News
News
X

TSBJP Plan : కేసులతో బీఆర్ఎస్ ఉక్కిరిబిక్కిరి - ఇదే సమయం అనుకుంటున్న తెలంగాణ బీజేపీ ! మిషన్ 90 ప్రారంభమైనట్లేనా ?

తెలంగాణలో మారుతున్న రాజకీయాలు

కేసులతో బీఆర్ఎస్ ఉక్కిరిబిక్కి

ప్రజల్లోకి వెళ్తున్న బీజేపీ

ముందు ముందు ఈ రాజకీయమే ఉంటుందా ?

FOLLOW US: 
Share:

TSBJP Plan :   తెలంగాణలో 90 స్థానాలపై గురి పెట్టిన బీజేపీ .. వాటిలో బలమైన అభ్యర్థులను నిలబెట్టడమే కాదు గెలిచి తీరాలన్న పట్టుదలతో వ్యూహాలను ఖరారు చేస్తోంది. తెలంగాణలో గెలుపును అమిత్ షా చాలా సీరియస్‌గా తీసుకున్నారు. నేరుగా ఆయనే వ్యూహాలను ఖరారు చేస్తున్నారని చెబుతున్నారు. తెలంగాణలో పాతుకుపోయిన  బీఆర్ెస్‌ను దెబ్బకొడితేనే బీజేపీ బలం పుంజుకుంటుందనే అభిప్రాయానికి వచ్చారు. దీంతో ఓ వైపు బీఆర్ఎస్‌ను బలహీనం చేయడం.. మరో వైపు బీజేపీని బలోపేతం చేయడంపై దృష్టి పెట్టారు. అధికారిక కార్యక్రమాలకు తరచూ  తెలంగాణకు వస్తున్న అమిత్ షా ..  పార్టీ నేతలతో అంతర్గత సమావేశాలు నిర్వహిస్తున్నారు. 

ఢిల్లీ లిక్కర్ స్కాంతో బీఆర్ఎస్‌పై ముప్పేట దాడి ! 

కేసీఆర్‌ కుమార్తె కవిత ఢిల్లీ లిక్కర్ స్కాంలో కీలక  పాత్ర పోషించినట్లుగా ఆరోపణలు రావడం.. ఈడీ అరెస్ట్ చేస్తుందన్న ప్రచారంతో బీజేపీ నేతలు కూడా అప్రమత్తమయ్యారు. కవితను అరెస్ట్ చేస్తే అవినీతి ఆరోపణలతో మరింతగా విరుచుకుపడేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు.  అలాగే  సుప్రీంకోర్టు లో ఉన్న ఎమ్మెల్యేల ఎర కేసు విచారణ సీబీఐ అధీనంలోకి వస్తే కేసీఆర్‌ను నేరుగా టార్గెట్‌ చేయవచ్చునని బీజేపీ  భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ కేసులతో బీఆర్ఎస్ అగ్రనాయకత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తే పార్టీపై దృష్టి పెట్టలేరని.. బీజేపీ మిగతా పనిని పక్కాగా పూర్తి చేయడానికి అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. 

బీజేపీ నేతలకు తీరిక లేని కార్యక్రమాలు అప్పచెబుతున్న హైకమాండ్ ! 

మరో వైపు  తెలంగాణ ప్రజలను ఆకట్టుకునేందుకు పక్కా ప్లాన్‌తో, పకడ్భందీ వ్యూహంతో కార్యాచరణను అమలు చేస్తున్నారు బీజేపీ నేతలు.  తెలంగాణ నేతల పనితీరుపై సమాచారం సేకరిస్తున్నారు.  అధిష్టానం దూతలను రంగంలోకి దింపి సీక్రెట్‌ ఆపరేషన్‌ నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో ఏ మూలన చూసినా బీజేపీ పేరు వినిపించేలా కార్యక్రమాలు రూపొందించి అమలు చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్న వారికి పదవుల్లో ప్రాధాన్యత ఇచ్చే క్రమంలో ఈ ప్రక్రియ జరుగుతున్నట్లు పార్టీ జాతీయ కార్యవర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్న సీనియర్లు చెబుతున్నారు. అధినాయకత్వం ఆదేశాలతో పార్టీ కార్యక్రమాల్లో రాష్ట్ర నాయకత్వం స్పీడ్ పెంచింది. కవిత ఢిల్లీలో ధర్నాకు పోటీగా తెలంగాణ బీజేపీ మహిళా నేతలు కూడా హైదరాబాద్ బీజేపీ ఆఫీసులో ధర్నా చేశారు.  

