అన్వేషించండి

Target Harish Rao: రేవంత్, కవిత సహా అందరికీ టార్గెట్ హరీష్ రావే - ఆయనను దూరం చేస్తే బీఆర్ఎస్ పనైపోతుందా?

Harish Rao: తెలంగాణ రాజకీయాల్లో అందరూ హరీష్ రావును టార్గెట్ చేస్తున్నారు. విభిన్న పద్దతుల్లో ఆయనపై దాడి జరుగుతోంది. ఈ దాడిని హరీష్ రావు కూడా బలంగా ఎదుర్కొంటున్నారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • కవిత, రేవంత్ రెడ్డి ఇద్దరూ హరీష్ రావుపై విమర్శలు చేస్తున్నారు.
  • బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత విభేదాలు, హరీష్ రావు భవిష్యత్తు చర్చనీయాంశమయ్యాయి.
  • హరీష్ రావుపై ఆరోపణలు, సీఎం వ్యాఖ్యలు పార్టీలో గందరగోళాన్ని సృష్టిస్తున్నాయి.
  • బీఆర్ఎస్‌ను బలహీనపరిచేందుకు హరీష్‌ను టార్గెట్ చేస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Telangana politics Harish Rao hot Topic: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత హరీష్ రావుపై డైరక్ట్ ఎటాక్ చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆయనపై బీఆర్ఎస్‌ పార్టీలో సందేహం వచ్చేలా మాట్లాడుతున్నారు. అది కూడా ఓ రకంగా దాడే. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీలో ఓ వర్గం ఆయనకు వ్యతిరేకంగా ఉందన్న ప్రచారం ఉంది. ఈ క్రమంలో హరీష్ రావు సెంటరాఫ్ పాలిటిక్స్  గా మారారు. ఆయనే ఎందుకు ఇంత కీలకంగా మారారు?

కవిత, రేవంత్ ఇద్దరిదీ హరీష్ విషయంలో ఒకటే ప్లాన్

హరీష్ రావు ప్రస్తుతం ఆయన రాజకీయంగా అత్యంత సంక్లిష్టమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఒకవైపు సొంత పార్టీ నేతలు, మరోవైపు ప్రత్యర్థి పార్టీల వ్యూహాల మధ్య హరీష్ రావు  శీలపరీక్ష  ఎదుర్కోవాల్సి వస్తోంది. ఆయన రాజకీయ భవిష్యత్తును దెబ్బతీయడం ద్వారా బీఆర్ఎస్ పార్టీని బలహీనపరచాలనే భారీ స్కెచ్ నడుస్తోందనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది.    కవిత  ఆయనపై చేస్తున్న ఆరోపణలు పార్టీ కేడర్‌లో గందరగోళం సృష్టిస్తున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి ఆరోపణల నుంచి పార్టీ అంతర్గత పరిణామాల వరకు హరీష్ రావునే బాధ్యుడిని చేసేలా ఆమె ఆరోపిస్తున్నారు.  కేటీఆర్ నాయకత్వాన్ని అడ్డుకుని, పార్టీని తన గుప్పిట్లోకి తీసుకునేందుకు హరీష్ ఒక ప్రత్యేక వర్గాన్ని తయారు చేసుకున్నారని కూడా ప్రకటించారు. 

సీఎం రేవంత్‌దీ అదే వ్యూహం ! 

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుసరిస్తున్న వ్యూహం భిన్నమైన మార్గంలో ఉన్నా హరీష్ ను బీఆర్ఎస్ కు దూరం చేయడంలో భాగంగానే వ్యాఖ్యలు చేస్తున్నారని అర్థం చేసుకోవచ్చు.  హరీష్ రావును పొగుడుతున్నట్లుగా.. బీఆర్ఎస్ పార్టీ ఆయన గుప్పిట్లోకి పోతుందని.. ఆయనే నాయకత్వం వహిస్తారన్నట్లుగా మాట్లాడుతున్నారు. కేటీఆర్ ఫెయిలయ్యారని అంటున్నారు.  హరీష్ రావుపై సాఫ్ట్ కార్నర్ ప్రదర్శించడం ద్వారా, కేటీఆర్ నాయకత్వానికి ఆయన వ్యతిరేకమన్నట్లుగా రేవంత్ మాట్లాడుతున్నారు. రేవంత్ మాటలు ఇబ్బందికరంగా మారేలా ఉండటంతో హరీష్ రావు వెంటనే స్పందించారు. కేటీఆర్‌కు తనకు..మిత్రభేదం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.   తన గుండెల్లో కేసీఆర్, గులాబీ జెండా ఉన్నాయని చెబుతున్నారు. 

కేటీఆర్ వర్గమూ హరీష్‌ పై అనుమానపు చూపులు ! 

కేటీఆర్, హరీష్ రావుల మధ్య ఉండే కనిపించని పోటీ ఉందన్న చర్చ బీఆర్ఎస్‌లో ఉంది. క్షేత్రస్థాయిలో హరీష్ రావుకు ఉన్న పట్టు కేటీఆర్‌కు లేదని అంటున్నారు. అయితే కేసీఆరే తమ నేత అని ఆయన ఏది చెబితే అది చేస్తామని హరీష్ రావు అంటున్నారు. కానీ  హరీష్ రావును బీఆర్ఎస్ పార్టీకి దూరం చేయగలిగితే, బీఆర్ఎస్ బలహీనపడటమే కాకుండా చీలిపోయే అవకాశం ఉందని ప్రత్యర్థులు భావిస్తున్నారు. అందుకే అందరూ కలిసి ఆయనను టార్గెట్ చేస్తున్నారు. ఇప్పటివరకు పార్టీ అంతా సజావుగానే ఉందని చూపిస్తున్నా, లోలోపల పెరుగుతున్న అనుమానాల సెగ ఎప్పటికైనా ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. ఈ రాజకీయ చదరంగంలో హరీష్ రావు తన అస్తిత్వాన్ని, విశ్వసనీయతను ఎలా కాపాడుకుంటారో అన్నదే ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. 

