అన్వేషించండి

Chandrababu Vijay River Interlinking: చంద్రబాబు - విజయ్ భేటీలో అసలు మ్యాటర్ - గోదావరి-కావేరి అనుసంధానం సాధ్యమేనా?

Chandrababu Vijay Meeting 2026: సీఎం చంద్రబాబు, తమిళనాడు సీఎం విజయ్ భేటీలో గోదావరి-కావేరి నదుల అనుసంధానంపై కీలక చర్చ జరిగింది. ఈ నదుల అనుసంధానానికి ఉన్న అడ్డంకులేంటి?

Godavari Kaveri River Link Projec:  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తమిళనాడు ముఖ్యమంత్రి, టీవీకే అధినేత జోసెఫ్ విజయ్‌ల మధ్య  జరిగిన సమావేశం దక్షిణ భారత రాజకీయ, జలవనరుల వర్గాల్లో  ఆసక్తిని రేకెత్తించింది. చారిత్రకంగా చెన్నై నగర తాగునీటి అవసరాల కోసం ఏపీ నుంచి అందించే  తెలుగు గంగ  నీటి సరఫరాపై ఈ భేటీలో ప్రాథమిక చర్చలు జరిగినప్పటికీ, అసలు సిసలైన కీలక  అంశం మాత్రం గోదావరి-కావేరి నదుల అనుసంధానంపైనే నడిచింది. నదుల అనుసంధానంపై సుదీర్ఘకాలంగా స్పష్టమైన ప్రణాళికలతో ఉన్న చంద్రబాబుతో, తమిళనాడు సీఎంగా పగ్గాలు చేపట్టిన విజయ్ ఈ సుదూర జల కల నెరవేర్చేందుకు చేతులు కలపడం అంతర్రాష్ట్ర జల సంబంధాలలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది.

నదుల అనుసంధానం కీలకం

కావేరి జలాల పంపిణీ విషయంలో కర్ణాటకతో తమిళనాడు దశాబ్దాలుగా  వివాదాలను ఎదుర్కొంటోంది. ఈ శాశ్వత నీటి సంక్షోభానికి నాటి ప్రాజెక్టులే పరిష్కారమని భావిస్తున్న సీఎం విజయ్ ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీని స్వయంగా కలిసి ఒక ప్రతిపాదనను సమర్పించారు.  స్పెషల్ పర్పస్ వెహికల్  ఏర్పాటు చేసి, కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణలో యుద్ధప్రాతిపదికన గోదావరి-కావేరి అనుసంధాన ప్రాజెక్టును చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. చంద్రబాబు నాయుడు కూడా జాతీయ నదుల అనుసంధానానికి మొదటి నుంచీ గట్టి మద్దతుదారుడిగా ఉండటంతో, ఇద్దరు పొరుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ డ్రీమ్ ప్రాజెక్టుపై ఒకే తాటిపైకి రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ప్రాజెక్టు సాధ్యమేనా? 

అసలు గోదావరి-కావేరి అనుసంధానం సాధ్యమేనా అనే ప్రశ్న టెక్నికల్, లీగల్ వర్గాల్లో తలెత్తుతోంది. కేంద్ర జలసంఘం , నేషనల్ వాటర్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ ప్రాథమిక నివేదికల ప్రకారం, సముద్రంలో వృథాగా కలుస్తున్న గోదావరి మిగులు జలాలను కృష్ణా, పెన్నా నదుల ద్వారా కావేరి నదికి మళ్లించడం సాంకేతికంగా సాధ్యమే. గోదావరి బేసిన్‌లోని ఇచ్చంపల్లి, సమ్మక్క బ్యారేజీ లేదా పోలవరం జలాశయం నుంచి దాదాపు 147 టీఎంసీల నీటిని నాగార్జునసాగర్, సోమశిల, నాగార్జునసాగర్ రైట్ కెనాల్,  గ్రావిటీ, లిఫ్ట్ పద్ధతుల ద్వారా తమిళనాడులోని గ్రాండ్ ఆనకట్ట  వరకు తీసుకెళ్లేలా రూ. 60,000 కోట్లకు పైగా వ్యయంతో డిజైన్లు సిద్ధం చేశారు.

