అన్వేషించండి

BJP YCP Relation : ఏపీ ప్రభుత్వ ఆర్థిక కష్టాల్ని తీరుస్తున్న కేంద్రం - రాజకీయంగానూ బీజేపీ సంకేతాలు పంపినట్లేనా ?

ఏపీ ప్రభుత్వానికి సహకరించడం ద్వారా బీజేపీ.. తాము వైసీపీకే దగ్గర అని సంకేతాలు పంపిందా ? . ఏపీ బీజేపీ నేతలేమంటున్నారు ?

 

BJP YCP Relation :   ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన లోటు  భర్తీ నిధులను కేంద్రం విడుదల చేసింది. దాదాపుగా రూ. పది వేల కోట్లకుపైగా నిధులను విడుదల చేసింది. ఇది ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రానికి ఎంతగానో ఉపయోగపడుంది. సమస్యల్లో ఉన్న రాష్ట్ర ప్రభుత్వానికి ఉపయోగపడతాయి. ఈ ఏడాది మీట నొక్కాల్సిన పథకాలు.. రైతు భరోసా, అమ్మఒడి వంటి వాటికి ఆ నిధులు సరిపోతాయి. అంతేనా.. ప్రతీ వారం రూ. రెండు వేల కోట్లు అప్పులకు కేంద్రం పర్మిషన్ ఇస్తోంది. దీంతో ఏపీ ప్రభుత్వం.. బటన్ నొక్కే కష్టాలు తీరిపోయినట్లేనని..వైసీపీకి బీజేపీకి ఇంత కంటే గొప్ప సాయం ఎలా చేయగలదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. 

టీడీపీ హయాంలో ఇవ్వాల్సిన నిధులు ఇప్పుడు విడుదల 

రాష్ట్రం ఏర్పడిన సంవత్సరంలో లోటును భర్తీ చేయాలని విభజన చట్టంలో ఉంది. ఆ మేరకు .. లోటు భర్తీ కోసం చంద్రబాబు ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేసిందో లెక్కేలేదు. చివరికి విసుగొచ్చేసి ప్రభుత్వం నుంచి బయటకు వచ్చింది. కానీ ఇవ్వలేదు. ఇప్పుడు జగన్ రెడ్డి సర్కార్ కు ఆ నిధులన్నీ ఇస్తోంది. దాదాపుగా రూ. పది వేల కోట్లకుపైగా లోటు భర్తీ నిధులు రాష్ట్రానికి ఇచ్చినట్లుగా తెలుస్తోంది. దీంతో ఏపీ ప్రభుత్వం పండగ చేసుకోనుంది. కేంద్ర - రాష్ట్రాల మధ్య రాజ్యాంగపరమైన సంబంధాలు ఉంటాయి. వాటికి రాజకీయాలతో సంబంధం లేదు. చట్ట ప్రకారం రాష్ట్రాలకు కేటాయించాల్సిన నిధులు రాజ్యాంగపరంగా ఉంటాయి. ఆ ప్రకారం కేంద్రం రాష్ట్రాలకు ఇవ్వాల్సిందే. విభజన చట్టంలో భాగంగా కేంద్రం లోటు  భర్తీ చేయాల్సి ఉంది. ఆ మేరకు లోటు భర్తీని కేంద్రం చేసింది. ఏపీకి రూ. పది వేల కోట్లకుపైగా నిధుల్ని ఇచ్చింది. కానీ చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఇవ్వకుండా ఇప్పుడెందుకు ఇస్తున్నారన్నది అసలు రాజకీయవర్గాలకు వచ్చిన డౌట్ 

వైసీపీకి బీజేపీకి దూరమని ప్రజలు అనుకోవాలన్న టీడీపీ !