టాప్ హెడ్ లైన్స్

Dharmana Prasada Rao : మరో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం తప్పదు - భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ క్రెడిట్ జగన్‌దే - ధర్మాన సంచలన వ్యాఖ్యలు |
మరో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం తప్పదు - భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ క్రెడిట్ జగన్‌దే - ధర్మాన సంచలన వ్యాఖ్యలు |
Rahul Gandhi Speech In Parliament: కొందరు మూర్ఖులు ఎవరి మాట వినరు, తమకు నచ్చిందే చేస్తారు? రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై సభలో దుమారం
కొందరు మూర్ఖులు ఎవరి మాట వినరు, తమకు నచ్చిందే చేస్తారు? రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై సభలో దుమారం
Chandrababu 4.0 PR Strategy: చంద్రబాబు 4.0'లో మారిన పీఆర్ మార్క్ - మోదీ వ్యూహంతో రీ-పొజిషనింగ్ - అంతా వైరల్ కంటెంటే!
చంద్రబాబు 4.0'లో మారిన పీఆర్ మార్క్ - మోదీ వ్యూహంతో రీ-పొజిషనింగ్ - అంతా వైరల్ కంటెంటే!
Dhanush Political Entry: విజయ్ బాటలో ధనుష్ ? తమిళ రాజకీయాల్లోకి మరో హీరో.. 2031 లక్ష్యంగా కామ్‌గా స్క్రిప్ట్!
విజయ్ బాటలో ధనుష్ ? తమిళ రాజకీయాల్లోకి మరో హీరో.. 2031 లక్ష్యంగా కామ్‌గా స్క్రిప్ట్!

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
West Bengal Birbhum Police Raid: బెంగాల్‌లో షాకింగ్ రైడ్ - బస్సు డ్రైవర్ ఇంట్లో రూ.20 కోట్ల నగదు, 15 కిలోల బంగారం స్వాధీనం!
బెంగాల్‌లో షాకింగ్ రైడ్ - బస్సు డ్రైవర్ ఇంట్లో రూ.20 కోట్ల నగదు, 15 కిలోల బంగారం స్వాధీనం!
Tamil Nadu Head Shaving Scam: ప్రభుత్వ పథకం పేరిట వింత మోసం - గుండు గీయించుకుంటే రూ.15 వేలంటూ మహిళలకు బురిడీ!
ప్రభుత్వ పథకం పేరిట వింత మోసం - గుండు గీయించుకుంటే రూ.15 వేలంటూ మహిళలకు బురిడీ!
Ram Charan : ఆస్పత్రి నుంచి రామ్ చరణ్ డిశ్చార్జ్ - ఉపాసనతో కలిసి అయ్యప్ప ఆలయానికి మెగా పవర్ స్టార్
ఆస్పత్రి నుంచి రామ్ చరణ్ డిశ్చార్జ్ - ఉపాసనతో కలిసి అయ్యప్ప ఆలయానికి మెగా పవర్ స్టార్
Vaibhav Sooryavanshi News: వైభవ్ సూర్యవంశీకి ప్ర‌మోష‌న్.. ఆజ‌ట్టుకు  వైస్ కెప్టెన్ గా వ్య‌వ‌హ‌రించ‌నున్న 15 ఇయ‌ర్స్ కిడ్
వైభవ్ సూర్యవంశీకి ప్ర‌మోష‌న్.. ఆ జ‌ట్టుకు  వైస్ కెప్టెన్ గా వ్య‌వ‌హ‌రించ‌నున్న 15 ఇయ‌ర్స్ కిడ్
Maruti Suzuki Victoris EMI calculator: హైదరాబాద్‌లో మారుతి విక్టోరిస్‌ కొనాలి అంటే నెలకు చెల్లించాల్సిన EMI ఎంత?
హైదరాబాద్‌లో మారుతి విక్టోరిస్‌ కొనాలి అంటే నెలకు చెల్లించాల్సిన EMI ఎంత?
Inter Student Commits Suicide: నువ్వేమైనా మంత్రి కొడుకువా? మహిళా లెక్చరర్ అవమానించడంతో ఇంటర్ టాపర్ ఆత్మహత్య- గద్వాలలో ఘటన
నువ్వేమైనా మంత్రి కొడుకువా? మహిళా లెక్చరర్ అవమానించడంతో ఇంటర్ టాపర్ ఆత్మహత్య- గద్వాలలో ఘటన
Korean Horror Thriller OTT : దెయ్యాల కోసం వేట... వెంటాడే మృత్యువు - ఓటీటీలోకి సెన్సేషనల్ హారర్ థ్రిల్లర్... తెలుగులోనూ స్ట్రీమింగ్
దెయ్యాల కోసం వేట... వెంటాడే మృత్యువు - ఓటీటీలోకి సెన్సేషనల్ హారర్ థ్రిల్లర్... తెలుగులోనూ స్ట్రీమింగ్
GHMC Indiramma Housing Scheme: KCR డబుల్ బెడ్‌రూం ఇళ్ల ఫార్ములాతోనే కాంగ్రెస్ ఇందిరమ్మ బెట్ - దరఖాస్తులతో ఓట్లు రాలుతాయా?
డబుల్ బెడ్‌రూం ఇళ్ల ఫార్ములాతోనే కాంగ్రెస్ ఇందిరమ్మ బెట్ - దరఖాస్తులతో ఓట్లు రాలుతాయా?
Embed widget