అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source: ECI/ABP News/ABP Majha)

CM Jagan: 'మూడుసార్లు సీఎం, ఒక్క సంక్షేమ పథకమైనా గుర్తొస్తుందా?' - అధికారంలోకి రాగానే తొలి సంతకం దానిపైనే అన్న సీఎం జగన్

Andhrapradesh News: మూడుసార్లు సీఎంగా చేశానని చెప్పుకొనే చంద్రబాబు ఒక్క సంక్షేమ పథకం కూడా ప్రవేశపెట్టలేదని సీఎం జగన్ మండిపడ్డారు. ఎన్నికల్లో మోసం చేసే కూటమితో తలపడుతున్నామని అన్నారు.

CM Jagan Slams Chandrababu: 14 ఏళ్లు సీఎంగా చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) పేరు చెబితే ఒక్క సంక్షేమ పథకం ఎవరికైనా గుర్తొస్తుందా.? అని సీఎం జగన్ (CM Jagan) ప్రశ్నించారు. తిరుపతి జిల్లా నాయుడుపేటలో (Naidupeta) గురువారం 'మేమంతా సిద్ధం' బస్సు యాత్ర సాగింది. సాయంత్రం బహిరంగ సభలో ప్రసంగించిన ఆయన.. చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. 'మరో 5 వారాల్లో ఎన్నికలనే మహా సంగ్రామం జరగనుంది. ప్రతీ వర్గానికి మంచి చేసే మనం.. మోసం చేసే చంద్రబాబు కూటమి తలపడుతున్నాం. ఇవి ఎమ్మెల్యేలు, ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు కావు. పేద, సామాజిక వర్గ భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలు. మీ ఓటు మన తలరాతను, మన భవిష్యత్తును మారుస్తుంది. రాష్ట్రంలో 66 లక్షల మంది పెన్షన్లు అందుకుంటున్నారు. జూన్ 4 వరకూ ఓపిక పట్టండి. మళ్లీ మీ అందరి ప్రభుత్వం రాబోతుంది. అధికారంలోకి రాగానే తొలి సంతకం వాలంటీర్ వ్యవస్థపైనే ఉంటుంది. పెన్షన్ల పంపిణీ కొనసాగిస్తాం.' అని జగన్ స్పష్టం చేశారు.

'పెన్షన్ల పంపిణీ అడ్డుకున్నారు'

'ఈ ఎన్నికలు పేదల అనుకూల భావజాలం, పెత్తందారుల అనుకూల భావజాలానికి మధ్య జరుగుతున్న సంఘర్షణ. రాష్ట్రంలో అన్ని వర్గాలకు మంచి చేశాం. అన్ని సామాజిక వర్గాలకు డీబీటీ ద్వారా నేరుగా అకౌంట్లలో నగదు జమ చేసి లబ్ధి అందించాం. దశల వారీగా పెన్షన్లను రూ.3 వేలకు పెంచుకుంటూ వచ్చాం. వాలంటీర్ల ద్వారా ఒకటో తేదీనే ఇంటింటికీ పెన్షన్లు అందించాం. అలాంటిది తన మనిషితో ఫిర్యాదు చేయించి పెన్షన్ల పంపిణీని చంద్రబాబు అడ్డుకున్నారు. చంద్రబాబు దుర్మార్గం వల్లే 31 మంది అవ్వా తాతలు ప్రాణాలు కోల్పోయారు. పేదలకు ఇళ్ల పట్టాలు అందవద్దని కోర్టులకు వెళ్లారు. వాలంటీర్ వ్యవస్థతో చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. మనకు కోట్ల మంది అభిమానం ఉంటే.. ఎల్లో ముఠాకు పొరుగు రాష్ట్రం నుంచి అభిమానులు ఉన్నారు. నా వెంట నా తోబుట్టువులు ఉన్నారు. మనసారా ఆశీర్వదించే పేద అవ్వాతాతలు ఉన్నారు. జగన్ మామ అని పిలిచే చిన్నారులు ఉన్నారు. పేదల భవిష్యత్తు మార్చేలా 58 నెలలుగా అడుగులు పడ్డాయి.' అని సీఎం జగన్ పేర్కొన్నారు.

అంతకు ముందు, సీఎం జగన్ చిన్న సింగనమలలో లారీ, ఆటో డ్రైవర్లతో ముఖాముఖి నిర్వహించారు. టిప్పర్ డ్రైవర్ ను చట్టసభలో కూర్చోబెట్టేందుకే టికెట్ ఇచ్చానని సీఎం తెలిపారు. 'వీరాంజనేయులు ఎంఏ ఎకనామిక్స్, బీఈడీ చదివారు. ఉపాధి కోసం టిప్పర్ డ్రైవర్ గా పని చేస్తున్నారు. జగన్ టిప్పర్ డ్రైవర్ కు టికెట్ ఇచ్చాడని చంద్రబాబు అవహేళన చేశారు. అయినా, టిప్పర్ డ్రైవర్ కు టికెట్ ఇస్తే తప్పేంటి.?. రూ.కోట్లు ఉన్న వారికే చంద్రబాబు టికెట్లు ఇచ్చారు.' అంటూ జగన్ మండిపడ్డారు.

