అన్వేషించండి

Bandi Sanjay : అవినీతి కేసుల్లో అరెస్ట్ చేస్తారనే భయంతోనే జాతీయ రాజకీయాల పర్యటనలు - కేసీఆర్‌పై బండి సంజయ్ విమర్శలు

కేసీఆర్‌పై బండి సంజయ్ విమర్శలు గుప్పించారు. త్వరలో అరెస్ట్ ఖాయమని జోస్యం చెప్పారు. ఈ విషయం తెలిసే ముందే లొల్లి చేస్తున్నారని మండిపడ్డారు.


తెలంగాణ సీఎం కేసీఆర్ మాటలే తప్ప చేతల్లో చూపించని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. సంగారెడ్డి జిల్లాలో కేసీఆర్ పెద్ద ఎత్తున అభివృద్ధి పనులకు నిధులు ప్రకటించడంపై విమర్శలు గుప్పించారు. ఏ సభకు వెళ్లినా కోట్లు కోట్లు ఇస్తున్నట్లు ప్రకటించడమే కానీ తరవాత ఇచ్చేది లేదన్నారు. హుజూర్ నగర్, సాగర్, దుబ్బాక, హుజూరాబాద్ సహా జీహెచ్ఎంసీ ఎన్నికలప్పుడు అలాగే చెప్పారు కానీ పైసా ఇవ్వలేదన్నారు. కేంద్ర పథకాల నిధులను కూడా మళ్లించుకుంటూ సిగ్గు లేకుండా అబద్దాలు ఆడుతున్నారని మండిపడ్డారు. గ్రామ పంచాయతీలకు ఎన్ని నిధులు ఇచ్చిందో చెప్పాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.గత 8 ఏళ్లుగా గ్రామ పంచాయతీలకు కేంద్రం నుండి వచ్చే నిధులు తప్ప కేసీఆర్ ఇచ్చిందేమీ లేదన్నారు. స్థానిక సంస్థలన్నింటినీ కేసీఆర్ నిర్వీర్యం చేస్తున్నారని విమర్శించారు. 

దేశంలోనే నెంబర్ వన్ అవినీతి పరుడు కేసీఆర్ అని  కేసీఆర్ కుటుంబ ఆస్తులు చూస్తే ఎవరికైనా అర్థమవుతుందని బండి సంజయ్ విశ్లేషించారు.  ఇప్పుడు " కేసీఆర్ కు ఓ ఫాం  హౌజ్, బిడ్డకు ఓ ఫాంహౌజ్, అల్లుడుకు ఓ  ఫాంహౌజ్ లున్నయ్... ఇగ కొడుకుకైతే రెండు మూడు ఫాంహౌజ్ లు, ఫైవ్ స్టార్, సెవెన్ స్టార్ హోటళ్లున్నయట.  దుబాయ్ లో, సింగపూర్ లో, అమెరికా, లండన్ కు పోయి దోచుకున్నదంతా దాచుకుంటున్నరట.." అని విమర్శించారు.  కేసీఆర్ కుటుంబం అక్రమాలపై త్వరలో దర్యాప్తు జరుగుతుందని అది తెలిసే ఏం మాట్లాడుతున్నారో తెలియక ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. ఎలాగూ అరెస్ట్ అవుతారని తెలిసి ముందే లొల్లి చేస్తే ఓ పనైపోతదని తెలిసి పర్యటనలకు వెళ్తున్నారని విమర్శించారు. 

గతంలో చంద్రబాబు ఇంతే చేశారని.. చంద్రబాబుకు పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు.  మహారాష్ట్ర, కర్నాటక, తమిళనాడు, బెంగాల్ ఫ్రజలందరికీ కేసీఆర్‌ను నమ్మవద్దని బండి సంజయ్ విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ఉద్యమంలో 1400 మంది చనిపోతే అందులో సగం మందిని కూడా గుర్తించి సాయం చేయలేదని విమర్శించారు. బంగారు తెలంగాణ సాధించేమని చెప్పుకుంటున్నారని ఆత్మహత్యల తెలంగాణ ... దోపిడీ దొంగల తెలంగాణ అయ్యింద్నారు.   కులాల మధ్య, ప్రాంతాల, మతాల మద్య చిచ్చు పెట్టడమే కేసీఆర్ పని. ఏదీ దొరకకపోతే ఉత్తర, దక్షిణ భారత దేశాలుగా విభజించి మాట్లాడతారని మండిపడ్డారు.  తుక్డే గ్యాంగ్ ప్రకాష్ రాజ్ తో కలిసిన కేసీఆర్‌లో హిందూ వ్యతిరేక భావ జాలం ఎంత ఉందో అర్థం చేసుకోవాలన్న ారు. బీజేపీ హిందువుల పార్టీ అని, మోదీ, యోగి లేకపోతే హిందువులను కాపాడేవాళ్ళెవరు లేరని జీహాదీలు అంటున్నారు.. హిందువులంతా ఒక్కసారి ఆలోచించాలన్నారు.మోదీ, యోగి లేని దేశం ఎట్లుంటది? మన పరిస్థితి ఎట్లుంటదో హిందువులంతా, తెలంగాణ సమాజమంతా ఆలోచించాలని కోరారు. 

