అన్వేషించండి

KCR Students Plan: విద్యార్థులతోనే బీఆర్ఎస్ పునర్‌నిర్మాణం - కేసీఆర్ మాస్టర్ ప్లాన్ వర్కవుట్ అవుతుందా?

BRS Reconstruction: బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేయాలంటే.. విద్యార్థులే కీలకమని కేసీఆర్ భావిస్తున్నారు. దాని కోసం కార్యాచరణ కూడా పార్టీ నేతలకు ఇచ్చారు.

BRS Reconstruction with Students  : తెలంగాణ రాజకీయాల్లో మరోసారి  విద్యార్థి శంఖారావం  వినిపించాలని గులాబీ అధినేత కేసీఆర్ భావిస్తున్నారు. ఉద్యమ కాలంలో కేసీఆర్ పిలుపుతో ఉస్మానియా, కాకతీయ విశ్వవిద్యాలయాలు ఎలాగైతే కదిలాయో.. అదే తరహా ఇంటెన్సిటీని ప్రస్తుత రాజకీయ పోరాటాల్లోకి తీసుకురావడమే లక్ష్యంగా బీఆర్ఎస్ అడుగులు వేస్తోంది.  

 యువశక్తే ఆయుధంగా కేసీఆర్ రీ-లోడింగ్ 

తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ ప్రత్యక్షంగా రంగంలోకి రాకముందే విద్యార్థి లోకం రహదారులపైకి వచ్చింది. విద్యార్థుల పోరాటమే ఆనాడు రాజకీయ పార్టీలను ఉక్కిరిబిక్కిరి చేసింది. ఇప్పుడు అదే వ్యూహాన్ని కేసీఆర్ మళ్ళీ నమ్ముకున్నారు. ప్రతి కాలేజీలో బీఆర్ఎస్ విద్యార్థి విభాగ కమిటీలను బలోపేతం చేయాలని, యువతను ఫుల్ టైమ్ పొలిటికల్ వారియర్స్ 'గా మార్చాలని ఆయన ఆదేశించడం వెనుక ఒక బలమైన కారణం ఉంది. అధికారంలో ఉన్నప్పుడు పార్టీ యంత్రాంగం కొంత స్తబ్దుగా మారినా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్వంపై రాజీలేని పోరాటం చేయాలంటే విద్యార్థుల తెగువ అవసరమని ఆయన గుర్తించారు.

 ఉద్యమ ఇంటెన్సిటీ రాజకీయాలకు సాధ్యమేనా? 

అయితే, ఉద్యమ కాలం నాటి సెంటిమెంట్ వేరు, ఇప్పటి రాజకీయ అవసరాలు వేరు. ఆనాడు ప్రత్యేక రాష్ట్రం అనే ఏకైక లక్ష్యం విద్యార్థులను భావోద్వేగంతో ఏకం చేసింది. కానీ నేడు ఉపాధి కల్పన, ఫీజు రీయింబర్స్‌మెంట్, జాబ్ క్యాలెండర్ వంటి అంశాలే విద్యార్థి రాజకీయాలను శాసిస్తున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నాయకులు గెల్లు శ్రీనివాస్ యాదవ్ వంటి వారి నేతృత్వంలో అసెంబ్లీ ముట్టడి, ఫీజుల బకాయిలపై నిరసనలు చేపడుతూ యాక్టివ్ అవుతున్నారు. కానీ, రాజకీయ ప్రయోజనాల కోసం చేసే పోరాటాలకు విద్యార్థులు ఏ మేరకు స్వచ్ఛందంగా కదులుతారనేది ప్రశ్నార్థకమే. 

 కేసీఆర్ మార్క్ వ్యూహం.. ఆకర్షణే ప్రధానం 

కేసీఆర్ కేవలం నిరసనలకే పరిమితం కాకుండా, యువతకు రాజకీయ ప్రాధాన్యత కల్పించే దిశగా అడుగులు వేస్తున్నారు. కాలేజీ స్థాయిలోనే నాయకత్వ లక్షణాలు పెంచి, వారిని భవిష్యత్ ఎన్నికల ముఖచిత్రంగా చూపడం ద్వారా కొత్త రక్తాన్ని పార్టీలోకి ఎక్కించాలనుకుంటున్నారు. ప్రభుత్వంపై పోరాడే క్రమంలో విద్యార్థులు ఎదుర్కొనే కేసులను, సమస్యలను పార్టీ అండగా నిలబడి చూసుకుంటుందని భరోసా ఇవ్వడం ద్వారా వారిని  యాక్టివ్ మోడ్ లోకి తీసుకురావాలని చూస్తున్నారు.  ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై విద్యార్థుల్లో ఉన్న చిన్నపాటి అసంతృప్తిని కూడా వదులుకోకూడదని బీఆర్ఎస్ భావిస్తోంది. ప్రత్యేకించి విద్యా రంగానికి కేటాయింపులు, నిరుద్యోగ భృతి వంటి హామీలపై ఉన్న వ్యతిరేకతను విద్యార్థి కమిటీల ద్వారా క్షేత్రస్థాయికి తీసుకెళ్లడం కేసీఆర్ మాస్టర్ ప్లాన్. విద్యార్థులు రోడ్లెక్కితే అది సృష్టించే ఇంపాక్ట్ మీడియాలోనూ, ప్రజల్లోనూ బలంగా ఉంటుంది. ఇది రాజకీయంగా బీఆర్ఎస్‌కు మళ్లీ పూర్వవైభవం తీసుకువస్తుందని ఆశిస్తున్నారు.

