News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

SIT What Next : సిట్ ఎవరినైనా అరెస్ట్ చేయగలదా ? విచారణకు రాని వారిపై ఎలాంటి చర్యలు తీసుకోగలదు?

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితులు ఎక్కువగా ఇతర రాష్ట్రాల వారు కావడంతో సిట్ కు పరిమితులు ఎక్కువగాక నిపిస్తున్నాయి. నోటీసులిచ్చిన వారు విచారణకు హాజరు కాలేదు.

FOLLOW US: 
Share:

  
SIT What Next :  ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఈడీ చూపిస్తున్న దూకుడుగా పోటీగా ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ దర్యాప్తులో వేడి చూపించాలన్న పట్టుదల తెలంగాణ ప్రభుత్వంలో ఉంది. అయితే సిట్ తెలంగాణలో మాత్రం అపరిమితమైన అధికారం కలిగి ఉంది. రాష్ట్రం దాటి వెళ్తే..ఏ రాష్ట్రానికి వెళ్తే అక్కడి పోలీసుల సహకారం తీసుకోవాలి. లేకపోతే అడుగు  కూడా ముందుకు వేయలేని పరిస్థితి. ప్రతీ దానికి కోర్టుకెళ్లి పర్మిషన్ తెచ్చుకోవాలి. అలా తెచ్చుకున్నా ... ఆయా రాష్ట్రాల్లో అధికారులు.. ప్రభుత్వం సహకరిస్తుందన్న గ్యారంటీ లేదు. కానీ ఈడీకి మాత్రం అలాంటి సమస్య లేదు. ఎందుకంటే.. తెలంగాణ సర్కార్ ఏర్పాటు చేసిన సిట్ కంటే.. ఈడీకి ఎన్నో రెట్ల బలం ఉంది. సిట్ ఏమీ చేయలేదన్న ఉద్దేశంమతోనే .. ఇతర రాష్ట్రాలకు చెందిన ముగ్గురు విచారణకు సమాచారం లేకుండా గైర్హాజర్ అయ్యారు. మరి ఇప్పుడు సిట్ ఏం చేయబోతోంది ? 
 
సిట్‌ను లైట్ తీసుకున్న ఇతర రాష్ట్రాలకు చెందిన ముగ్గురు !

తెలంగాణకు చెందిన శ్రీనివాస్‌తో పాటు  బీజేపీ కీలక నేత బీఎల్ సంతోష్, కేరళకు చెందిన తుషార్, జగ్గుస్వామిలకు సోమవారం హాజరు కావాలని నోటీసులు ఇచ్చారు. వారిలో శ్రీనివాస్ మాత్రమే సిట్ విచారణ కోసం.. కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు వచ్చారు. మిగిలిన ముగ్గురూ హాజరు కాలేదు. కనీసం సమాచారం కూడా ఇవ్వలేదు.  సిట్ జారీ చేసిన నోటీసులు వారికి అందాయా లేదా అన్నదానిపై స్పష్టత లేదు. ఎందుకంటే నోటీసులు ఇవ్వడానికి ఢిల్లీ పోలీసులు సహకరించడం లేదంటూ సిట్ పోలీసులు హైకోర్టులో పిటిషన్ వేశారు. నోటీసుల్ని ఢిల్లీ పోలీసులకే ఇవ్వాలని.. వారే ఫలానా వ్యక్తికి ఇస్తారని హైకోర్టు సూచించింది.  దీంతో నేరుగా బీఎల్ సంతోష్‌కు సిట్ నోటీసులు ఇచ్చే అవకాశం లేకుండా  పోయింది. ఢిల్లీ పోలీసులకు ఇచ్చి ఉంటారు.. వాళ్లు ఇచ్చారో లేదో తెలియదు. అందుకే సంతోష్ హాజరయ్యే చాన్స్ లేదు. ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చన్న ప్రచారం జరుగుతోంది.  ఇక కేరళకు చెందిన తుషార్, జగ్గూస్వామిల విషయంలోనూ సిట్ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. వారికి నేరుగా నోటీసులు ఇవ్వలేకపోయారు. కేరళలో వామపక్ష ప్రభుత్వం ఉన్నప్పటికీ.. తుషార్ అనే వ్యక్తి.. అక్కడి ప్రభుత్వ  పెద్దలకు కావాల్సిన వ్యక్తన్న ప్రచారం జరుగుతోంది. అలాగే జగ్గూ స్వామి కూడా వారికి దొరకలేదు. 

ఈ ముగ్గుర్నీ అరెస్ట్ చేయడానికి సిట్ ఏం చేయగలదు ?

నోటీసులు జారీ చేసినా.. హాజరు కాలేదు. రాకపోతే అరెస్ట్ చేస్తామని నోటీసుల్లో స్పష్టంగా చెప్పారు. అందుకే ఇప్పుడు సిట్ అధికారులు తీసుకునే చర్యలపై అందరి దృష్టి పడింది. కోర్టు దృష్టికి తీసుకెళ్లి వారెంట్ జారీ చేయించుకుని అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తారని భావిస్తున్నారు. విచారణకు సహకరించాలని గత విచారణ సందర్భంగా హైకోర్టు స్పష్టం చేసింది. అదే సమయంలో అరెస్ట్ చేయవద్దని స్పష్టం చేసింది. ఇప్పుడు విచారణకు సహకరించలేదు కాబట్టి అరెస్ట్ చేసేందుకు చాన్సివ్వాలని హైకోర్టును అభ్యర్థించే అవకాశం ఉంది. హైకోర్టు అనుమతి ఇస్తే అరెస్ట్ చేయగలరు...లేకపోతే లేదు. అయితే  వీరిని సిట్ అదుపులోకి తీసుకోవడం అంత తేలికైన  విషయం కాదు. బీఎల్ సంతోష్ బీజేపీలో అగ్రనేత. ఆయన ఢిల్లీలో ఉంటారు. ఢిల్లీలో ఆప్ ప్రభుత్వం ఉన్నప్పటికీ.. పోలీసు యంత్రాంగం కేంద్రం చేతుల్లో ఉంటుంది. అందుకే బీఎల్ సంతోష్‌ను అరెస్ట్ చేయడం సాధ్యం కాదు. మరి ఇప్పుడు సిట్ ఏం చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. 