తెలంగాణలో సాధించిందేమీ లేదు దేశ రాజకీయాల్లోకి వెళ్లి చేసేదేముందని బండి సంజయ్ ప్రశ్నించారు.  కేసీఆర్ కు మేడారం అభివృద్ధి కి చేసిందేమీ లేదు. మొఖం చెల్లాకే మేడారం వెళ్ళలేదు. చివరకు గవర్నర్ వెళ్తే కూడా అధికారులు, మంత్రులెవరూ ఆమెను కలవొద్దని అనధికార ఆదేశాలిచ్చిన సంస్కారం లేని వ్యక్తి కేసీఆర్ అని మండిపడ్డారు.  తెలంగాణాకు అన్యాయం జరిగితే 7 ఏండ్లుగా ఎందుకు అడగలేదు? ప్రధానిని కలిసినప్పుడు ఎందుకు అడగలేదుని బండి సంజయ్ ప్రశ్నించారు.    తెలంగాణలో బీజేపీ చేస్తున్న ఉద్యమాలకు భయపడి కేసీఆర్ ఇఫ్పుడు ఫాంహౌజ్ నుండి బయటకొస్తున్నారన్నారు. 

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Jagan : చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి పోతాం - నంద్యాల సభలో ఏపీ ప్రజలకు జగన్ విజ్ఞప్తి !
చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి పోతాం - నంద్యాల సభలో ఏపీ ప్రజలకు జగన్ విజ్ఞప్తి !
BRS Mews : సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
Chandrababu :  జగన్‌కు చంద్రబాబు 7 సూటి ప్రశ్నలు - సమాధానం చెప్పాలని రాప్తాడు ప్రజాగళం సభలో సవాల్
జగన్‌కు చంద్రబాబు 7 సూటి ప్రశ్నలు - సమాధానం చెప్పాలని రాప్తాడు ప్రజాగళం సభలో సవాల్
YouTube Videos Delete: ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

YS Jagan vs Sunitha | YS Viveka Case: ప్రొద్దుటూరు సభలో జగన్ కామెంట్స్ కు వివేకా కుమార్తె కౌంటర్Karimnagar Young Voters Opinion Poll Elections: కరీంనగర్ యువ ఓటర్లు ఏమంటున్నారు? వారి ఓటు ఎవరికి..?YSRCP Varaprasad | Pathapatnam: వైసీపీ ఎమ్మెల్యే రెడ్డి శాంతిపై రెబెల్ తులసీ వరప్రసాద్ ఫైర్Adilabad Aatram Suguna Face To Face: ఆదిలాబాద్ లో కాంగ్రెస్ గెలుపు ఖాయమంటున్న ఆత్రం సుగుణ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Jagan : చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి పోతాం - నంద్యాల సభలో ఏపీ ప్రజలకు జగన్ విజ్ఞప్తి !
చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి పోతాం - నంద్యాల సభలో ఏపీ ప్రజలకు జగన్ విజ్ఞప్తి !
BRS Mews : సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
Chandrababu :  జగన్‌కు చంద్రబాబు 7 సూటి ప్రశ్నలు - సమాధానం చెప్పాలని రాప్తాడు ప్రజాగళం సభలో సవాల్
జగన్‌కు చంద్రబాబు 7 సూటి ప్రశ్నలు - సమాధానం చెప్పాలని రాప్తాడు ప్రజాగళం సభలో సవాల్
YouTube Videos Delete: ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
BJP Chengicherla politics : తెలంగాణలో మళ్లీ పాత ఫామ్‌లోకి వస్తున్న బీజేపీ - చెంగిచెర్ల ఘటనపై దూకుడు రాజకీయం !
తెలంగాణలో మళ్లీ పాత ఫామ్‌లోకి వస్తున్న బీజేపీ - చెంగిచెర్ల ఘటనపై దూకుడు రాజకీయం !
Ap Elections: ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులు - కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులు - కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
TSGENCO Exams: జెన్‌కోలో ఏఈ, కెమిస్ట్‌ నియామక పరీక్షలు వాయిదా - కొత్త షెడ్యూలు ఎప్పుడంటే?
జెన్‌కోలో ఏఈ, కెమిస్ట్‌ నియామక పరీక్షలు వాయిదా - కొత్త షెడ్యూలు ఎప్పుడంటే?
CJI: సీజేఐకు 600 మంది లాయర్ల లేఖ - కారణం ఏంటంటే.?
సీజేఐకు 600 మంది లాయర్ల లేఖ - కారణం ఏంటంటే.?
Embed widget