అన్వేషించండి

Bengal Voter List: బెంగాల్ ఓటర్ లిస్టుపై గందరగోళం- పోలింగ్ 2 రోజుల ముందు వరకూ చేర్పులు- ఎవరి వైఫల్యం?

Bengal Elections: బెంగాల్ ఎన్నికల్లో ఓటర్ల జాబితాలో గందరగోళం రాజకీయ పార్టీలను టెన్షన్‌కు గురి చేస్తోంది. 4 లక్షల మంది పేర్లను జాబితా నుంచి తొలగించడం, మరో 60 లక్షల మందిని పరిశీలనలో ఉంచడమే దీనికి కారణం.

Confusion over Bengal voter list: పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ఓటర్ల జాబితాలో చోటుచేసుకున్న భారీ గందరగోళం రాజకీయ పార్టీలను టెన్షన్ పడుతోంది.   ఏకంగా 64 లక్షల మంది పేర్లను జాబితా నుంచి తొలగించడం, మరో 60 లక్షల మందిని పరిశీలనలో ఉంచడమే దీనికి కారణం. ఎన్నికల సంఘం చేపట్టిన జాబితా సవరణ ప్రక్రియలో లక్షలాది మంది పౌరులు తమ ప్రాథమిక హక్కును కోల్పోయారు.  స్పెల్లింగ్ తప్పులు, సాంకేతిక కారణాలతో ఏకంగా 64 లక్షల మందిని ఓటుకు దూరం కావడంతో ఈ సారి ఫలితంపై ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. 
   
లక్షలాది ఓట్ల గల్లంతు - గెలుపోటములపై భారీ ప్రభావం 
 
 ఓటర్ల జాబితా సవరణ  రాజకీయ పార్టీల లెక్కలను తారుమారు చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఏకంగా  సుమారు 11  శాతం ఓటర్ల పేర్లు తొలగించడం వెనుక సాంకేతిక కారణాలు, స్పెల్లింగ్ తప్పులు ఉన్నాయని చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం రాజకీయ సెగ పుట్టిస్తోంది. ముఖ్యంగా ముర్షిదాబాద్, మాల్దా వంటి జిల్లాల్లో అత్యధికంగా పేర్లు తొలగించబడటం ఆయా నియోజకవర్గాల్లోని అభ్యర్థులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. చాలా చోట్ల గత ఎన్నికల్లో గెలుపోటముల మార్జిన్ కంటే తొలగించిన ఓట్ల సంఖ్యే ఎక్కువగా ఉండటంతో, ఫలితం ఎటు తిరుగుతుందోనని ప్రధాన పార్టీలు ఆందోళన చెందుతున్నాయి.

 సుప్రీంకోర్టు జోక్యం - రంగంలోకి 19 ప్రత్యేక ట్రిబ్యునల్లు 

ఈ భారీ గందరగోళంపై సుప్రీంకోర్టు స్పందిస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఓటు హక్కును కోల్పోయిన బాధితుల కోసం ప్రత్యేకంగా  19 అప్పీలేట్ ట్రిబ్యునళ్లను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. రిటైర్డ్ న్యాయమూర్తుల పర్యవేక్షణలో పనిచేసే ఈ ట్రిబ్యునళ్ల ద్వారా లక్షలాది అప్పీళ్లను యుద్ధప్రతిపాదికన పరిష్కరిస్తున్నారు. పోలింగ్‌కు కేవలం రెండు రోజుల ముందు అంటే, ఏప్రిల్ 21 , 27 తేదీల్లో విడుదలయ్యే అనుబంధ జాబితాల ద్వారా తమ పేరు మళ్లీ చేరుతుందని లక్షలాది మంది ఓటర్లు ఆశగా ఎదురుచూస్తున్నారు. రాజకీయ పార్టీలు సైతం తమ మద్దతుదారుల పేర్లు తిరిగి జాబితాలో ఉండేలా ట్రిబ్యునళ్ల చుట్టూ తిరుగుతున్నాయి.

 ప్రజాస్వామ్యానికి పరీక్ష 

బెంగాల్ వంటి రాష్ట్రాల్లో ప్రతి ఓటు అత్యంత కీలకం. ఇలాంటి పరిస్థితుల్లో లక్షలాది మంది ఓటర్లు జాబితా నుంచి దూరం కావడం ఎన్నికల పారదర్శకతపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. తమ ఓటు హక్కు కోసం ప్రజలు ట్రిబ్యునళ్ల ముందు బారులు తీరడం, న్యాయపోరాటం చేయాల్సి రావడం ప్రస్తుత ఎన్నికల ప్రక్రియలోని సవాళ్లను సూచిస్తోంది. ఏప్రిల్ 23,  29 తేదీల్లో రెండు దశల్లో జరగనున్న పోలింగ్‌లో ఈ ఓట్ల గల్లంతు ఎవరికి లాభిస్తుంది? ఎవరిని దెబ్బతీస్తుంది? అనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ గందరగోళం మధ్య ఓటింగ్ శాతం తగ్గిపోతుందా లేక పౌరులు పట్టుదలతో తమ హక్కును సాధించుకుంటారా అనేది వేచి చూడాలి.

