News
News
వీడియోలు ఆటలు
X

Khammam Politics: వైరాలో మాజీ ఎమ్మెల్యే వరుస పర్యటనలు, ఈసారి టిక్కెట్‌ ఆమెకేనా? గులాబీ శ్రేణుల్లో హాట్ టాపిక్

మాజీ ఎమ్మెల్యే, టీఎస్‌పీఎస్‌సీ సభ్యురాలు బానోత్‌ చంద్రావతి నియోజకవర్గంలో చేస్తున్న వరుస పర్యటనలతో ఆమెకు టిక్కెట్‌ వస్తుందా..? అనేది చర్చానీయాంశంగా మారింది.

FOLLOW US: 
Share:

నియోజకవర్గాల పునర్విభజన అనంతరం ఖమ్మం జిల్లాలో కొత్తగా ఏర్పడిన వైరా నియోజకవర్గం నుంచి 2009లో బానోత్‌ చంద్రావతి విజయం సాదించారు. వైద్యురాలిగా ఉన్న చంద్రావతి అసెంబ్లీలో అతి పిన్న వయస్కురాలిగా అప్పట్లో సంచలనం సృష్టించారు. సీపీఐ పార్టీ నుంచి పోటీ చేసి విజయం సాదించిన చంద్రావతి ఆ తర్వాత 2014 ఎన్నికల ముందు టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరి ఓటమి పాలయ్యారు. ఈ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ నుంచి పోటీ చేసిన బానోత్‌ మదన్‌లాల్‌ విజయం సాదించారు. అయితే ఆ తర్వాత ఆయన కూడా టీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకోవడంతో చంద్రావతిని టీఎస్‌పీఎస్‌సీ సభ్యురాలిగా ప్రభుత్వం నియమించింది. అయితే 2018 ఎన్నికల్లో టిక్కెట్‌ రానప్పటికీ టీఆర్‌ఎస్‌ పార్టీలోనే ఉంది. ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ టిక్కెట్‌పై పోటీ చేసిన బానోత్‌ మదన్‌లాల్‌పై అనూహ్యంగా ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన రాములునాయక్‌ విజయం సాదించారు.

టిక్కెట్‌ వేటలో ఆ ముగ్గురు..
రాములు నాయక్‌ విజయం సాదించిన తర్వాత వివాదస్పద వ్యాఖ్యలు చేస్తూ తరుచూ వార్తలో ఉండటం, ఆయనపై వ్యతిరేకత పెరిగిందనే భావన నెలకొనడంతో మాజీ ఎమ్మెల్యేలు రంగంలోకి దిగారు. మరోవైపు సొంత పార్టీ నేతలపై కేసులు పెట్టేంత వరకు ఎమ్మెల్యే వ్యవహార శైలి ఉండటంతో అటు మదన్‌లాల్, చంద్రావతి ఇద్దరు టిక్కెట్‌ బరిలో తామున్నామంటూ తమ క్యాడర్‌ను సన్నద్దం చేసుకుంటున్నారు. మరోవైపు ఎమ్మెల్యే సైతం తరుచూ పర్యటనలు చేస్తున్నప్పటికీ వరుసగా ఈ ఇద్దరు నేతలు నియోజకవర్గంలో పర్యటిస్తుండటం, కార్యకర్తలతో మమేకం అయ్యేందుకు చూస్తుండటంతో వైరాలో టీఆర్‌ఎస్‌ టిక్కెట్‌ ఎవరికి వస్తుందనే విషయం ఇప్పుడు నియోజకవర్గ వ్యాప్తంగా హాట్‌ టాపిక్‌గా మారింది. 
వరుస పర్యటనలో బిజీగా చంద్రావతి..
2014 తర్వాత కొంత స్పీడ్‌ తగ్గించిన బానోత్‌ చంద్రావతి ఇప్పుడు నియోజకవర్గంలో వరుస పర్యటనలతో బిజీగా మారారు. పరామర్శలు, శుభకార్యాలకు హాజరవుతూ పాత క్యాడర్‌ను కలుసుకునే పనిలో పడ్డారు. 2018 ఎన్నికల్లో టిక్కెట్‌ రానప్పటికీ పార్టీకి విధేయురాలిగా ఉన్న తనకే ఈ దఫా టిక్కెట్‌ వరిస్తుందని ఆశతో ఉన్నారు. మరోవైపు ఇద్దరి నేతల మద్య వైరం బాగా పెరగడంతో అది కాస్తా తనకు కలిసొస్తుందనే ఆశతో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల కాలంలో నియోజకవర్గంలో తన క్యాడర్‌ను కలవడంతోపాటు వరుస పర్యటనలతో బిజీగా ఉండటం గమనార్హం.