సిట్ నిస్సహాయమైతే ..  కొనుగోలు కేసు నిర్వీర్యమైపోతుందా?

ఎమ్మెల్యేల కొనుగోలు కేసు కేవలం తెలంగాణకు  పరిమితమై ఉంటే సమస్య ఉండేది కాదు. కానీ నిందితులు ఎవరూ తెలంగాణకు చెందిన వారు కాదు. బీజేపీ తెలంగాణ నేతలకు తెలియదని.. పోలీసులే ప్రకటించారు. బయట నుంచి వచ్చిన నేతలే బేరాలు నడిపారని అంటున్నారు. రామచంద్రభారతి తెలంగాణలో ఉన్నప్పుడే అరెస్ట్ చేశారు. ఆయనతో టచ్‌లో ఉండి.. డీల్‌కు ప్రయత్నించిన నేతలెవరూ తెలంగాణలో లేరు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే ఉంటారు. అంటే సిట్‌కు ఎలాంటి సహకారం లభించదు. ఓ రకంగా ఇప్పుడు సిట్‌కు న్యాయపరంగా ఆదేశాలు తెచ్చుకుని ముందుకెళ్లడం తప్ప.. ఇతర రాష్ట్రాల్లో అరెస్టులు చేసి తీసుకొచ్చేంత  అవకాశం ఉండకపోవచ్చు. అదే జరిగితే కేసు నిర్వీర్యమైపోతుందేమోనన్న ఆందోళన కూడా  వ్యక్తమవుతోంది. 
 

Published at : 22 Nov 2022 06:33 AM (IST) Tags: CV Anand MLA purchase case CIT CIT investigation BL Santosh

ఇవి కూడా చూడండి

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ నాలుగో విడత వారాహి యాత్ర షెడ్యూల్ ఖరారు, అక్కడినుంచే స్టార్ట్

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ నాలుగో విడత వారాహి యాత్ర షెడ్యూల్ ఖరారు, అక్కడినుంచే స్టార్ట్

AIADMK Breaks With BJP: ఎన్డీఏ కూటమికి అన్నాడీఎంకే గుడ్ బై - అన్నాదురైపై బీజేపీ వివాదాస్పద వ్యాఖ్యలతో కీలక నిర్ణయం

AIADMK Breaks With BJP: ఎన్డీఏ కూటమికి అన్నాడీఎంకే గుడ్ బై - అన్నాదురైపై బీజేపీ వివాదాస్పద వ్యాఖ్యలతో కీలక నిర్ణయం

MP Elections 2023: ఇక మహిళలను విడదీయాలని ప్రయత్నిస్తున్నారు: ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు

MP Elections 2023: ఇక మహిళలను విడదీయాలని ప్రయత్నిస్తున్నారు: ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు

JC Prabhakar: తాడిపత్రిలో ఉద్రిక్తం-జేసీ ప్రభాకర్‌రెడ్డి గృహనిర్బంధం

JC Prabhakar: తాడిపత్రిలో ఉద్రిక్తం-జేసీ ప్రభాకర్‌రెడ్డి గృహనిర్బంధం

Telangana BJP: తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతోంది? నేతల రహస్య సమావేశాలు దేని కోసం ?

Telangana BJP: తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతోంది?  నేతల రహస్య సమావేశాలు దేని కోసం ?

టాప్ స్టోరీస్

Chandrababu Bail Petition: చంద్రబాబు బెయిల్, సీఐడీ కస్టడీ పిటిషన్లపై విచారణ రేపటికి వాయిదా

Chandrababu Bail Petition: చంద్రబాబు బెయిల్, సీఐడీ కస్టడీ పిటిషన్లపై విచారణ రేపటికి వాయిదా

Hyundai Exter: ఈ కారు కొనాలంటే ఎనిమిది నెలల వరకు ఆగాల్సిందే - బ్లాక్‌బస్టర్ కదా ఆ మాత్రం ఉంటది!

Hyundai Exter: ఈ కారు కొనాలంటే ఎనిమిది నెలల వరకు ఆగాల్సిందే - బ్లాక్‌బస్టర్ కదా ఆ మాత్రం ఉంటది!

Skanda Release Trailer: సీఎంకు కాబోయే అల్లుడిగా రామ్ - ‘స్కంద’ కొత్త ట్రైలర్ చూశారా?

Skanda Release Trailer: సీఎంకు కాబోయే అల్లుడిగా రామ్ - ‘స్కంద’ కొత్త ట్రైలర్ చూశారా?

చాలామంది నన్ను ఉంచుకుంటా అన్నారు, కానీ పెళ్లి చేసుకుంటా అనలేదు: జయలలిత

చాలామంది నన్ను ఉంచుకుంటా అన్నారు, కానీ పెళ్లి చేసుకుంటా అనలేదు: జయలలిత