అన్వేషించండి

YSRCP Rebels : జగన్ పాలనపై వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యేల వరుస విమర్శలు - రాజకీయమా ? ప్రజాగ్రహం తట్టుకోలేకపోతున్నారా ?

జగన్ పై వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యేల్లో అసంతృప్తి రోజు రోజుకు పెరుగుతోంది. రొజుకొకరు చొప్పున పాలనపై విమర్శలు చేస్తున్నారు.


YSRCP Rebels :   ఏపీ సిఎం , వైసీపీ అధినేతపై నిన్నటివరకు ప్రతిపక్షాలే విమర్శలు, ఆరోపణలు చేసేవి. కానీ ఇప్పుడు సొంత పార్టీలో కొందరు నేతలు నిరసనగళమెత్తుతున్నారు. ఒక్కరు కాదు ఇద్దరు కాదు రాను రాను ఈ సంఖ్య పెరుగుతూండటం ఆ పార్టీలో కలవరం రేపుతోంది. వైసీపీ నేతల ధిక్కార స్వరానికి కారణం ఏమిటన్నదానిపై రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి. ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందని కొంత మంది ఎమ్మెల్యేలు సర్దుకుంటున్నారని కొంత మంది.. టిక్కెట్ దక్కే చాన్స్ లేని వాళ్లు వేరే దారి చూసుకుంటున్నారని మరికొంత మంది విశ్లేషిస్తున్నారు. 

జగన్ పాలనపై వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్న ఎమ్మెల్యేలు 

వైసీపీలో నిన్నటివరకు జగన్‌ మాటే మా మాట..ఆయన బాటే మాకు బాట అంటూ చెప్పుకొచ్చిన నేతలంతా ఇప్పుడు ఒక్కొక్కరిగా నిరసన గళమెత్తుతున్నారు. ఇవాళ ఆనం, నిన్నరాచమల్లు, మొన్న కోటంరెడ్డి ఇలా  రోజుకొకరు జగన్‌ పాలనపై అసహనం వ్యక్తం చేయడంతో  అధికారపార్టీలో చర్చకు తావిస్తోంది. నెల్లూరు జిల్లా వైసీపీలో సఖ్యత లేదు. ప్రతీ నియోజకవర్గంలోనూ ఇదే తీరు. ఆనం, అనిల్‌ యాదవ్‌, కోటంరెడ్డి, కాకాణి ఇలా చెప్పుకుంటే జిల్లా వైసీపీ నేతలందంతా ఎవరి దారి వారిదే. ఎవరి తీరు వారిదే అన్నట్లు ఉంటుంది. బలనిరూపణ కోసం కొందరు, జగన్‌ చూపు పడాలని మరికొందరు ఎవరికి తోచిన విధంగా వారు జిల్లాలో చక్రం తిప్పేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో భేదాభిప్రాయాలు మరింత ఎక్కువై రోడ్డునపడుతున్నారు. ఈ విషయంగా పలుమార్లు జగన్‌ జిల్లా నేతలకు నచ్చచెప్పినా ఫలితం మాత్రం అంతంత మాత్రమేనన్న టాక్‌ ఉంది. ఈ క్రమంలోనే మరోసారి సంచలన వ్యాఖ్యలకు తెరలేపారు ఆనం రామనారాయణ రెడ్డి. ప్రతిపక్షాల విమర్శలకు బలం చేకూర్చేలా ఆనం మాట్లాడిన తీరు మరోసారి ఆ పార్టీలో కలకలం రేపుతున్నాయి. 

పార్టీపై కాదు..పాలనపై అసంతృప్తి వ్యక్తం చేయడమే ఇక్కడ కీలకం ! 

గతంలోనూ ఇలాంటి వ్యాఖ్యలతోనే సొంత పార్టీ నేతల నుంచి విమర్శలు ఎదుర్కోన్నారు. ఇప్పుడు మరోసారి తన నోటితీరుతో వార్తల్లో నిలిచారు. ఆనం మాత్రమే కాదు ఆజిల్లా నేతల్లో ఒకరైన కోటం రెడ్డిది కూడా ఇదే తీరు. ప్రభుత్వ పథకాలు, అధికారుల తీరుపై ఎప్పుడూ ఆయన చిర్రుబుర్రులాడుతూనే ఉంటారు. ప్రస్తుతం పెన్షన్ల కోతపై విపక్షాల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోన్న జగన్‌ ప్రభుత్వానికి కోటం రెడ్డి రూపంలోనూ వ్యతిరేకత ఎదురువుతోంది. ఎట్టిపరిస్ధితుల్లోనూ పింఛన్లు కోత ఉండకూడదని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్‌ కూడా చేస్తున్నారు. టిడిపి అధినేతతో పాటు జనసేన అధినేత కూడా పింఛన్ల కోతని తప్పుబడుతూ జగన్‌ కి లేఖ రాయడంతో ప్రస్తుతం ఏపీలో పించన్ల ఫైటింగ్‌ లో విపక్షాలకు బలమైన ఆయుధం దొరికినట్టైంది. ఇక నల్లపురెడ్డి కూడా మొన్నటివరకు జగన్‌ తీరుపై అసంతృప్తితో ఉన్నట్లు వార్తలు వచ్చినా ఇప్పుడు గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన ఉత్సాహంగా కనిపించడంతో ఆ వార్తలకు చెక్‌ పడినట్టైంది. 