ఓటింగ్ పై ప్రభావం చూపుతుందా?
 
ప్రజలు తమ ప్రతినిధులను ఎన్నుకునే ప్రక్రియపై నమ్మకం కోల్పోతే అది ఓటింగ్ శాతంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఓటు వేయడానికి వెళ్ళినప్పుడు జాబితాలో పేరు లేకపోవడం కంటే ఒక పౌరుడికి పెద్ద అవమానం ఉండదు.  ప్రజాస్వామ్యంలో ఓటరే రాజు అని చెప్పే bejg, ఆ ఓటరును ట్రిబ్యునళ్ల చుట్టూ తిప్పించడం  మంచిది కాదని పార్టీలంటున్నాయి.  

టాప్ హెడ్ లైన్స్

Vijay Cinema Style Politics: తమిళనాడులో విజయ్ పొలిటికల్ గ్లామర్ - సీఎం స్థాయి పర్యటనలు, సినిమా స్టైల్ రీల్స్.. రాజకీయంగా లాభమా? నష్టమా?
తమిళనాడులో విజయ్ పొలిటికల్ గ్లామర్ - సీఎం స్థాయి పర్యటనలు, సినిమా స్టైల్ రీల్స్.. రాజకీయంగా లాభమా? నష్టమా?
TDP MLC Seats Competition: టీడీపీలో ఎమ్మెల్సీ సీట్ల ఉత్కంఠ - రెండు ఖాళీలకు భారీ పోటీ.. చంద్రబాబు మార్క్ సామాజిక సమీకరణాలు వర్కవుట్ అయ్యేనా?
టీడీపీలో ఎమ్మెల్సీ సీట్ల ఉత్కంఠ - రెండు ఖాళీలకు భారీ పోటీ.. చంద్రబాబు మార్క్ సామాజిక సమీకరణాలు వర్కవుట్ అయ్యేనా?
Revanth Reddy Criminal Waste Remarks: రేవంత్ రెడ్డి క్రిమినల్ వేస్ట్ కామెంట్స్ కలకలం - కాక్రోచ్ తరహాలో క్రిమినల్ వేస్ట్ పార్టీ ఆవిర్భవిస్తుందా?
రేవంత్ రెడ్డి క్రిమినల్ వేస్ట్ కామెంట్స్ కలకలం - కాక్రోచ్ తరహాలో క్రిమినల్ వేస్ట్ పార్టీ ఆవిర్భవిస్తుందా?
Bhogapuram Airport Credit War: భోగాపురం ఎయిర్‌పోర్ట్ క్రెడిట్ వార్ - చంద్రబాబు విజన్ ఉందా? జగన్ కష్టం ఉందా?
భోగాపురం ఎయిర్‌పోర్ట్ క్రెడిట్ వార్ - చంద్రబాబు విజన్ ఉందా? జగన్ కష్టం ఉందా?

వీడియోలు

Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ
Trinayani Serial Actress Ashika Padukone | 'త్రినయని' ఆషికా రియల్ లైఫ్ సీక్రెట్స్
Hardik Pandya Comments On Captaincy | కెప్టెన్సీపై హార్దిక్ పాండ్యా షాకింగ్ కామెంట్స్
Vaibhav Suryavanshi Vice Captaincy | 15 ఏళ్ల కుర్రాడికి వైస్ కెప్టెన్సీ ఏంటి?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jasprit Bumrah Out.!: లంక టూర్ కి ముందే టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. మోకాలి గాయంతో బుమ్రా అవుట్.! 
లంక టూర్ కి ముందే టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. మోకాలి గాయంతో బుమ్రా అవుట్.! 
YSRCP MLA Virupakshi: కర్నూలులో పొలిటికల్ హీట్.. వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్, అసలేం జరిగిందంటే!
కర్నూలులో పొలిటికల్ హీట్.. వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్, అసలేం జరిగిందంటే!
CM Revanth Reddy: ఉజ్జయిని మహంకాళి బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. బోనం సమర్పించిన మంత్రులు
ఉజ్జయిని మహంకాళి బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. బోనం సమర్పించిన మంత్రులు
Friendship Day Tragedy: విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
Kaleshwaram Project Report: కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
Ritika Nayak: కొరియన్ అమ్మాయి కాదు... కనకరాజుతో నటించిన హీరోయిన్‌ది ఢిల్లీ - ట్రైలర్‌ లాంచ్‌లో ఫోటోలు
కొరియన్ అమ్మాయి కాదు... కనకరాజుతో నటించిన హీరోయిన్‌ది ఢిల్లీ - ట్రైలర్‌ లాంచ్‌లో ఫోటోలు
AP JAC Demands: ఆగస్టు 15లోగా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమమే: ఏపీ జేఏసీ డెడ్‌లైన్
ఆగస్టు 15లోగా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమమే: ఏపీ జేఏసీ డెడ్‌లైన్
తక్కువ ఇంధన ఖర్చు, అద్భుతమైన మైలేజ్.. త్వరలో మార్కెట్లోకి Baleno Facelift 2026 
తక్కువ ఇంధన ఖర్చు, అద్భుతమైన మైలేజ్.. త్వరలో మార్కెట్లోకి Baleno Facelift 2026 
Embed widget