ఇటీవల జనసేన అధినేత పవన్ కల్యాణ్.. వైసీపీ విముక్త ఏపీ కోసం బీజేపీని కలుపుకుంటామని ప్రకటించారు. అంతే కాదు బీజేపీ కలిసి వస్తుందని కూడా ప్రకటించేశారు. కానీ టీడీపీ మాత్రం ముందు వైసీపీకి.. బీజేపీకి దూరమని ప్రజలు అనుకోవాలన్నారు. అందు కోసం  అడ్డగోలుగా అప్పులు ఇవ్వడం మానుకోవాలని ..   సహకరించడం ఆపేయాలన్నారు. కానీ అనూహ్యంగా గత ప్రభుత్వంలో ఇవ్వాల్సిన నిధులు కూడా ఇవ్వడంతో ఇప్పుడు వైసీపీకి..బీజేపీ మరింత దగ్గరన్న వాదన వినిపించడానికి ఎక్కువ అవకాశం ఏర్పడింది. 

రాజకీయానికి సంబంధం  లేదంటున్న ఏపీ బీజేపీ !  

అయితే  భారతీయ జనతా పార్టీకి రాష్ట్రం ముఖ్యమని..ఎవరు అధికారంలో ఉన్నారన్నది కాదని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు స్పష్టం చేశారు.   గత తొమ్మిది సంవత్సరాల్లో ఏపీ ప్రయోజనాల కోసం దాదాపు 3 లక్షల కోట్లు బిజెపి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కి ఇచ్చిందని  గుర్తు చేశారు.  రాజకీయాల కోసం కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలపై వివక్ష చూపదని తాజాగా ఇచ్చిన నిధుల ద్వారా స్పష్టమయిందని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ అంటున్నారు.   రాష్ట్రానికి ఇచ్చిన నిధుల పట్ల రాజకీయం చేయడం రాష్ట్ర ప్రయోజనాలకు ద్రోహం చేయడమేనని ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్దన్ రెడ్డి అన్నారు. నిధులు ఇవ్వడం లేదని ఇంత కాలం నిందలు వేశారని..  ఇప్పుడు ఇచ్చారని అనడం ఏమిటని ఆయన ప్రశ్నించారు.  
  
బీజేపీ నేతలు ఎలా సమర్థించుకున్నా.. ప్రస్తుతం అటు ఆర్థికంగా.. ఇటు కేసుల పరంగా జరుగుతున్న పరిణామాలు చూస్తే.. బీజేపీకి  వైసీపీకి దగ్గరే అన్న భావన బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఇతర పార్టీలు ప్రయత్నిస్తాయి. మరి ..బీజేపీని కలుపుకోవాలనుకుంటున్న పవన్ కల్యాణ్ ప్రస్తుత పరిస్థితులపై ఎలా స్పందిస్తారో ?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్‌లో న్యూ ఇయర్ మార్పులు - ఇంచార్జ్‌గా దీపాదాస్ స్థానంలో సీనియర్ నేత?
తెలంగాణ కాంగ్రెస్‌లో న్యూ ఇయర్ మార్పులు - ఇంచార్జ్‌గా దీపాదాస్ స్థానంలో సీనియర్ నేత?
Perni Nani Wife Jayasudha : రేషన్ బియ్యం మాయం కేసులో పేర్ని నాని భార్యను ప్రశ్నించిన పోలీసులు- రెండున్నర గంటలపాటు విచారణ
రేషన్ బియ్యం మాయం కేసులో పేర్ని నాని భార్యను ప్రశ్నించిన పోలీసులు- రెండున్నర గంటలపాటు విచారణ
Modi Government : రైతులకు హ్యాపీ న్యూస్ చెప్పిన మోదీ ప్రభుత్వం- ఎరువులు, బీమా స్కీమ్‌లో భారీ మార్పులు 
రైతులకు హ్యాపీ న్యూస్ చెప్పిన మోదీ ప్రభుత్వం- ఎరువులు, బీమా స్కీమ్‌లో భారీ మార్పులు 
AP In WEF 2025: దావోస్ పర్యటనకు సీఎం చంద్రబాబు- వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు హాజరు
దావోస్ పర్యటనకు సీఎం చంద్రబాబు- వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు హాజరు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Rohit Sharma test Retirement | బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో వైఫల్యంతో రోహిత్ మనస్తాపం | ABP DesamGautam Gambhir Coaching Controversy | గంభీర్ కోచింగ్ పై బీసీసీఐ అసంతృప్తి | ABP DesamSS Rajamouli Mahesh babu Film Launch | మహేశ్ సినిమాకు పూజ..పనులు మొదలుపెట్టిన జక్కన్న | ABP Desamతప్పతాగి కరెంటు తీగలపై పడుకున్నాడు - వీడియో

