News
News
X

TS Congress : తెలంగాణ కాంగ్రెస్‌లో అవే గ్రూపు గొడవలు - తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ వాయిదా !

తెలంగాణ కాంగ్రెస్‌లో గ్రూపుల గొడవలు పెరిగిపోతున్నాయి. తెలంగాణకు ప్రత్యేక జెండా, గీతం, తెలంగాణ తల్లి విగ్రహాల విషయంలో రేవంత్ దూకుడుకు సీనియర్లు అడ్డుకట్ట వేశారు.

FOLLOW US: 

TS Congress :  తెలంగాణ కాంగ్రెస్ ఎంత బలంగా ముందుకు వెళ్లాలని ప్రయత్నిస్తున్నా ఆ పార్టీ నేతలే అంత కంటే బలంగా వెనక్కి లాగుతున్నారు.  సెప్టంబర్ 17న గాంధీ భవన్ లో  తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించాలనుకున్నారు. కానీ కేవలం నమూనాను మాత్రం ఆవిష్కరంచారు. దీనికి కారణం ఈ అంశంపై టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఆ పార్టీ సీనియర్ నేతల మధ్య‌ విభేదాలు బయటపడటమే.  మునుగోడులో కాంగ్రెస్ గెలిస్తే తన భవిష్యత్తు మరింత అద్భుతంగా ఉంటుందని భావిస్తున్న రేవంత్ రెడ్డి అందుకు అనుగుణంగా అనేక ప్రణాళికలు రచిస్తున్నారు. ప్రత్యేక జెండా, గీతం అలాగే తెలంగాణ తల్లి విగ్రహాలకు రూపకల్పన చేసి అన్ని చోట్లా ప్రతిష్టింప చేయాలనుకుంటున్నారు. కానీ సీనియర్ నేతలు మాత్రం ఎక్కడిక్కడ అడ్డం పడుతూనే ఉన్నారు. 

రేవంత్ ప్రయత్నాలకు సీనియర్ల అడ్డుకట్ట 
 
 తెలంగాణ సెంటిమెంట్‌ను ఈ సారి ఎలాగైనా గుప్పిట పట్టాలనుకున్న కాంగ్రెస్ సెప్టెంబర్​17న నిర్వహించే వేడుకల్లో కీలక మార్పులు జరిగాయి. దీనిపై మా జెండా, ఎజెండా వేరు, కొత్తగా తెలంగాణ తల్లి విగ్రహం ప్రతిష్టిస్తాం, జయ జయహే తెలంగాణ గీతాన్ని ఆలపిస్తామనంటూ ప్రకటించింది. శనివారం హైదరాబాద్​రాష్ట్ర స్వతంత్ర వజ్రోత్సవ వేడుకలను గాంధీభవన్‌లో నిర్వహిస్తున్నట్లు టీపీసీసీ ప్రకటించింది. కానీ, కొత్త జెండా ఎగురవేస్తామని చెప్పినా.. ప్రస్తుతం జాతీయ పతాకానికే పరిమితమయ్యారు. ఇక కొత్త జెండా కథ వెనక్కి వెళ్లింది. అదేవిధంగా చేతిలో బడితే పట్టుకుని సాధారణంగా కనిపించే తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు కూడా ఆగిపోయింది. గడీల దొరసాని కాదు.. తెలంగాణ తల్లి అంటూ టీపీసీసీ ప్రత్యేకంగా ఒక విగ్రహాన్ని రూపొందించి, సంబంధించిన ఫొటోలను సైతం బయటకు విడుదల చేసింది. గాంధీభవన్‌లో ఈ విగ్రహానికే పూలమాలలు వేస్తారని కూడా చెప్పుకొచ్చారు. కానీ, ఇప్పుడు విగ్రహం ఏర్పాటు చేసే అంశంలోనూ వెనకడుగు పడింది.

లిక్కర్ స్కాం సోదాలపై ఘాటుగా స్పందించలేకపోయిన కాంగ్రెస్ 

రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలను సీనియర్లు అంగీకరించడం లేదు.  తాము అధికారంలోకి వస్తే రాష్ట్ర జెండాతో పాటు తెలంగాణ తల్లి విగ్రహం, జాతీయ గేయం, వాహనాల రిజిస్ట్రేషన్ కోడ్ టీఎస్ నుండి టీజీకి మార్చుతామని రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ పై సీనియర్లు అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది.   సీనియర్ల సమ్మతి లేకుండా రేవంత్ ఇలాంటి పాయింట్లు తెరపైకి ఎలా తెస్తారని వారు ప్రశ్నిస్తున్నారు.  సెప్టెంబర్ 17ను స్వాతంత్ర వేడుకలు నిర్వహించుకోవాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఇదే రోజున టీఆర్ఎస్, బీజేపీలు పొలిటికల్ మైలేజ్ కోసం వివిధ కార్యక్రమాలను చేపడుతుంటే తమ వంతుగా సెంటిమెంట్ ఆయుధాన్ని రేవంత్ రెడ్డి ప్రయోగించారు. కానీ ఆయన నిర్ణయాన్ని కొందరు సమర్ధిస్తుంటే మరి కొంత మంది విమర్శిస్తున్నారు.  