యూపీ ప్రణాళిక అమలులో ప్రత్యేక శ్రద్ధ

ఉత్తర భారతంలో ఇలాంటి ప్లాన్లనే అమలు చేసి సక్సెస్‌ అయిన బీజేపీ.. దక్షిణాదిన కూడా అదే ఫార్ములా ఉపయోగించి తెలంగాణాలో అధికార పగ్గాలు చేపట్టాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే ప్రజా గోస, బీజేపీ భరోసా కార్యక్రమం ద్వారా విస్తృతంగా ప్రజల ముందుకు వెళ్తోంది. ఇప్పటికే పది రోజులుగా 5వేల సమావేశాలు ఏర్పాటు- చేశారు. బీజేపీ రాష్ట్ర నాయకులు మొత్తంగా ఇదే కార్యక్రమంలో బిజీబిజీగా ఉన్నారు. పార్టీ బలోపేతమే లక్ష్యంగా రాష్ట్ర నాయకత్వానికి బీజేపీ జాతీయ అగ్రనేతలు 15 రోజుల్లో 11వేల సమావేశాలు నిర్వహించాలని టార్గెట్‌ విధించి పనిచేయించారు. తర్వాత నియోజకవర్గ స్థాయి సమావేశాలు.. తర్వత జిల్లా..రాష్ట్ర స్థాయి బహిరంగసభలను నిర్వహించి..  బీజేపీని ప్రజల నోళ్లలో నానేలా చేయడంలో లక్ష్యంగా పెట్టుకున్నారు. 

ఓ వైపు బీఆర్ఎస్ కేసుల ఒత్తిడిలో ఉంటే.. బీజేపీ నేతలు మాత్రం యథేచ్చగా పార్టీ బలోపేతం కోసం ప్రయత్నం చేసే రాజకీయ వాతావరణం ఏర్పడుతుంది. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని హైకమాండ్ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేస్తోంది. 

Published at : 11 Mar 2023 06:31 AM (IST) Tags: BJP Bandi Sanjay Telangana BJP Telangana Politics

సంబంధిత కథనాలు

Nellore Ysrcp : సీఎం జగన్ కి షాకిచ్చిన నలుగురిలో ముగ్గురు నెల్లూరోళ్లే  

Nellore Ysrcp : సీఎం జగన్ కి షాకిచ్చిన నలుగురిలో ముగ్గురు నెల్లూరోళ్లే  

YSRCP Reverse : దెబ్బ మీద దెబ్బ - వ్యూహాత్మక తప్పిదాలే వైఎస్ఆర్‌సీపీకి నష్టం చేస్తున్నాయా ?

YSRCP Reverse :   దెబ్బ మీద దెబ్బ  - వ్యూహాత్మక తప్పిదాలే వైఎస్ఆర్‌సీపీకి నష్టం చేస్తున్నాయా ?

Rahul Gandhi : రాహుల్ గాంధీపై అనర్హతా వేటు ప్రజాస్వామ్యంపై దాడి - తీవ్రంగా ఖండించిన విపక్ష నేతలు !

Rahul Gandhi :  రాహుల్ గాంధీపై అనర్హతా వేటు ప్రజాస్వామ్యంపై దాడి -  తీవ్రంగా ఖండించిన విపక్ష నేతలు !

TSPSC Exams : రాజకీయంలో చిక్కుకుపోతున్న టీఎస్‌పీఎస్సీ - మళ్లీ పరీక్షలు ఎప్పుడు ?

TSPSC Exams :  రాజకీయంలో చిక్కుకుపోతున్న టీఎస్‌పీఎస్సీ - మళ్లీ పరీక్షలు ఎప్పుడు ?

YSRCP Fail : అన్ని జాగ్రత్తలు తీసుకున్నా తప్పెక్కడ జరిగింది ? - ఎమ్మెల్సీ ఫలితంపై వైఎస్ఆర్‌సీపీలో అంతర్మథనం !

YSRCP Fail : అన్ని జాగ్రత్తలు తీసుకున్నా తప్పెక్కడ జరిగింది ? - ఎమ్మెల్సీ ఫలితంపై వైఎస్ఆర్‌సీపీలో అంతర్మథనం !

టాప్ స్టోరీస్

MIW Vs UPW Highlights: యూపీని ఎలిమినేటర్‌లోనే ఆపేసిన ముంబై - 72 పరుగుల విజయంతో ఫైనల్లోకి ఎంట్రీ!

MIW Vs UPW Highlights: యూపీని ఎలిమినేటర్‌లోనే ఆపేసిన ముంబై - 72 పరుగుల విజయంతో ఫైనల్లోకి ఎంట్రీ!

AP Cag Report : 13.99 శాతం వడ్డీకి అప్పులు తెస్తున్న ఏపీ సర్కార్ - కాగ్ రిపోర్టులో సంచలన విషయాలు

AP Cag Report :  13.99 శాతం వడ్డీకి అప్పులు తెస్తున్న ఏపీ సర్కార్ - కాగ్ రిపోర్టులో సంచలన విషయాలు

రైతులపై కేసీఆర్ ది ఎన్నికల ప్రేమ, మీరిచ్చే రూ.10 వేలు ఏ మూలకు సరిపోతాయి - వైఎస్ షర్మిల

రైతులపై కేసీఆర్ ది ఎన్నికల ప్రేమ,  మీరిచ్చే రూ.10 వేలు ఏ మూలకు సరిపోతాయి - వైఎస్ షర్మిల

Jio IPL Plans: రూ.219కే రోజూ 3 జీబీ డేటా - అదనంగా 2 జీబీ కూడా - ఐపీఎల్ ముందు జియో కొత్త ప్లాన్లు!

Jio IPL Plans: రూ.219కే రోజూ 3 జీబీ డేటా - అదనంగా 2 జీబీ కూడా - ఐపీఎల్ ముందు జియో కొత్త ప్లాన్లు!