News
News
X

Bandi Sanjay : పెద్దలకు చెప్పులు అందించడం భారతీయత - టీఆర్ఎస్ విమర్శలకు బండి సంజయ్ ఘాటు కౌంటర్ !

పెద్దలకు చెప్పులు అందించడం తప్పెలా అవుతుందని టీఆర్ఎస్ నేతల్ని బండి సంజయ్ ప్రశ్నించారు. కుసంస్కారంతో విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.

FOLLOW US: 

Bandi Sanjay :  ఉజ్జయిని మహంకాళీ అలయం ఎదుట అమిత్ షాకు బండి సంజయ్ చెప్పులు అందించిన వీడియో వైరల్ అయింది. ఈ అంశంపై టీఆర్ఎస్ నేతలు బండి సంజయ్ పై విరుచుకుపడుతున్నారు. గులామ్ గిరీ చేస్తున్నారని.. గుజరాత్ నేతల కాళ్ల దగ్గర తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారని విమర్శలు గుప్పిస్తున్నారు.దీనిపై బండి సంజయ్ స్పందించారు. కుటుంబంలో పెద్దలకు చెప్పులు అందించడం భారతీయతను పాటించే మాకు అలవాటు. మా కుటుంబ పెద్ద,గురుతుల్యుడు కేంద్ర హోంమంత్రివర్యులకు వయస్సులో చిన్నవాడినైన నేను చెప్పులందించడం గులామ్ గిరి ఎలా అవుతుందని టీఆర్ఎస్ నేతల్ని బండి సంజయ్ ప్రశ్నించారు. 

ఢిల్లీ లిక్కర్ మాఫియాలో పడి కొట్టుకుంటున్న కుటుంబసభ్యుల రహస్యాలు బయట పడకుండా తంటాలు పడుతూ చేస్తున్న డైవర్షన్ పాలిటిక్స్ తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని బండి సంజయ్ విరుచుకుపడ్డారు. ప్రొఫెసర్ జయశంకర్ సారును, కొండా లక్ష్మణ్ బాపూజీని ఘోరంగా అవమానించిన మీకు, గౌరవాల విలువ ఏమీ తెలుస్తుంది. మమ్మల్ని 'గులామ్' లని వెక్కిరించే మీ కుసంస్కారం చూసి జనం నవ్వుకుంటున్నారని ఎద్దేవాచేశారు. 

అధికారం కోసం లోపటింట్లో రోజూ తన్నుకుంటున్న మీ కుటుంబసభ్యులకు,పెద్దలకు చెప్పులు అందించడంలోని సంస్కారం ఏం అర్థం అవుతుందని బండి సంజయ్ ప్రశ్నించారు.  రామ - భరతుల వారసత్వాన్ని మేం తలకెత్తుకున్నామని.. తండ్రిని బంధించి,అన్నను చంపి అధికారం పొందిన ఔరంగజేబు వారసుల పక్కన తిరిగే మీకు,మా సంస్కృతి ఏం అర్థమవుతుందని విమర్శించారు. మేం పాద రక్షలు మాత్రమే గౌరవంతో అందిస్తాం..మీలా అవసరం తీరాక పాదాలుపట్టి లాగేసే అలవాటు లేదని బండి సంజయ్ స్పష్టం చేశారు. 

బండి సంజయ్ ..  అమిత్ షాకు చెప్పులు అందిస్తున్న వీడియోను టీఆర్ఎస్ సోషల్ మీడియా విపరీతంగా సర్క్యూలేట్ చేస్తోంది. తెలంగాణ ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టారని విమర్శిస్తోంది. ఈ క్రమంలో బీజేపీ నేతలు కౌంటర్ ఇవ్వడానికి ఇబ్బంది పడుతున్నారు. టీఆర్ఎస్ నేతల దాడి పెరిగపోవడంతో నేరుగా బండి సంజయ్ స్పందించారు. పెద్దలకు చెప్పులు అందించడం తప్పెలా అవుతుందని వాదిస్తున్నారు. ఈ  విషయంలో టీఆర్ఎస్ కౌంటర్ ఉంటుందో మరి !

