CBI Court: పర్మిషన్ వస్తుందా? లేదా!- జగన్, విజయసాయి రెడ్డి రిక్వెస్ట్‌లపై రేపు నిర్ణయం
CBI Court: విదేశాలకు వెళ్లేందుకు అనుమతి కోరిన సీఎం జగన్, ఎంపీ విజయసాయి రెడ్డికి సీబీఐ కోర్టులో ఉపశమనం దక్కలేదు.

CBI Court: విదేశాలకు వెళ్లేందుకు అనుమతి కోరిన ఏపీ సీఎం వైఎస్ జగన్, వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డిలకి సీబీఐ కోర్టులో ఉపశమనం దక్కలేదు. ఇద్దరి పర్యటనలపై సీబీఐ వాదనలు విన్న సీబీఐ కోర్టు నిర్ణయాన్ని ఆగస్టు 31 తేదీకి వాయిదా వేసింది. ఇద్దరికి కోర్టు నుంచి ఉపశనమం లభిస్తుందో లేదో గురువారం తేలనుంది. దీంతో వైసీపీ నేతల్లో ఒకింత ఉత్కంఠ నెలకొంది.
సెప్టెంబర్ 2న లండన్‌లోని తన కుమార్తె వద్దకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఈ నెల 28వ తేదీన సీబీఐ కోర్టులో సీఎం జగన్ మోహన్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. దేశం విడిచి వెళ్లరాదన్న బెయిల్ షరతులు సడలించాలని పిటిషన్‌లో కోరారు. దీనిపై కౌంటరు దాఖలు చేసేందుకు గత విచారణలో సీబీఐ సమయం కోరింది. దీంతో జగన్ పిటిషన్‌పై విచారణను ఈనెల 30కి వాయిదా వేసింది. ఇవాళ వాదనలు సీబీఐ తన వాదనలు వినిపించింది. జగన్ విదేశీ పర్యటకు అనుమతి ఇవ్వొద్దని కోర్టును కోరింది. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం సీఎం జగన్ విదేశీ పర్యటనకు అనుమతిపై నిర్ణయాన్ని ఈ నెల 31కి వాయిదా వేసింది.
అలాగే వైసీపీకి చెందిన రాజ్య సభ సభ్యుడు విజయసాయిరెడ్డి సైతం సీబీఐ కోర్టును ఆశ్రయించారు. యూనివర్సిటీలతో ప్రభుత్వ ఒప్పందాల కోసం యూకే, యూఎస్, జర్మనీ, దుబాయ్, సింగపూర్ వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ విషయంపైనా బుధవారం కోర్టులో విచారణ జరిగింది. విజయసాయిరెడ్డి పిటిషన్‌పై సీబీఐ వాదనలు వినిపించింది. విజయసాయిరెడ్డి విదేశీ పర్యటకు అనుమతి ఇవ్వొద్దని కోర్టును సీబీఐ కోరింది. ఈ పిటిషన్‌పై నిర్ణయాన్ని ధర్మాసనం ఈ నెల 31కి వాయిదా వేసింది.
సీబీఐ కోర్టుకు సీఎం జగన్ రిక్వెస్ట్
ఆదాయానికి మించిన ఆస్తులకు సంబంధించి పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విదేశీ పర్యటన కోసం కోర్టును అనుమతి కోరారు. యూకే పర్యటనకు వెళ్లడం కోసం తెలంగాణ కోర్టులో సీఎం జగన్ పిటిషన్ దాఖలు చేశారు. దేశం విడిచి వెళ్ళరాదని బెయిల్ షరతులు ఉండడంతో వాటిని సడలించాలని జగన్ పిటిషన్‌లో కోరారు. అయితే, జగన్ పిటిషన్ పై కౌంటర్ దాఖలు కోసం సీబీఐ సమయం కోరింది. దీంతో జగన్ పిటిషన్ పై విచారణ ఈనెల 30కి సీబీఐ కోర్టు వాయిదా వేసింది. బుధవారం వాదనలు విన్న కోర్టు తుది నిర్ణయాన్ని 31కి వాయిదా వేసింది. లండన్‌లో ఉంటున్న తన కుమార్తె వద్దకు సెప్టెంబర్ 2న వెళ్లాలని సీఎం జగన్ భావిస్తున్నారు.
ఎంపీ విజయసాయి కూడా
మరోవైపు, విదేశీ పర్యటన కోసం ఎంపీ విజయసాయిరెడ్డి కూడా సీబీఐ కోర్టులో పిటిషన్ వేశారు. బెయిల్ షరతులు సడలించాలని కోరుతూ ఎంపీ విజయసాయి రెడ్డి పిటిషన్ వేశారు. యూకే, యూఎస్ఏ, జర్మనీ, దుబాయ్ సింగపూర్ పర్యటనకు విజయసాయి రెడ్డి అనుమతి కోరారు. యూనివర్సిటీలతో ప్రభుత్వ ఒప్పందాల కోసం విదేశాలకు వెళ్లనున్నట్లుగా పిటిషన్ లో విజయసాయి రెడ్డి వెల్లడించారు. అయితే, విజయసాయి రెడ్డి పిటిషన్ పైన కూడా కౌంటరు దాఖలు చేయడం కోసం సీబీఐ సమయం కోరింది. దీంతో విజయసాయి రెడ్డి పిటిషన్‌ను కూడా ఈ నెల 31కి వాయిదా వేసింది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