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్‌లో న్యూ ఇయర్ మార్పులు - ఇంచార్జ్‌గా దీపాదాస్ స్థానంలో సీనియర్ నేత?
తెలంగాణ కాంగ్రెస్‌లో న్యూ ఇయర్ మార్పులు - ఇంచార్జ్‌గా దీపాదాస్ స్థానంలో సీనియర్ నేత?
Perni Nani Wife Jayasudha : రేషన్ బియ్యం మాయం కేసులో పేర్ని నాని భార్యను ప్రశ్నించిన పోలీసులు- రెండున్నర గంటలపాటు విచారణ
రేషన్ బియ్యం మాయం కేసులో పేర్ని నాని భార్యను ప్రశ్నించిన పోలీసులు- రెండున్నర గంటలపాటు విచారణ
Modi Government : రైతులకు హ్యాపీ న్యూస్ చెప్పిన మోదీ ప్రభుత్వం- ఎరువులు, బీమా స్కీమ్‌లో భారీ మార్పులు 
రైతులకు హ్యాపీ న్యూస్ చెప్పిన మోదీ ప్రభుత్వం- ఎరువులు, బీమా స్కీమ్‌లో భారీ మార్పులు 
AP In WEF 2025: దావోస్ పర్యటనకు సీఎం చంద్రబాబు- వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు హాజరు
దావోస్ పర్యటనకు సీఎం చంద్రబాబు- వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు హాజరు
Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో మరింత విస్తరణ- మేడ్చల్ వరకూ పొడిగింపు - డీపీఆర్‌కు రేవంత్ ఆదేశం
హైదరాబాద్ మెట్రో మరింత విస్తరణ- మేడ్చల్ వరకూ పొడిగింపు - డీపీఆర్‌కు రేవంత్ ఆదేశం
Chandrababu First Sign in 2025: నూతన సంవత్సరంలో సీఎం చంద్రబాబు తొలి సంతకం, వారికి అందనున్న ఆర్ధికసాయం
నూతన సంవత్సరంలో సీఎం చంద్రబాబు తొలి సంతకం, వారికి అందనున్న ఆర్ధికసాయం
Lucknow Crime News : అక్కాచెల్లెళ్లను హైదరాాబాద్‌లో అమ్మేస్తారని చంపేశా - సంచలనం రేపుతున్న లక్నో హత్య కేసు నిందితుడి వీడియో
అక్కాచెల్లెళ్లను హైదరాాబాద్‌లో అమ్మేస్తారని చంపేశా - సంచలనం రేపుతున్న లక్నో హత్య కేసు నిందితుడి వీడియో
KTR Comments On Hyderabad Regional Ring Road : నాపై పెట్టింది లొట్టపీసు కేసు- రేవంత్‌ను కూడా అరెస్టు చేయాలి- ట్రిపుల్ ఆర్‌లో భారీ అవినీతి: కేటీఆర్
నాపై పెట్టింది లొట్టపీసు కేసు- రేవంత్‌ను కూడా అరెస్టు చేయాలి- ట్రిపుల్ ఆర్‌లో భారీ అవినీతి: కేటీఆర్
Embed widget