అన్వేషించండి

CM Vijay manifesto: మొదటి రోజే ముఖ్యమంత్రి విజయ్‌కు మేనిఫెస్టో సెగ - స్టాలిన్ సవాల్‌ను తట్టుకోగలరా?

CM Vijay: ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన విజయ్ ముందు ఇప్పుడు అగ్నిపరీక్ష నిలిచింది. పాలన అనేది సినిమాల్లో చూపించినంత సులభం కాదని మొదటి రోజే అర్థమైంది.

Chief Minister Vijay manifesto: తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త శకం మొదలైనప్పటికీ, ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన విజయ్  ముందు ఇప్పుడు అగ్నిపరీక్ష నిలిచింది. రంగుల ప్రపంచం నుంచి రాజకీయ రణరంగంలోకి అడుగుపెట్టి, అధికార పీఠాన్ని దక్కించుకున్న విజయ్‌కు పాలన అనేది సినిమాల్లో చూపించినంత సులభం కాదని మొదటి రోజే అర్థమైంది. ముఖ్యంగా మేనిఫెస్టో అమలు, ఆర్థిక సంక్షోభంపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధానికి దారితీశాయి.   

ఖజానా ఖాళీగా ఉందన్న విజయ్ 

తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే విజయ్ తన మార్కు రాజకీయానికి శ్రీకారం చుట్టారు. తన మొదటి సంతకాన్ని  200 యూనిట్ల ఉచిత విద్యుత్  పథకంపై చేసి, ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. అయితే, ఇదే సమయంలో రాష్ట్ర ఖజానా ఖాళీగా ఉందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. సుమారు  10 లక్షల కోట్ల అప్పు తో గత ప్రభుత్వం రాష్ట్రాన్ని దివాళా తీయించిందని విజయ్ ఆరోపించారు. దీనిపై శ్వేతపత్రం విడుదల చేస్తామని ప్రకటించడం ద్వారా డీఎంకే  పై నేరుగా యుద్ధం ప్రకటించారు.

 స్టాలిన్ కౌంటర్ - చేతనైతే పాలించు.. సాకులు చెప్పకు! 

విజయ్ ఆరోపణలపై మాజీ ముఖ్యమంత్రి ఎం.కే. స్టాలిన్ అత్యంత వేగంగా స్పందించారు.  ఖజానాలో డబ్బు లేదని చెప్పడం ద్వారా నిన్ను నమ్మి ఓటేసిన ప్రజలను నిరాశపరచవద్దు అంటూ విజయ్‌కు హితవు పలికారు. రాష్ట్ర అప్పులు పరిమితిలోనే ఉన్నాయని, పాలించే దమ్ము, ప్రజలకు ఇవ్వాలనే సంకల్పం ఉంటే ఏదైనా సాధ్యమేనని స్టాలిన్ ఎద్దేవా చేశారు. తాము కరోనా, వరదలు వంటి విపత్తుల్లో కూడా సంక్షేమ పథకాలను ఆపలేదని గుర్తు చేస్తూ.. విజయ్ తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి అప్పుల సాకు చెబుతున్నారని కౌంటర్ ఇచ్చారు.

 భారీ హామీలు - పరిమిత వనరులు 

విజయ్ తన మేనిఫెస్టోలో మహిళలకు నెలకు 2,500  ఆర్థిక సాయం, ఏటా 6 గ్యాస్ సిలిండర్లు ఉచితం వంటి భారీ హామీలు ఇచ్చారు. కానీ, ప్రస్తుతం పెంచిన 200 యూనిట్ల ఉచిత విద్యుత్ మినహా ఇతర పెద్ద పథకాలపై ఆయన మౌనం వహించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కేవలం విద్యుత్ పథకానికే ఏటా వేల కోట్ల రూపాయల అదనపు భారం పడుతుండటంతో, మిగిలిన హామీల అమలు విజయ్‌కు కత్తిమీద సాములా మారింది. ప్రజలు దళపతి  నుండి అద్భుతాలు ఆశిస్తున్నారు, కానీ ఆర్థిక వాస్తవాలు అందుకు భిన్నంగా ఉన్నాయి.

 ప్రజా అసంతృప్తి పొంచి ఉందా? 

