CPI Narayana Controversy: నాడు పోరాటాల నారాయణ - నేడు వివాదాస్పద ప్రకటనల నారాయణ ! ఇలా మారిపోయారేంటి ?
వివాదాస్పద ప్రకటనలతో సీపీఐ నేత నారాయణ తరచూ వార్తల్లోకి ఎక్కుతున్నారు. తర్వాత క్షమాపణలు చెబుతున్నారు. ఆయన తీరుతో సీపీఐ పార్టీకి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతున్నాయి.
CPI Narayana Controversy: సీపీఐ నారాయణ అంటే వివాదాస్పద ప్రకటనలకు కేరాఫ్ అయిపోయారు. ప్రజాపోరాటాలతో నిఖార్సైన కమ్యూనిస్టు నేతగా పేరు తెచ్చుకున్న ఆయన ఇప్పుడు వివాదాలకు .. వివాదాస్పద ప్రకటనలకు కేంద్రంగా మారుతున్నారు. తప్పయిపోయింది క్షమించడని పదే పదే వేడుకోవాల్సిన పరిస్థితి తెతచ్చుకున్నారు. ఆయనకు మాత్రమే కాదు..సీపీఐ పార్టి కి కూడ ఇది ఇబ్బందిగా మారింది.
వివాదాస్పద వ్యాఖ్యలే కాదు చేతలు కూడా !
గతంలో గాంధీ జయంతి రోజున చికెన్ తిని వార్తల్లోకి వచ్చారు. చికెన్ నారాయణగా వార్తల్లోకి ఎక్కిన నారాయణ ఆతరువాత పలు ఆందోళనల్లో పాల్గొని గాయాల పాలయ్యారు కూడ.విశాఖపట్టణం భూ కుంభకోణంలో నిర్వహించిన ఆందోళనలో గోడను కాలితో తన్నబోయి గాయాలపాలయ్యారు. చిత్తూరు జిల్లా రాలయచెరువు లీకేజి పరిశీలనకు వెళ్లిన సమయంలో నారాయణ కుడి కాలు మెలిక పడింది. రెండు సంఘటల్లో కూడ సీపీఐ నారాయణ వార్తల్లోకి ఎక్కారు.దీంతో అసలు నారాయణ చేపట్టిన ఆందోళన, సమస్య కు సంబందించిన అంశాలవు పక్కదారి పట్టాయి.
సంబంధం లేకపోయినా బిగ్‌బాస్‌పై విమర్శలు !
బుల్లి తెర పై సంచలనం సృష్టించిన బిగ్ బాస్ షో పై నారాయణ చేసిన వ్యాఖ్యలు కూడ సంచలనంగా మారాయి..అనైతిక చర్యలకు పాల్పడే విదంగా షో నిర్వహిస్తున్నారని,కళామ్మ తల్లికి అవమానకరంగా షో ఉంటుందని నారాయణ ద్వజమెత్తారు.ఇదంతా బహిరంగ దోపిడి అని ఫైర్ అయ్యారు. నాగర్జున ఇంటిలో వాళ్లను కూడ ఇలాంటి షోల పెడతారా అని నారాయణ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. అయితే బిగ్ బాస్ షో పై అప్పటికే కొంత వ్యతిరేకత వ్యక్తం కావటంతో వాటికి అంతగా ప్రాదాన్యత లభించలేదు. ఇక తమిళనాడు గవర్నర్ కు ఉద్దేశించి కూడ నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ వ్యవస్దకు ప్రాదాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదని,అదొక వేస్ట్ వ్యవస్ద అంటూ ఘాటుగా స్పందించారు.హైదరాబాద్ లోని డ్రగ్స్ వ్యవస్దను కేంద్రమే అరికట్టాలని కూడ నారాయణ అన్నారు.
చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలతో మరోసారి దుమారం !
వీటన్నింటికి భిన్నంగా నారాయణ ఇప్పుడు చిరంజీవి పై చేసిన వ్యాఖ్యలు ఉద్దేశపూర్వకంగానే ,పని కట్టుకొని చేసినట్లుగా అభిమానులు భావించారు. అల్లూరి విగ్రహాన్ని ఆవిష్కరించి,రోజులు గడిచిన తరువాత చిరంజీవిని ఉద్దేశించి నారాయణ చిల్లర బేరగాడు అనే పదాలను వినియోగించటం, తీవ్ర దుమారానికి కారణం అయ్యింది. అంతే కాదు కృష్ణను పిలవలేదని ,చిరంజీవిని ఎందుకు పిలిచారని నారాయణ అన్నారు. ఇదంతా ఒక ఎత్తయితే చిరంజీవి వంటి వ్యక్తి పై ఇష్టాను సారంగా వ్యాఖ్యలు చేసిన నారాయణ,ఆ తరువాత మెగా అభిమానులు ఎక్కువగా ఉండే ఉభయ గోదావరి జిల్లాలకు వెళ్ళారు. నారాయణ ను చిరు అభిమానులు నిలదీస్తున్న సమయంలో,ఎమి చేయలేని స్దితిలో నారాయణ ఫేస్ ఫీలింగ్ కూడ ఇప్పుడు సోసల్ మీడియా లో బాగా ట్రోల్ అవుతున్నాయి..నారాయణ తీరును గమనించిన మేదావులంతా వాటీజ్ దిస్ నారాయణ అంటున్నారు...!