కేసీఆర్ ప్లాన్ ఫలిస్తుందా?  

విద్యార్థులను రాజకీయాల కోసం రోడ్లపైకి తీసుకురావడం కేసీఆర్ లాంటి చతురత కలిగిన నేతకు పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు. కానీ, కేవలం ప్రభుత్వంపై విమర్శలకే పరిమితం కాకుండా, విద్యార్థుల కెరీర్‌కు బీఆర్ఎస్ ఏ రకమైన భరోసా ఇస్తుందనే స్పష్టత ఇవ్వాల్సి ఉంటుంది.  రాజకీయ సమీకరణలు మారుతున్న తరుణంలో, ఈ విద్యార్థి కమిటీలు బీఆర్ఎస్‌కు ఏ మేరకు  బూస్టర్ డోస్ గా మారుతాయో చూడాలి. ఏది ఏమైనా, కేసీఆర్ తీసుకున్న ఈ నిర్ణయం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి సెగ పుట్టించడం ఖాయం అనుకోవచ్చు.  

టాప్ హెడ్ లైన్స్

Telangana Politics Personal Attacks: తెలంగాణ రాజకీయం వ్యక్తిగత శత్రుత్వంగా మారుతోందా? - వ్యక్తిత్వాలపై దాడి దేనికి సంకేతం?
తెలంగాణ రాజకీయం వ్యక్తిగత శత్రుత్వంగా మారుతోందా? - వ్యక్తిత్వాలపై దాడి దేనికి సంకేతం?
TVK Wins Tamil Nadu By Polls: తమిళనాడు ఉప ఎన్నికల్లో టీవీకే ఘన విజయం.. సీఎం విజయ్ పాలనకు రాలిన ఓట్లు
తమిళనాడు ఉప ఎన్నికల్లో టీవీకే ఘన విజయం.. సీఎం విజయ్ పాలనకు రాలిన ఓట్లు
Telangana Power Crisis: తెలంగాణలో కరెంట్ కష్టాలు - రూ.5,420 కోట్ల ట్రూ-అప్ షాక్ - ప్రజాగ్రహాన్ని తెలంగాణ ప్రభుత్వం తప్పించుకోగలదా?
తెలంగాణలో కరెంట్ కష్టాలు - రూ.5,420 కోట్ల ట్రూ-అప్ షాక్ - ప్రజాగ్రహాన్ని తెలంగాణ ప్రభుత్వం తప్పించుకోగలదా?
KCR Farmhouse 45 Acres Missing Land: కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో 45 ఎకరాల మిస్సింగ్ భూమి కలకలం - నోటీసులు రెడీ..రాజకీయ భూకంపం తప్పదా?
కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో 45 ఎకరాల మిస్సింగ్ భూమి కలకలం - నోటీసులు రెడీ..రాజకీయ భూకంపం తప్పదా?

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Govt Good News: జీవో 59 దరఖాస్తుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌‌‌న్యూస్‌, క్రమబద్ధీకరణకు అనుమతి
జీవో 59 దరఖాస్తుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌‌‌న్యూస్‌, క్రమబద్ధీకరణకు అనుమతి
TVK Wins Tamil Nadu By Polls: తమిళనాడు ఉప ఎన్నికల్లో టీవీకే ఘన విజయం.. సీఎం విజయ్ పాలనకు రాలిన ఓట్లు
తమిళనాడు ఉప ఎన్నికల్లో టీవీకే ఘన విజయం.. సీఎం విజయ్ పాలనకు రాలిన ఓట్లు
Nobel Peace Prize 2026: భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదే
భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదే
EYES Web Series Review - 'ఐస్' వెబ్ సిరీస్ రివ్యూ: సోనీలివ్ ఓటీటీలో మలయాళ వెబ్ సిరీస్... తెలుగులోనూ స్ట్రీమింగ్
'ఐస్' వెబ్ సిరీస్ రివ్యూ: సోనీలివ్ ఓటీటీలో మలయాళ వెబ్ సిరీస్... తెలుగులోనూ స్ట్రీమింగ్
AI Abuse Prevention: ఏఐని వేధించడం ఇక కుదరదు.. క్లాడ్ కోసం ఆంథ్రోపిక్ కఠిన నిబంధనలు
ఏఐని వేధించడం ఇక కుదరదు.. క్లాడ్ కోసం ఆంథ్రోపిక్ కఠిన నిబంధనలు
Gade Saikrishna Custodial Death Case: గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
BC Reservations In AP: బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు పార్టీ పరంగానైనా అమలు చేస్తాం: టీడీపీ కీలక ప్రకటన
బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు పార్టీ పరంగానైనా అమలు చేస్తాం: టీడీపీ కీలక ప్రకటన
Spiderman Brand New Day OTT : మరో ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - ఏయే ప్లాట్ ఫామ్స్‌లో స్ట్రీమింగ్ అవుతుందంటే?
మరో ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - ఏయే ప్లాట్ ఫామ్స్‌లో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Embed widget