గతంలోనూ పలువురు ఎమ్మెల్యేల వ్యతిరేక కామెంట్స్ ! 

నవరత్నాల పథకాలు అన్నీ సీయం బటన్ నొక్కితే అవుతున్నాయి.క్రెడిట్ ఆయనకే వెళుతోంది. మళ్లీ పార్టీ గెలవాలంటే ఎమ్మెల్యే లకు కూడా క్రెడిట్ రావాలి కదా అంటూ దర్శి ఎమ్మెల్యే వేణుగోపాల చేసిన కామెంట్స్ కూడా గతంలో హాట్ టాపిక్ గా మారాయి.  జగన్‌ సొంత జిల్లా కడపలోనూ ఇదే తీరు కనిపిస్తోంది. ప్రొద్దూటురు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌ కూడా టీచర్లు ప్రభుత్వంపై వ్యతిరేకతతో ఉన్నారని చెప్పడంతో ఆపార్టీలో కల్లోలం మొదలైంది. నిన్నగాక మొన్న జరిగిన సచివాలయ ఉద్యోగసంఘాల ఎన్నికల్లో అధికారపార్టీ మద్దతు సంఘం గెలవడంతో పాటు ఉద్యోగులు వ్యతిరేకత జగన్‌ పాలనపై లేదన్న తీర్పు నిచ్చిందని వైసీపీ నేతలు సంబరాలు చేసుకున్నారు. అయితే ఇప్పుడు సొంత పార్టీ నేతలే ఈ తరహా విమర్శలకు దిగుతుండటంతో దిక్కుతోచని స్థితిలో పడ్డారు సీనియర్‌ నేతలు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో చురుగ్గా ఉండే నేతలకే వచ్చే ఎన్నికల్లో సీటు ఇస్తానని జగన్‌ చెప్పడం వల్లే  నిరాశలో ఉన్న నేతలు ఈ రకమైన వ్యాఖ్యలు చేస్తున్నారని వైసీపీ నేతలు కొందరు అంటున్నారు.