అమలైతే దక్షిణాది కరువు తీరిపోతుంది! 

ఈ ప్రాజెక్టు నెరవేరితే దక్షిణ భారతదేశంలోని నాలుగు ప్రధాన రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు మరియు పుదుచ్చేరిలకు అపారమైన ప్రయోజనాలు చేకూరనున్నాయి. ఏపీలోని రాయలసీమ, ప్రకాశం , నెల్లూరు జిల్లాల కరువు ప్రాంతాలకు సాగునీరు, తాగునీరు విస్తారంగా లభిస్తాయి. అదే సమయంలో ఏటా తీవ్ర కరవును, తాగునీటి కొరతను ఎదుర్కొంటున్న తమిళనాడులోని డెల్టా జిల్లాలకు ,  చెన్నై నగర దాహార్తికి కావేరి అనుసంధానంతో శాశ్వత ఉపశమనం లభిస్తుంది. పంట కాలాల్లో కర్ణాటకపై ఆధారపడాల్సిన అవసరం గణనీయంగా తగ్గుతుంది. ఈ ప్రాజెక్టు ఆచరణలోకి రావడానికి ప్రధానంగా మూడు పెద్ద సవాళ్లు అడ్డుగా నిలుస్తున్నాయి. మొదటిది అంతర్రాష్ట్ర జల వివాదాలు. గోదావరిలో మిగులు జలాలు లేవని, ముందస్తుగా తమ నీటి అవసరాలను తీర్చాలని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేస్తుండగా, డిజైన్ల మార్పులపై ఏపీ తనదైన శైలిలో సూచనలు చేస్తోంది. రెండవది భారీ ఆర్థిక భారం. పదుల వేల కోట్లతో కూడుకున్న ఈ ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి, కేంద్ర ప్రభుత్వమే 90 శాతం నిధులు సమకూర్చాల్సి ఉంటుంది. మూడవది అటవీ, పర్యావరణ అనుమతులు ,  వేల ఎకరాల భూసేకరణ అవసరం ఉంటుంది. 

