Jamili elections : జమిలీ ఎన్నికలకు బీఆర్ఎస్ అనుకూలమేనా ? కాంగ్రెస్ వ్యతిరేకించిందని సమర్థిస్తారా ?
KCR : జమిలీ ఎన్నికలపై బీఆర్ఎస్ విధానంపై స్పష్టత రావాల్సి ఉంది. గతంలో ఆ పార్టీ సానుకూలత వ్యక్తం చేసింది. మరి ఇప్పుడు ?
BRS policy on Jamili elections needs to be clarified : దేశంలో జమిలీ ఎన్నికల నిర్వహణ చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం గట్టి ప్రయత్నాల్లో ఉంది. మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కమిటీ నివేదికకు ఆమోదం తెలిపారు. ఇక పార్లమెంట్‌లో బిల్లు పెట్టి పాస్ చేసుకోవాల్సి ఉంది. ఇందు కోసం రాజ్యాంగ సవరణ అవసరం అయితే చేస్తారు. ఇప్పటికే లా కమిషన్ కూడా అన్ని పార్టీల అభిప్రాయాలు తెలుసుకుంది. గతంలో బీఆర్ఎస్ జమిలీకి సానుకూలత తెలిపింది. ఇప్పుడు ఆ పార్టీ విధానంపై ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.
గతంలో జమిలీకి అనుకూలత తెలిపిన బీఆర్ఎస్
భారత రాష్ట్ర సమితి జమిలీ ఎన్నికలపై ఇప్పుడు ఎలాంటి ప్రకటనలు చేయడం లేదు కానీ.. గతంలో గట్టిగా సమర్థించింది. కేంద్ర ఎన్నికల కమిషన్‌తో పాటు.. లా కమిషన్‌కు కూడా తన అభిప్రాయాలను స్పష్టంగా చెప్పింది. ఢిల్లీలో బీఆర్ఎస్ తరపున ప్రతినిధిగా వ్యవహరించే మాజీ ఎంపీ వినోద్ కుమార్.. ఆయా సంస్థలు నిర్వహించిన సమావేసాలకు హాజరై అధికారికంగా తమ పార్టీ విధానాన్ని వెల్లడించారు. తమ పార్టీ జమిలీకి అనుకూలమని తెలిపారు. కేంద్ర లా కమిషన్ 2018 జూలై, ఆగస్టు మాసాల్లో ఐదు రోజుల పాటు వివిధ పార్టీల అభిప్రాయాలను తెలుసుకుంది. 2018 జూలై 8న బీఆర్ఎస్ తరఫున వినోద్ కుమార్ హాజరై జమిలీకి మద్దతు తెలిపారు. దేశానికి కూడా జమిలీ వల్ల లాభం ఉంటుందన్నారు. అది అధికారికంగా నమోదైన అభిప్రాయం.
వన్ నేషన్ వన్ ఎలక్షన్‌తో దేశాన్ని కబ్జా చేసేందుకు బీజేపీ ప్రయత్నం- రేవంత్ తీవ్ర ఆరోపణలు
పార్టీ నిర్ణయాలు మాత్రం జమిలీకి వ్యతిరేకం
అయితే కేసీఆర్ పార్టీ నిర్ణయాల్లో మాత్రం జమిలీకి వ్యతిరేకంగా తీసుకున్నారు. నిజానికి తెలంగాణలో జమిలీ ఎన్నికలే జరగాలి. 2014లో అసెంబ్లీకి..లోక్ సభకు ఒకేసారి ఎన్నికలు జరిగాయి. కానీ 2019లో జమిలీ ఎన్నికలు జరిగితే తమకు నష్టం జరుగుతుందని జాతీయ అంశాలు ఓటింగ్ ప్రయారిటీగా మారుతాయన్న అంచనాతో.. ఐదు నెలల ముందుగానే ఎన్నికలకు వెళ్లారు. దాంతో జమిలీకి అవకాశం లేకుండా పోయింది. జమలీ జరిగితే తమకు నష్టమని బీఆర్ఎస్ అప్పుడు భావించింది. ఇప్పుడు ఏం చేస్తుంందన్నది్ మాత్రం ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.
హైడ్రాకు చట్టబద్ధతకు మరో అడుగు మాత్రమే - ఇక మార్కింగ్ చేసిన వాటిపై దండెత్తడమే మిగిలిందా ?
కాంగ్రెస్ వ్యతిరేకత - కాంగ్రెస్‌తో గొంతు కలపలేని పరిస్థితి
కాంగ్రెస్ పార్టీ జమిలీ ఎన్నికలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తోంది. విపక్షాలన్నీ కలసి వస్తే జమిలీ ఎన్నికలను అడ్డుకుందామని పిలుపునిస్తోంది. ఇప్పుడు బీఆర్ఎస్ తాము కూడా జమిలీ ఎన్నికలకు వ్యతిరేకమని కాంగ్రెస్ పార్టీతో వాయిస్ కలిపే పరిస్థితి ఉండదు. అలాగని .. పూర్తి అనుకూలమా అంటే.. చెప్పలేకపోతున్నారు. రికార్డుల పరంగా ఇప్పటికి బీఆర్ఎస్ అనుకూలం. కానీ ఆ పార్టీ తన విధానాన్ని మార్చుకోవడానికి తనకు అవకాశం ఉంటుంది. కానీ ఇంకా డైలమాలోనే ఉన్నారు. పార్లమెంట్ లో బిల్లు పెట్టినా..లోక్ సభలో ఒక్క ఎంపీ కూడా లేరు. రాజ్యసభలో ఉన్న ఎంపీలు అప్పటి రాజకీయ పరిస్థితుల్ని బట్టి నిర్ణయం తీసుకుంది. రికార్డుల పరంగా బీఆర్ఎస్ అనుకూలత.. రాజకీయం పరంగా వ్యతిరేకత కనబరుస్తున్నారని అనుకోవచ్చు. అసలు విధానమేంటో.. సందర్భం వచ్చేదాకా ప్రకటించకపోవచ్చని భావిస్తున్నారు.