సర్దుకుపోండి. అసమ్మతి అన్నిచోట్లా ఉంది :  పెద్ది రెడ్డి 

అసమ్మతిపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇటీవల కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో చాలా చోట్ల అసమ్మతి ఉందని, ఆ మాటకొస్తే ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి నియోజకర్గంతోపాటు తనకు కూడా అసమ్మతి ఉందని అన్నారు. మొన్నా మధ్య అనంతపురంలోని ఓ ఫంక్షన్ హాలులో రాప్తాడు నియోజకవర్గ వైసీపీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు.  దానికి జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి అయిన పెద్దిరెడ్డి హాజరై మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. అసమ్మతిని పక్కనపెట్టి ప్రతి నాయకుడిని కలుపుకుంటూ ఎన్నికలకు వెళ్లాలని సూచించారు. మంత్రి పెద్ది రెడ్డి చెప్పినట్లు వైసీపీ నేతలు నడుచుకుంటారా? లేక అసమ్మతి గళాలు పెరుగుతూనే ఉంటాయా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: నాగబాబు కోసం పవన్ కల్యాణ్ త్యాగం -  కేబినెట్ మార్పుచేర్పుల్లో సంచలన విషయం ఇదే !
నాగబాబు కోసం పవన్ కల్యాణ్ త్యాగం - కేబినెట్ మార్పుచేర్పుల్లో సంచలన విషయం ఇదే !
Telangana News: ప్రాణాలు తీస్తున్న పాములు- కొరికి చిత్ర వధ చేస్తున్న ఎలుకలు- తెలంగాణ గురుకులాల్లో భయానక పరిస్థితులు  
ప్రాణాలు తీస్తున్న పాములు- కొరికి చిత్ర వధ చేస్తున్న ఎలుకలు- తెలంగాణ గురుకులాల్లో భయానక పరిస్థితులు  
One Nation One Election JPC: జమిలీపై జేపీసీకి చైర్మన్‌గా పీపీ చౌదరి - 21 మంది సభ్యుల నియామకం - రాజ్యసభ ప్రతినిధులు పెండింగ్
జమిలీపై జేపీసీకి చైర్మన్‌గా పీపీ చౌదరి - 21 మంది సభ్యుల నియామకం - రాజ్యసభ ప్రతినిధులు పెండింగ్
Amit Shah: అమిత్‌షాపై విపక్షాల అంబేద్కర్ అస్త్రం- సర్వత్రా విమర్శలు - సంజాయిషీ ఇచ్చుకున్న అమిత్‌షా 
అమిత్‌షాపై విపక్షాల అంబేద్కర్ అస్త్రం- సర్వత్రా విమర్శలు - సంజాయిషీ ఇచ్చుకున్న అమిత్‌షా 
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Mumbai Ferry Capsized 13 Died | నేవీ బోట్...టూరిస్ట్ బోట్ ఢీ కొట్టడంతోనే ప్రమాదం | ABP DesamAmitshah vs Rahul Gandhi Ambedkar Controversy | పార్లమెంటును కుదిపేసిన 'అంబేడ్కర్ కు అవమానం' | ABPఆటోలో అసెంబ్లీకి, కేటీఆర్ సహా బీఆఎర్ఎస్ ఎమ్మెల్యేల నిరసనరేవంత్ ఎక్కడికెళ్లినా సెక్యూరిటీని పెట్టుకో, లేకుంటే కొడతారు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: నాగబాబు కోసం పవన్ కల్యాణ్ త్యాగం -  కేబినెట్ మార్పుచేర్పుల్లో సంచలన విషయం ఇదే !
నాగబాబు కోసం పవన్ కల్యాణ్ త్యాగం - కేబినెట్ మార్పుచేర్పుల్లో సంచలన విషయం ఇదే !
Telangana News: ప్రాణాలు తీస్తున్న పాములు- కొరికి చిత్ర వధ చేస్తున్న ఎలుకలు- తెలంగాణ గురుకులాల్లో భయానక పరిస్థితులు  
ప్రాణాలు తీస్తున్న పాములు- కొరికి చిత్ర వధ చేస్తున్న ఎలుకలు- తెలంగాణ గురుకులాల్లో భయానక పరిస్థితులు  
One Nation One Election JPC: జమిలీపై జేపీసీకి చైర్మన్‌గా పీపీ చౌదరి - 21 మంది సభ్యుల నియామకం - రాజ్యసభ ప్రతినిధులు పెండింగ్
జమిలీపై జేపీసీకి చైర్మన్‌గా పీపీ చౌదరి - 21 మంది సభ్యుల నియామకం - రాజ్యసభ ప్రతినిధులు పెండింగ్
Amit Shah: అమిత్‌షాపై విపక్షాల అంబేద్కర్ అస్త్రం- సర్వత్రా విమర్శలు - సంజాయిషీ ఇచ్చుకున్న అమిత్‌షా 
అమిత్‌షాపై విపక్షాల అంబేద్కర్ అస్త్రం- సర్వత్రా విమర్శలు - సంజాయిషీ ఇచ్చుకున్న అమిత్‌షా 
Balagam Mogilaiah: అనారోగ్యంతో 'బలగం' మొగిలయ్య కన్నుమూత... జానపద కళాకారుడు ఇకలేరు
అనారోగ్యంతో 'బలగం' మొగిలయ్య కన్నుమూత... జానపద కళాకారుడు ఇకలేరు
Vijayawada Kanaka Durga Temple Hundi: మూడువారాల్లో మూడున్నర కోట్లు పైనే.. కనక దుర్గమ్మకు భక్తులు సమర్పించిన కానుకలివే!
మూడువారాల్లో మూడున్నర కోట్లు పైనే.. కనక దుర్గమ్మకు భక్తులు సమర్పించిన కానుకలివే!
Weather Update Today: అల్పపీడనంతో ఏపీలో అక్కడ వర్షాలు, ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ - తెలంగాణలో చలి పంజా
అల్పపీడనంతో ఏపీలో అక్కడ వర్షాలు, ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ - తెలంగాణలో చలి పంజా
Look Back 2024: అన్నకు ఎదురెళ్ళిన బాణం.. షర్మిల 2024లో ప్లస్సు అదే.. మైనస్ అదే
అన్నకు ఎదురెళ్ళిన బాణం.. షర్మిల 2024లో ప్లస్సు అదే.. మైనస్ అదే
Embed widget