Also Read: YS Viveka Murder Case : అవినాష్ రెడ్డి బెయిల్ రద్దుపై దస్తగిరి వాదనను సమర్థిస్తున్నాం - తెలంగాణ హైకోర్టుకు తెలిపిన సీబీఐ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

NDA Telugu Star Campaigners : బీజేపీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో పవన్, చంద్రబాబు ఖాయం - ఢిల్లీ ఎన్నికల్లోనూ తురుపుముక్కలే !
బీజేపీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో పవన్, చంద్రబాబు ఖాయం - ఢిల్లీ ఎన్నికల్లోనూ తురుపుముక్కలే !
IPL Auction 2025 Live Streaming: నేడే ఐపీఎల్ 2025 మెగా వేలం ప్రారంభం- వారి కోసం హోరాహోరీ తప్పదు, లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడంటే!
నేడే ఐపీఎల్ 2025 మెగా వేలం ప్రారంభం- వారి కోసం హోరాహోరీ తప్పదు, లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడంటే!
PM Modi Comments: రాజ్యాంగంలో వక్ఫ్ చట్టానికి చోటు లేదు, ఓ వర్గం కోసం కాంగ్రెస్ తీసుకొచ్చింది: ప్రధాని మోదీ
రాజ్యాంగంలో వక్ఫ్ చట్టానికి చోటు లేదు, ఓ వర్గం కోసం కాంగ్రెస్ తీసుకొచ్చింది: ప్రధాని మోదీ
AUS vs IND: ఆస్ట్రేలియన్లూ ! మీరు మారరా ? బుమ్రా బౌలింగ్‌పై చెకింగ్ ఆరోపణలు- భగ్గుమంటున్న అభిమానులు
ఆస్ట్రేలియన్లూ ! మీరు మారరా ? బుమ్రా బౌలింగ్‌పై చెకింగ్ ఆరోపణలు- భగ్గుమంటున్న అభిమానులు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పెర్త్ టెస్ట్‌లో రెండో రోజు దుమ్ము లేపిన టీమిండియావయనాడ్‌లో భారీ మెజార్టీతో గెలిచిన ప్రియాంక గాంధీమహారాష్ట్రలో బీజేపీ సత్తా! ఏ మ్యాజిక్ పని చేసింది?కుప్పకూలిన ఆసిస్ అదరగొట్టిన భారత బౌలర్లు!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
NDA Telugu Star Campaigners : బీజేపీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో పవన్, చంద్రబాబు ఖాయం - ఢిల్లీ ఎన్నికల్లోనూ తురుపుముక్కలే !
బీజేపీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో పవన్, చంద్రబాబు ఖాయం - ఢిల్లీ ఎన్నికల్లోనూ తురుపుముక్కలే !
IPL Auction 2025 Live Streaming: నేడే ఐపీఎల్ 2025 మెగా వేలం ప్రారంభం- వారి కోసం హోరాహోరీ తప్పదు, లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడంటే!
నేడే ఐపీఎల్ 2025 మెగా వేలం ప్రారంభం- వారి కోసం హోరాహోరీ తప్పదు, లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడంటే!
PM Modi Comments: రాజ్యాంగంలో వక్ఫ్ చట్టానికి చోటు లేదు, ఓ వర్గం కోసం కాంగ్రెస్ తీసుకొచ్చింది: ప్రధాని మోదీ
రాజ్యాంగంలో వక్ఫ్ చట్టానికి చోటు లేదు, ఓ వర్గం కోసం కాంగ్రెస్ తీసుకొచ్చింది: ప్రధాని మోదీ
AUS vs IND: ఆస్ట్రేలియన్లూ ! మీరు మారరా ? బుమ్రా బౌలింగ్‌పై చెకింగ్ ఆరోపణలు- భగ్గుమంటున్న అభిమానులు
ఆస్ట్రేలియన్లూ ! మీరు మారరా ? బుమ్రా బౌలింగ్‌పై చెకింగ్ ఆరోపణలు- భగ్గుమంటున్న అభిమానులు
Telangana: పండుగ వాతావరణం కనిపించేలా ప్రజా పాలన విజయోత్సవాలు - డిసెంబర్ 1 నుంచి 9 వరకు పూర్తి షెడ్యూల్
పండుగ వాతావరణం కనిపించేలా ప్రజా పాలన విజయోత్సవాలు - డిసెంబర్ 1 నుంచి 9 వరకు పూర్తి షెడ్యూల్
Priyanka Gandhi: ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!
ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!
Sonia Akula Engagement: ఎంగేజ్‌మెంట్ చేసుకున్న సోనియా ఆకుల... అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన బిగ్ బాస్ బ్యూటీ
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న సోనియా ఆకుల... అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన బిగ్ బాస్ బ్యూటీ
Revanth Reddy: కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
Embed widget