వెలి బుచ్చారు. కేసీఆర్ తెలంగాణ ఏర్పడిన వెంటనే రాజకీయ పునరేకీకరణ పేరుతో ఇతర పార్టీల ఎమ్మెల్యేలందర్నీ చేర్చుకున్నారు. వారితో రాజీనామాలు కూడా చేయించలేదు. మొదటి సారి టీడీపీని విలీనం చేసుకున్నారు. రెండో సారి గెలిచాక కాంగ్రెస్‌ ఎల్పీని విలీనం చేసుకున్నారు. టీడీపీలో ఉన్న ఇద్దరు ఎమ్మెల్యేల్నీ చేర్చుకున్నారు. ఎవరితోనూ రాజీనామాలు చేయించలేదు. పైగా ఇతర పార్టీ గుర్తుతో గెలిచిన తలసాని, సబితా వంటివారికి మంత్రి పదవులు ఇచ్చారు. అందుకే కేసీఆర్.. ఎమ్మెల్యేలకు ఏమీ ఇవ్వకుండానే... పార్టీలో చేరిపోయారా అనేది ఎక్కువ మంది వద్ద నుంచి ప్రశ్న. అందుకే ఆయన వాదనలో సీరియస్ నెస్ లేకుండా పోయిందని కొంత మంది విశ్లేషణ. 

చట్టపరంగా కేసును కేసీఆరే వీక్ చేసేశారన్న అభిప్రాయం !

పాన్ ఇండియాను షేక్ చేసేంత బలం తమ వద్ద ఉన్న సాక్ష్యాలకు ఉందని తేలినప్పుడు.. కేసీఆర్ చట్ట పరంగా నిందితులకు శిక్షపడేలా చేయగలగాలి. కానీ ఎంత డబ్బు దొరికిందో కోర్టుకు చెప్పలేదు. అసలు డబ్బు రికవరీ చేసినట్లుగా పోలీసులు చెప్పలేదు. తర్వాత ఆడియోలు.. వీడియోలు ముందు న్యాయస్థానానికి ఇవ్వాలి. కానీ ఇవ్వలేదు. స్వయంగా రిలీజ్ చేశారు. చార్జిషీట్ అయ్యే వరకూఇవన్నీ సీక్రెట్ గా ఉండాలి కదా అని హైకోర్టే ..ప్రశ్నించింది. కానీ కేసీఆరే స్వయంగా రిలీజ్ చేశారు. దీంతో న్యాయపరంగా ఆ కేసును బలహీనం చేశారన్న వాదన న్యాయవర్గాల్లో ఉంది. 

సైలెంట్ హిట్ కొట్టడానికి అవకాశాలు !

అయితే ఇప్పుడు ఫామ్ హౌస్ ఫైల్స్ అనే పాన్ ఇండియా సినిమాకు వచ్చింది డివైడ్ టాకే. కానీ సైలెంట్ హిట్ కొట్టడానికి చాలా అవకాశం ఉంది. ఎందుకంటే.. కేసీఆర్ ఈ వీడియోలు మాత్రమే కాదు.. ఆ ఎమ్మెల్యేల కొనుగోళ్ల ముఠాకు సంబంధించి పూర్తి సమాచారం సేకరించారు. వారి కాల్ డేట్ మొత్తం తీసుకొచ్చారు. మొత్తం60, 70వేల పేజీల సమాచారం ఉందన్నారు. అది మొత్తం దేశంలోని అందరి న్యాయమూర్తులతో పాటు ముఖ్యమంత్రులకు కూడా పంపానన్నారు. అందలో నుంచి ఎప్పుడైనా సంచలన విషయం వెలుగులోకి రావచ్చు. అప్పులు అసలు సినిమా ప్రారంభం కావొచ్చు. కానీ ఇప్పటికైతే.. మాత్రం ఫామ్ హౌస్ ఫైల్స్‌కు అనుకున్నంతగా మైలేజీ రాలేదు. 

Published at : 05 Nov 2022 06:00 AM (IST) Tags: CM KCR MLA purchase case Farm house files political pan India movie allegations against BJP

సంబంధిత కథనాలు

BJP Vishnu  : దుర్గామాత ప్రసాదానికి అపచారంపై బీజేపీ ఆగ్రహం - ఆలయాల్లో అన్యమతస్తులపై చర్యలు తీసుకోవాలని విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్ !

BJP Vishnu : దుర్గామాత ప్రసాదానికి అపచారంపై బీజేపీ ఆగ్రహం - ఆలయాల్లో అన్యమతస్తులపై చర్యలు తీసుకోవాలని విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్ !

హైకోర్టును ఆశ్రయించిన బండి సంజయ్‌- పాదయాత్రకు అనుమతి ఇవ్వాలని రిక్వస్ట్

హైకోర్టును ఆశ్రయించిన బండి సంజయ్‌- పాదయాత్రకు అనుమతి ఇవ్వాలని రిక్వస్ట్

Bandi Sanjay: బండి సంజయ్‌‌ పాదయాత్రకు అనుమతి నిరాకరణ - బండి అరెస్టుకు పోలీసుల యత్నం, కానీ!

Bandi Sanjay: బండి సంజయ్‌‌ పాదయాత్రకు అనుమతి నిరాకరణ - బండి అరెస్టుకు పోలీసుల యత్నం, కానీ!

Talasani: 125 ఏళ్ల పార్టీ అంతరించిపోయింది, బీజేపీ నీటిమీద గాలి బుడగ లాంటిది: మంత్రి తలసాని

Talasani: 125 ఏళ్ల పార్టీ అంతరించిపోయింది, బీజేపీ నీటిమీద గాలి బుడగ లాంటిది: మంత్రి తలసాని

Andhra Early Polls : ఏపీలో ముంచుకొస్తున్న ముందస్తు - జగన్ ఇంత హడావుడికి కారణం అదేనా ?

Andhra Early Polls : ఏపీలో ముంచుకొస్తున్న ముందస్తు - జగన్ ఇంత హడావుడికి కారణం అదేనా ?

టాప్ స్టోరీస్

ఏప్రిల్ నుంచి విశాఖ కేంద్రంగా ఏపీ సీఎం జగన్ పరిపాలన - మంత్రి గుడివాడ అమర్నాథ్

ఏప్రిల్ నుంచి విశాఖ కేంద్రంగా ఏపీ సీఎం జగన్ పరిపాలన - మంత్రి గుడివాడ అమర్నాథ్

Minister Ambati Rambabu : పవన్ సినిమాల్లోనే హీరో, రాజకీయాల్లో పెద్ద జోకర్ - మంత్రి అంబటి రాంబాబు

Minister Ambati Rambabu : పవన్ సినిమాల్లోనే హీరో, రాజకీయాల్లో పెద్ద జోకర్ - మంత్రి అంబటి రాంబాబు

IT Politics : ఐటీ ఎదుట హాజరైన మల్లారెడ్డి కుటుంబీకులు - విచారణ తర్వాత ఫుల్ కాన్ఫిడెన్స్ !

IT Politics : ఐటీ ఎదుట హాజరైన మల్లారెడ్డి కుటుంబీకులు -  విచారణ తర్వాత ఫుల్ కాన్ఫిడెన్స్ !

TS New DGP : నూతన డీజీపీ నియామకంపై తెలంగాణ సర్కార్ కసరత్తు, రేసులో ఆ ముగ్గురు!

TS New DGP : నూతన డీజీపీ నియామకంపై తెలంగాణ సర్కార్ కసరత్తు, రేసులో ఆ ముగ్గురు!