ఇప్పటికీ గ్రూపు గొడవలతోనే కాంగ్రెస్ సతమతం

తెలంగాణలో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. పార్టీలో ఎక్కడిక్కడ తనకు అడ్డు పడుతూండటంతో రేవంత్ రెడ్డి కూడా అసహనంతో ఉన్నారు. లిక్కర్ స్కాం లో ఈడీ సోదాలు జరిగినా ఆయన పెద్దగా పట్టించుకోలేకపోతున్నారు. ఆయనే కాదు సీనియర్లు కూడా టీఆర్ఎస్‌ను టార్గెట్ చేయలేకపోయారు. మునుగోడు ఉపఎన్నికను అందరూ కలసి కట్టుగా ఎదుర్కోవాల్సిన సమయంలో ఇలా వర్గ పోరాటం కాంగ్రెస్‌లో కొనసాగుతూండటంపై శ్రేణుల్లోనూ నిరాశ  వ్యక్తమవుతోంది. 

Published at : 17 Sep 2022 03:52 PM (IST) Tags: Telangana Congress Revanth Reddy TS Congress Politics

సంబంధిత కథనాలు

Ysrcp Internal Politics : నంద్యాల వైసీపీలో వర్గ విభేదాలు, సీఎం వద్దే పంచాయితీ తేల్చుకుందామని సవాల్!

Ysrcp Internal Politics : నంద్యాల వైసీపీలో వర్గ విభేదాలు, సీఎం వద్దే పంచాయితీ తేల్చుకుందామని సవాల్!

YSRCP ఎమ్మెల్యే శ్రీ‌దేవికి షాక్, సొంత పార్టీ నేత‌లే అవినీతి ఆరోప‌ణ‌లు - మొదట్నుంచీ వివాదాలే

YSRCP ఎమ్మెల్యే శ్రీ‌దేవికి షాక్, సొంత పార్టీ నేత‌లే అవినీతి ఆరోప‌ణ‌లు - మొదట్నుంచీ వివాదాలే

Congress President Elections: కాంగ్రెస్ నూతన అధ్యక్ష్యుడు, గాంధీ కుటుంబేతరుడు - పదవి చేపట్టాలంటే ఈ అర్హతలు తప్పనిసరి

Congress President Elections: కాంగ్రెస్ నూతన అధ్యక్ష్యుడు, గాంధీ కుటుంబేతరుడు - పదవి చేపట్టాలంటే ఈ అర్హతలు తప్పనిసరి

RK Roja On Balakrishna: ప్లూటు బాబు ముందు ఊదు, జ‌గ‌నన్న ముందు కాదు - బాలకృష్ణకు మంత్రి రోజా కౌంటర్

RK Roja On Balakrishna: ప్లూటు బాబు ముందు ఊదు, జ‌గ‌నన్న ముందు కాదు - బాలకృష్ణకు మంత్రి రోజా కౌంటర్

Revanth Politics : రేవంత్ రెడ్డిని చంద్రబాబే కాంగ్రెస్‌లోకి పంపారా ? ఈ రాజకీయం వెనుక అసలు ‌వ్యూహం ఏమిటి?

Revanth Politics :   రేవంత్ రెడ్డిని చంద్రబాబే కాంగ్రెస్‌లోకి పంపారా ?  ఈ రాజకీయం వెనుక అసలు ‌వ్యూహం ఏమిటి?

టాప్ స్టోరీస్

Minister Prashanth: రూ. 10 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకునే సర్కార్ కాదు - మంత్రి వేముల

Minister Prashanth: రూ. 10 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకునే సర్కార్ కాదు - మంత్రి వేముల

Kishan Reddy : అప్పుల కోసం కేంద్రాన్ని కేసీఆర్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారు- కిషన్ రెడ్డి

Kishan Reddy : అప్పుల కోసం కేంద్రాన్ని కేసీఆర్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారు- కిషన్ రెడ్డి

Zaheerabad Rape: పెళ్లైన మహిళపై గ్యాంగ్ రేప్! జహీరాబాద్‌లో దారుణం

Zaheerabad Rape: పెళ్లైన మహిళపై గ్యాంగ్ రేప్! జహీరాబాద్‌లో దారుణం

Daughters Day 2022: కూతురు సితారకు మహేష్ బాబు డాటర్స్ డే గ్రీటింగ్స్!

Daughters Day 2022: కూతురు సితారకు మహేష్ బాబు డాటర్స్ డే గ్రీటింగ్స్!