తమిళనాడు ప్రజలు ఎప్పుడూ భావోద్వేగాలతో పాటు ఫలితాలను కూడా ఆశిస్తారు. విజయ్ తన సినిమా  ఇమేజ్‌ను నిజ జీవితంలోనూ చూడాలనుకుంటున్నారు. ఒకవేళ ఆర్థిక ఇబ్బందుల పేరుతో హామీల అమలులో జాప్యం జరిగితే, ప్రజల్లో అసంతృప్తి చాలా వేగంగా పెరుగుతుంది. దీనిని ఆసరాగా చేసుకుని డీఎంకే, ఏఐఏడీఎంకే  లు విజయ్‌ను ఇరుకున పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాయి.  పాలన చేతకాకనే సాకులు చెబుతున్నారనే  ముద్ర పడకుండా విజయ్ అత్యంత జాగ్రత్తగా అడుగులు వేయాల్సి ఉంది.
  
రాష్ట్ర ఆర్థిక స్థితిపై విజయ్ ప్రకటించబోయే శ్వేతపత్రం  ఆయన రాజకీయ భవిష్యత్తును నిర్ణయించనుంది. ఒకవేళ అది కేవలం రాజకీయ ఆరోపణలకే పరిమితమైతే ప్రజలు అంగీకరించరు. ఇచ్చిన హామీలను అమలు చేస్తూనే, అవినీతి రహిత పాలనను అందించడం విజయ్ ముందున్న అసలు సవాల్. స్టాలిన్ వంటి అనుభవం ఉన్న నేతలు విపక్షంలో ఉండి ప్రతి అడుగును గమనిస్తున్న తరుణంలో, ముఖ్యమంత్రి విజయ్ తన మేనిఫెస్టోను ఎంతవరకు నెరవేరుస్తారో వేచి చూడాలి. 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Vijay Delimitation Meeting: తమిళనాడు సీఎం విజయ్‌కు బిగ్ షాక్! డీలిమిటేషన్ మీటింగ్‌ను బహిష్కరించిన 37 మంది ఎంపీలు
తమిళనాడు సీఎం విజయ్‌కు బిగ్ షాక్! డీలిమిటేషన్ మీటింగ్‌కు 37 మంది ఎంపీలు డుమ్మా!
Polavaram Banakacherla Project : పోలవరం–బనకచర్ల ప్రాజెక్టు తిరస్కరణ - రేవంత్ విజయమా? చంద్రబాబు వైఫల్యమా?
పోలవరం–బనకచర్ల ప్రాజెక్టు తిరస్కరణ - రేవంత్ విజయమా? చంద్రబాబు వైఫల్యమా?
Ambati Rambabu Padayatra Postponed : వైసీపీలో అంబటి పాదయాత్ర రద్దు కలకలం - నేతల వ్యక్తిగత మైలేజ్ రాజకీయాలను జగన్ అంగీకరించరా?
వైసీపీలో అంబటి పాదయాత్ర రద్దు కలకలం - నేతల వ్యక్తిగత మైలేజ్ రాజకీయాలను జగన్ అంగీకరించరా?
Kavitha BC Vote Bank: బీసీలను ఓటు బ్యాంక్‌గా చేసుకోవడమే కవిత టార్గెట్ - కేసీఆర్ తరహాలోనే ప్రయత్నాలు - వర్కవుట్ అవుతుందా?
బీసీలను ఓటు బ్యాంక్‌గా చేసుకోవడమే కవిత టార్గెట్ - కేసీఆర్ తరహాలోనే ప్రయత్నాలు - వర్కవుట్ అవుతుందా?
Advertisement

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Aid for Peddi Sudarshan Reddy Family: పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
Medical Student Incident: మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
Sai Sudharsan Ruled Out: శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Gedela Raju OTT : టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్
టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్
Telangana High Court: హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
యూత్‌కు నచ్చేలా Pulsar N160 S, N160 SS వేరియంట్లు.. ఇంజిన్ నుంచి డిస్‌ప్లే వరకు సరికొత్త మార్పులు
Pulsar N160 కొత్త వేరియంట్లు.. మరింత పవర్‌, మరిన్ని మోడ్స్‌ - రూ.1.34 లక్షలకే!
Embed widget