Kavitha News: 'మహిళా రిజర్వేషన్లకు తూట్లు పొడుస్తున్నారు' - మల్లికార్జున ఖర్గేకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత లేఖ
Women Reservations: తెలంగాణ ప్రభుత్వం మహిళా రిజర్వేషన్లకు తూట్లు పొడుస్తోందని కాంగ్రెస్ అధిష్టానానికి కవిత ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు ఆమె లేఖ రాశారు.
BRS Mlc Kavitha Letter To Mallikarjun Kharge on Women Reservations: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో (Telangana) అధికార కాంగ్రెస్(Congress), బీఆర్ఎస్ (BRS) నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. చాలా రోజుల తర్వాత మళ్లీ రాజకీయంగా క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న కేసీఆర్ కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(Kalavakuntal Kavitha) ఏకంగా కాంగ్రెస్ అధిష్టానానికే రాష్ట్ర పార్టీ వ్యవహార శైలిపై ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో మహిళా రిజర్వేషన్లకు తూట్లు పొడుస్తున్నారని ఆరోపిస్తూ ఓ లేఖ రాశారు.
మహిళా రిజర్వేషన్లకు మంగళం
మహిళల ఓట్లతో రాష్ట్రంలో అధికారం చేపట్టిన కాంగ్రెస్(Congress) పార్టీ ఇప్పుడు వారి హక్కులనే కాలరాస్తోదంటూ బీఆర్ఎస్(BRS) ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(Kavitha) ఆరోపించారు. ఎన్నో ఉద్యమాలు, పోరాటాల ఫలితంగా వచ్చిన ఆడబిడ్డల హక్కులను తుంగలో తొక్కుతోందని విమర్శించారు. 1996లో అనేక పోరాటాల ఫలితంగా మహిళలకు ఉపాధి అవకాశాల్లో 33.3 శాతం రిజర్వేషన్లు(Mahila Reservations) కల్పిస్తూ జీవో నెంబరు 41, 56 జారీ అయ్యాయి. దీనికి 1992లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఇందిరా సాహ్ని తీర్పు కూడా ఎంతో తోడ్పాటునిచ్చిందని ఆమె గుర్తు చేశారు. ఆ తర్వాత రాజ్యంగబద్ధంగా మహిళలకు రోస్టర్ పాయింట్లతో కూడిన హారిజాంటల్ రిజర్వేషన్లు కల్పించారు. మన దేశంలో సామాజిక రిజర్వేషన్లు ఎలా అయితే ఉన్నాయో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కచ్చితంగా అమలు చేసే పద్ధతి నడుస్తోందన్నారు. ఇన్నేళ్ల నుంచి సాగుతున్న ఈ పద్ధతిని ఇటీవల రాజస్థాన్(Rajasthan) పబ్లిక్ సర్వీస్ కమిషన్ కేసులో సుప్రీం కోర్టు(Supreme Court) ఇచ్చిన తీర్పును పరిగణలోకి తీసుకుని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల హక్కులను కాలరాస్తూ జీవో 41, 56ను రద్దు చేస్తూ ఈ నెల 10న కొత్తగా జీవో 3ను తీసుకొచ్చిందంటూ కాంగ్రెస్(Congress) పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే(Mallikarjuana Kharge)కు కవిత లేఖ రాశారు.
'కేసీఆర్ వద్దే వద్దన్నారు'
రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసినా... మహిళల హక్కులను హరించబోమని 2023 కేసీఆర్(KCR) ప్రభుత్వం తెలంగాణ హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసిందని కవిత(Kavitha) ఈ సందర్భంగా గుర్తు చేశారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఎవరితోనూ సంప్రదింపులు జరపకుండానే మహిళల హక్కులకు భంగం కలిగిస్తూ ఈ నెల 6న రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ ను ఉపసంహరించుకుందన్నారు. తద్వారా మహిళల హక్కులను సంపూర్ణంగా, శాశ్వతంగా హరిస్తూ రోస్టర్ పాయింట్లు లేకుండా హారిజాంటల్ పద్ధతిలో రిజర్వేషన్లను కల్పిండానికి జీవో 3ను ప్రభుత్వం జారీ చేసిందని తెలిపారు. ఇది మహిళల ఉద్యోగావకాశాలకు శరాఘాతంగా మారనుందని కవిత మండిపడ్డారు. ఈ ఏడాది 2 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతోందని.. ఆ లెక్కన చూస్తే మహిళలకు 33.3 శాతం ప్రకారం 66 వేలకు పైగా ఉద్యోగాలు రావాలి. కానీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలకు తీరని అన్యాయం జరుగుతుందన్నారు. సుప్రీం తీర్పును పాటించబోమని ఇప్పటికే బిహార్, కర్నాటక రాష్ట్రాలు జీవోలు జారీ చేశాయి. కానీ తెలంగాణలో మాత్రం ఆడబిడ్డలకు అన్యాయం చేసేలా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఖర్గేకు రాసిన లేఖలో కవిత పేర్కొన్నారు. ఈ విషయంలో కాంగ్రెస్ అధినాయకత్వం జోక్యం చేసుకుని జీవోను వెనక్కి తీసుకునేలా సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy)ని ఆదేశించాలని ఆమె మల్లికార్జున ఖర్గేను కోరారు.