 దక్షిణ భారతదేశాన్ని సుభిక్షం చేసే ఈ చారిత్రక ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లడానికి చంద్రబాబు అనుభవం, విజయ్ రాజకీయ పట్టుదల కలవడం శుభపరిణామం.  కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం, ఏపీ, తమిళనాడుల సంయుక్త విజ్ఞప్తుల ఆధారంగా ప్రత్యేక ఎస్పీవీని ఏర్పాటు చేసి, నిధులు కేటాయిస్తేనే ఈ బృహత్తర జల యజ్ఞం కాగితాల నుంచి క్షేత్రస్థాయిలోకి దిగుతుంది. రెండు రాష్ట్రాల సీఎంల మధ్య జరిగిన ఈ చర్చలు రాబోయే రోజుల్లో ఢిల్లీ స్థాయిలో ఎలాంటి కదలిక తెస్తాయో చూడాలి.
 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Renuka Chowdhury at ABP Summit: దక్షిణాది వారితో టోకనిజం చేయవద్దు.. ప్రధాని మోదీ, ఎన్నికల సంఘంపై కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి సంచలన వ్యాఖ్యలు!
దక్షిణాది వారితో టోకనిజం చేయవద్దు.. ప్రధాని మోదీ, ఎన్నికల సంఘంపై కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి సంచలన వ్యాఖ్యలు!
Asaduddin Owaisi at ABP Summit: ఆజం ఖాన్ హైదరాబాదీ బిర్యానీ వ్యాఖ్యలకు ఓవైసీ ఘాటు కౌంటర్.. అఖిలేష్ యాదవ్, ఇండియా కూటమిపై నిప్పులు చెరిగిన మజ్లిస్ అధినేత!
ఆజం ఖాన్ హైదరాబాదీ బిర్యానీ వ్యాఖ్యలకు ఓవైసీ ఘాటు కౌంటర్.. అఖిలేష్ యాదవ్, ఇండియా కూటమిపై నిప్పులు చెరిగిన మజ్లిస్ అధినేత!
KTR Speech ABP Southern Rising Summit 2026 : రేవంత్ రెడ్డి వన్ టైమ్ వండర్ లీడర్.. తెలంగాణ కా బాద్షా కేసీఆర్ మాత్రమే! ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్‌లో కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
రేవంత్ రెడ్డి వన్ టైమ్ వండర్ లీడర్.. తెలంగాణ కా బాద్షా కేసీఆర్ మాత్రమే! ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్‌లో కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
Telangana Education Reforms: ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి విద్య, తెలంగాణలో ఆక్స్‌ఫర్డ్, హార్వర్డ్ క్యాంపస్‌లు- ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్‌లో సీఎం రేవంత్ రెడ్డి విద్యారంగ విజన్!
ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి విద్య, తెలంగాణలో ఆక్స్‌ఫర్డ్, హార్వర్డ్ క్యాంపస్‌లు- ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్‌లో సీఎం రేవంత్ రెడ్డి విద్యారంగ విజన్!
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Movie Piracy Gang Arrest: సినిమా పైరసీ ముఠా గుట్టురట్టు.. ఇద్దరు విద్యార్థులను అరెస్ట్ చేసిన TGCSB పోలీసులు!
సినిమా పైరసీ ముఠా గుట్టురట్టు.. ఇద్దరు విద్యార్థులను అరెస్ట్ చేసిన TGCSB పోలీసులు!
Reliance Beverage Plant: 12 నెలల్లోనే పనులు పూర్తి.. రాయలసీమ గడ్డ నుంచి ప్రపంచ మార్కెట్లకు కాంపా కోలా- మంత్రి లోకేశ్
12 నెలల్లోనే పనులు పూర్తి.. రాయలసీమ గడ్డ నుంచి ప్రపంచ మార్కెట్లకు కాంపా కోలా- మంత్రి లోకేశ్
Union Minister Kishan Reddy On Drugs: హైదరాబాద్‌లో విచ్చలవిడిగా డ్రగ్స్‌.. టెర్రాస్‌లపై గంజాయి సాగు- కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
హైదరాబాద్‌లో విచ్చలవిడిగా డ్రగ్స్‌.. టెర్రాస్‌లపై గంజాయి సాగు- కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
Job Fraud: మంత్రి పేషీ పేరుతో ఉద్యోగాల దందా.. నలుగురి వద్ద రూ.50 లక్షలు వసూలు చేసిన నకిలీ ఓఎస్డీ!
మంత్రి పేషీ పేరుతో ఉద్యోగాల దందా.. నలుగురి వద్ద రూ.50 లక్షలు వసూలు చేసిన నకిలీ ఓఎస్డీ!
Rukmini Kota Vs Nagarjuna Yadav: ఆధారాలు చూపకపోతే రూ.10 కోట్ల దావా.. నాగార్జున యాదవ్‌కు రుక్మిణి కోటా అల్టిమేటం
ఆధారాలు చూపకపోతే రూ.10 కోట్ల పరువు నష్టం దావా.. నాగార్జున యాదవ్‌కు రుక్మిణి కోటా అల్టిమేటం
CM Chandrababu: ఎన్నిక ఏదైనా విజయం కూటమిదే.. పరిషత్ ఎన్నికల్లో 96.4 శాతం స్ట్రైక్ రేట్: సీఎం చంద్రబాబు
ఎన్నిక ఏదైనా విజయం కూటమిదే.. పరిషత్ ఎన్నికల్లో 96.4 శాతం స్ట్రైక్ రేట్: సీఎం చంద్రబాబు
Consumer Loan: దీపావళికి భారత్‌లో ప్రతి 100 లోన్లలో 74 మంది ఏం కొన్నారో తెలుసా.. ఆ విషయంలో తెలంగాణ టాప్
దీపావళికి భారత్‌లో ప్రతి 100 లోన్లలో 74 మంది ఏం కొన్నారో తెలుసా.. ఆ విషయంలో తెలంగాణ టాప్
UP CM Yogi Tears: తల్లికి చివరి వీడ్కోలు.. భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్న UP CM యోగి ఆదిత్యనాథ్
తల్లికి చివరి వీడ్కోలు.. భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్న UP CM యోగి ఆదిత్యనాథ్
Embed widget