By: ABP Desam | Updated at : 16 Sep 2023 09:40 AM (IST)
కేసీఆర్‌ది మోసపూరిత రాజకీయం- 33% రిజర్వేషన్ డిమాండ్ లేఖపై బీజేపీ ఆగ్రహం
మహిళా రిజర్వేషన్ బిల్లుపై ప్రధానమంత్రి మోదీకి తెలంగాణ సీఎం కేసీఆర్ రాసిన లేఖపై తెలంగాణ బీజేపీ కౌంటర్ ఇచ్చింది. ఫామ్‌హౌస్ ప్లానింగ్, ఫామ్‌హౌస్ రియాల్టీ అంటూ లెక్కలతో వివరించేప్రయత్నం చేసింది. అసెంబ్లీ, పార్లమెంట్ సభ్యుల్లో 33 శాతం మహిళలు ఉండాలని ఫామ్‌హౌస్ ప్లానింగ్‌లో ఉందని కానీ రియాల్టీలో అది చాలా దూరంగా ఉందంటూ ఎద్దేవా చేస్తూ ట్వీట్ చేసింది.
వంద మంది బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఉంటే అందులో మహిళా ఎమ్మెల్యేలు 5 శాతం మందేనని... అంటే ఇక్కడ ఐదు శాతమే ఉన్నారని బీజేపీ విమర్సించింది. బీఆర్‌ఎస్ ఎంపీలు 16 మంది ఉంటే అందులో ఒక్కరంటే ఒక్కరే మహిలా ఎంపీ ఉన్నారని అంటే ఇక్కడ 6.25 శాతమేనంటూ గుర్తు చేశారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు కలుపుకున్నా 33 శాతం కావడం లేదని వ్యంగ్యంగా స్పందించింది బీజేపీ. అందుకే కేసీఆర్‌ది మోసపూరిత రాజకీయం అంటూ విమర్శలు చేసింది.
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఎంపీలతో చర్చించిన సీఎం కేసీఆర్ బీసీ, మహిళా రిజర్వేషన్ల అంశంపై గట్టిగా పట్టుపట్టాలని నిర్ణయించారు. ఈ భేటీ అనంతరం ప్రధానమంత్రి మోదీకి కేసీఆర్ లేఖ రాశారు. బీసీ రిజర్వేషన్ల బిల్లును.. మహిళా రిజర్వేషన్ల బిల్లును ఆమోదించాలని కోరారు. చట్ట సభల్లో 33 శాతం బీసీ రిజర్వేషన్ కల్పించాలని, మహిళలకు 33శాతం రిజర్వేషన్ ఇవ్వాలని ప్రధానికి రాసిన లేఖలో కేసీఆర్ పేర్కొన్నారు. 18 నుంచి జరిగే ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో 2 బిల్లులు ప్రవేశపెట్టి ఆమోదించాలని కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. బీసీ అభ్యున్నతి, మహిళా సంక్షేమానికి బీఆర్ఎస్ కట్టుబడి ఉందని, వారి హక్కుల రక్షణకు బీఆర్ఎస్ తన గళాన్ని వినిపిస్తూనే ఉంటుందని కేసీఆర్ అన్నారు.
𝗙𝗮𝗿𝗺𝗵𝗼𝘂𝘀𝗲 𝗽𝗹𝗮𝗻𝗻𝗶𝗻𝗴:
Percentage of women MLAs & MPs KCR wants in Assemblies & Parliament = 33%
𝗙𝗮𝗿𝗺𝗵𝗼𝘂𝘀𝗲 𝗿𝗲𝗮𝗹𝗶𝘁𝘆:
> Total No. Of sitting BRS MLAs = 100
Total No. Of Sitting Women BRS MLAs = 5
Percentage of sitting Women BRS MLAs = 5%
>… pic.twitter.com/D9zqwveLDa— BJP Telangana (@BJP4Telangana) September 16, 2023
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై బీఆర్‌ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. కేంద్రం నుంచి రాష్ర్టానికి రావాల్సిన బకాయిలు, విభజన చట్టంలో ఇచ్చిన హామీలు, కేంద్రం తెచ్చే బిల్లులు తదితర అంశాలపై పార్టీ వైఖరి, అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తున్నారు. పార్టీ పార్లమెంటరీ నేత కే కేశవరావు, లోక్‌సభా పక్షనేత నామా నాగేశ్వర్‌రావు సహా ఎంపీలందరూ ఈ సమావేశంలో పాల్గొన్నారు.
దేశం పేరును ఇండియాగా కాకుండా భారత్‌గా మారుస్తామంటూ జీ-20 సమావేశాల సందర్భంగా చెప్పకనే మోదీ ప్రభుత్వం చెప్పింది. ఇది పార్లమెంటులో చర్చకు వస్తే ఏం చేయాలి..? అన్నది బీఆర్‌ఎస్‌కు సమస్యగా ఉన్నది. దీనిపై ఇప్పటికే అన్ని పార్టీలూ తమ తమ వైఖరులను స్పష్టం చేశాయి. కేంద్ర వైఖరికి అనుకూలంగానో, వ్యతిరేకంగానో తమ తమ అభిప్రాయాలను వెల్లడించాయి. కానీ బీఆర్‌ఎస్ మాత్రం ఇప్పటికీ తన వైఖరిని స్పష్టం చేయలేదు.
ప్రజల్లోకి నారా భువనేశ్వరి- త్వరలోనే బస్సు యాత్ర!
బండారు సత్యనారాయణ మూర్తి ఇంటి చుట్టూ పోలీసులు - అనకాపల్లిలో ఉద్రిక్తత
BRS News: కేంద్రానికి చిత్తశుద్ధి ఉంటే పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టుకి జాతీయ హోదా ఇవ్వాలి: బీఆర్ఎస్ ఎంపీ
Kadiam Srihari: స్టేషన్ ఘనపూర్ టికెట్ తనకేనని ముందే తెలుసు!- కడియం శ్రీహరి ఆసక్తికర వ్యాఖ్యలు
KTR Counter PM Modi: నమో అంటే నమ్మించి మోసం చేయడం! అదానీ చేతిలో బీజేపీ స్టీరింగ్- ప్రధాని వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్
Bigg Boss Season 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7 నుండి రతిక ఎలిమినేట్ - అసలు పట్టించుకోని శివాజీ
Jyoti Yarraji: ఏషియన్ గేమ్స్‌లో తెలుగమ్మాయి సత్తా - 100 మీటర్ల హర్డిల్స్‌లో రజతం సాధించిన జ్యోతి!
Top 10 Scooters in India: కొత్త స్కూటీ కొనాలనుకుంటున్నారా? - అయితే ఈ టాప్-10 స్కూటీలపై ఓ లుక్కేయండి!
Bigg Boss Season 7 Telugu: తేజను గుడ్డి గొర్రె అన్న కంటెస్టెంట్స్, 'నా రక్తం తాగుతాడు' అంటూ అమర్‌దీప్‌పై శోభా వ్యాఖ్యలు
/body>