దీనికి తోడు జిల్లాలో టీఆర్‌ఎస్‌ పార్టీలో వర్గపోరు నెలకొన్న నేపథ్యంలో వర్గాలకు అతీతంగా ఉండటం తనకు కలిసొస్తుందనే భావనలో ఉన్నారు. దీంతోపాటు కేసీఆర్, కేటీఆర్‌ ఆశీస్సులు చంద్రావతికే ఉన్నాయని, ఆమెకే టిక్కెట్‌ వస్తుందని క్యాడర్‌ కూడా చెప్పడం నియోజకవర్గంలో చర్చగా మారింది. ఇదిలా ఉండగా ఇటీవల కాలంలో ఎమ్మెల్యే సైతం నియోజకవర్గంలో బాగా పర్యటించడం, వరుస కార్యక్రమాలతో బిజీగా మారిన నేపథ్యంలో మరి ఈ ఇద్దరిలో ఎవరికి టిక్కెట్‌ వస్తుంది? లేక బానోత్‌ మదన్‌లాల్‌కే టీఆర్‌ఎస్‌ పెద్దలు మొగ్గు చూపుతారా..? అనే విషయం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది. ఏది ఏమైనప్పటికీ అధికార పార్టీలో మూడు ముక్కలాటగా మారిన వైరా నియోజకవర్గంలో టిక్కెట్‌ ఎవరిని వరిస్తుందనేది వేచి చూడాల్సిందే.

Published at : 01 Sep 2022 08:51 AM (IST) Tags: Khammam News wyra politics banoth chandravati mla ramulu naiak banoth madanlal

సంబంధిత కథనాలు

TDP Manifesto :  టీడీపీ మేనిఫెస్టోకు వైఎస్ఆర్‌సీపీనే ఎక్కువ ప్రచారం కల్పిస్తోందా ? అధికార పార్టీ వ్యూహాత్మక తప్పిదం చేస్తోందా ?

TDP Manifesto : టీడీపీ మేనిఫెస్టోకు వైఎస్ఆర్‌సీపీనే ఎక్కువ ప్రచారం కల్పిస్తోందా ? అధికార పార్టీ వ్యూహాత్మక తప్పిదం చేస్తోందా ?

Delhi Liquor ScaM : ఢిల్లీ లిక్కర్ స్కాంలో అప్రూవర్ల టార్గెట్ ఎవరు ? కేజ్రీవాలా ? కవితనా ?

Delhi Liquor ScaM :  ఢిల్లీ లిక్కర్ స్కాంలో అప్రూవర్ల టార్గెట్ ఎవరు ? కేజ్రీవాలా ? కవితనా ?

కాపీ చంద్రబాబు బిసిబేళ బాత్, పులిహోరా మేనిఫెస్టో వండారు, పత్తికొండలో సీఎం జగన్ ఆగ్రహం

కాపీ చంద్రబాబు బిసిబేళ బాత్, పులిహోరా మేనిఫెస్టో వండారు, పత్తికొండలో సీఎం జగన్ ఆగ్రహం

నాని పార్టీ మారేందుకు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారా? జరుగుతున్న ప్రచారంపై ఎంపీ రియాక్షన్ ఏంటీ?

నాని పార్టీ మారేందుకు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారా? జరుగుతున్న ప్రచారంపై ఎంపీ రియాక్షన్ ఏంటీ?

విజయసాయి రెడ్డిపై బృహత్తర బాధ్యత- బాలినేనిని జగన్ పిలిచింది అందుకే!

విజయసాయి రెడ్డిపై బృహత్తర బాధ్యత- బాలినేనిని జగన్ పిలిచింది అందుకే!

టాప్ స్టోరీస్

Balineni Meet Jagan : సీఎం జగన్‌తో బాలినేని భేటీ - చర్చలపై ఏం చెప్పారంటే ?

Balineni Meet Jagan :  సీఎం జగన్‌తో బాలినేని భేటీ - చర్చలపై ఏం చెప్పారంటే ?

Telangana Formation Day: తెలంగాణ మలిదశ ఉద్యమాన్ని మలుపు తిప్పిన 12 సంఘటనలు, చారిత్రక ఘట్టాలు ఇవే!

Telangana Formation Day: తెలంగాణ మలిదశ ఉద్యమాన్ని మలుపు తిప్పిన 12 సంఘటనలు, చారిత్రక ఘట్టాలు ఇవే!

TSRTC: తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పిన సజ్జనార్, వచ్చే నెల నుంచి పండగే!

TSRTC: తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పిన సజ్జనార్, వచ్చే నెల నుంచి పండగే!

Pareshan Movie Review - 'పరేషాన్' సినిమా రివ్యూ : 'మసూద' తర్వాత తిరువీర్‌కు మరో హిట్!?

Pareshan Movie Review - 'పరేషాన్' సినిమా రివ్యూ : 'మసూద' తర్వాత తిరువీర్‌కు మరో హిట్!?