Published at : 22 Aug 2022 04:12 PM (IST) Tags: Amit Shah Bandi Sanjay Bandi Shoes Bandi Vs TRS

సంబంధిత కథనాలు

Nizamabad News : హైదరాబాద్, ఢిల్లీకే పరిమితమవుతున్న మధుయాష్కీ, నిజామాబాద్ వైపు కన్నెత్తి చూడటం లేదా?

Nizamabad News : హైదరాబాద్, ఢిల్లీకే పరిమితమవుతున్న మధుయాష్కీ, నిజామాబాద్ వైపు కన్నెత్తి చూడటం లేదా?

Munugode Bypolls Bjp : మండలానికి ముగ్గురు ఇంచార్జులు - మునుగోడును ముట్టడిస్తున్న బీజేపీ !

Munugode Bypolls Bjp : మండలానికి ముగ్గురు ఇంచార్జులు - మునుగోడును ముట్టడిస్తున్న బీజేపీ !

YSRCP Politics : వైఎస్ఆర్‌సీపీలో పర్యవేక్షకుల పంచాయతీ ! అన్ని నియోజకవర్గాలకా ? కొన్నింటికేనా ?

YSRCP Politics :  వైఎస్ఆర్‌సీపీలో పర్యవేక్షకుల పంచాయతీ ! అన్ని నియోజకవర్గాలకా ? కొన్నింటికేనా ?

AP BJP On YSRCP: కుప్పం సభ ఖర్చు వైఎస్ఆర్‌సీపీ చెల్లించాలి - షర్మిల వ్యాఖ్యలకు జగన్ సమాధానం చెప్పాలన్న ఏపీ బీజేపీ !

AP BJP On YSRCP:  కుప్పం సభ ఖర్చు వైఎస్ఆర్‌సీపీ చెల్లించాలి - షర్మిల వ్యాఖ్యలకు జగన్ సమాధానం చెప్పాలన్న ఏపీ బీజేపీ !

Notice To APCID : నాలుగంటే నాలుగు రోజులే చాన్స్ - ఏపీసీఐడీకి కోర్టు ఇచ్చిన షోకాజుల్లో ఏముందుంటే ?

Notice To APCID :  నాలుగంటే నాలుగు రోజులే చాన్స్  - ఏపీసీఐడీకి కోర్టు ఇచ్చిన షోకాజుల్లో ఏముందుంటే ?

టాప్ స్టోరీస్

Hyderabad News : వంద శాతం మురుగునీటి శుద్ధి నగరంగా హైదరాబాద్- మంత్రి కేటీఆర్

Hyderabad News : వంద శాతం మురుగునీటి శుద్ధి నగరంగా హైదరాబాద్- మంత్రి కేటీఆర్

Vijayawada Traffic Diversion : రేపటి నుంచి విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు, వాహనాల మళ్లింపు ఇలా!

Vijayawada Traffic Diversion : రేపటి నుంచి విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు, వాహనాల మళ్లింపు ఇలా!

For one last time! జులన్‌ను హత్తుకొని ఏడ్చేసిన హర్మన్‌ - లార్డ్స్‌లో ఆంగ్లేయుల గ్రేట్ రెస్పెక్ట్‌!

For one last time! జులన్‌ను హత్తుకొని ఏడ్చేసిన హర్మన్‌ - లార్డ్స్‌లో ఆంగ్లేయుల గ్రేట్ రెస్పెక్ట్‌!

Bigg Boss 6 Telugu: ఈ వారం ఎలిమినేషన్ - నేహా చౌదరి అవుట్?

Bigg Boss 6 Telugu: ఈ వారం ఎలిమినేషన్ - నేహా చౌదరి అవుట్?