అన్వేషించండి

Balakrishna : హిందూపురం జిల్లా కోసం రంగంలోకి బాలకృష్ణ.. శుక్రవారం మౌనదీక్ష !

హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఉద్యమంలోకి దిగాలని బాలకృష్ణ నిర్ణయించుకున్నారు. శుక్రవారం మౌనదీక్ష చేయనున్నారు.

తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, సినీ హీరో బాలకృష్ణ హిందూపురం జిల్లా సాధన కోసం ఉద్యమాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. ప్రత్యక్షంగా తానే ఉద్యమానికి నాయకత్వం వహించాలని నిర్ణయించారు.  ప్రజాస్వామ్య పద్దతుల్లో ఆందోళనలు చేయాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే హిందూపురం చేరుకున్న ఆయన శుక్రవారం మౌనదీక్ష చేయనున్నారు. ముందుగా హిందూపురంలోని పొట్టి శ్రీరాములు విగ్రహం నుంచి అంబేడ్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించనున్నారు. ర్యాలీ అనంతరం అంబేడ్కర్‌ విగ్రహం వద్ద బాలకృష్ణ మౌనదీక్ష చేయనున్నారు. 

పీఆర్సీ ప్రకటించినప్పుడు చప్పట్లు .. ఇప్పుడు తాడోపేడో ఉద్యమం ! ఈ మధ్యలో ఏం జరిగింది ?

మౌనదీక్ష పూర్తయిన తర్వాత అఖిలపక్షాల నేతలతో ఉద్యమ కార్యాచరణపై చర్చించనున్నారు. ఇప్పటికే హిందూపురంలో జిల్లా సాధన ఉద్యమం ఉద్ధృతంగా సాగుతోంది. చిరకాలంగా హిందూపురం జిల్లా డిమాండ్ ఉంది. వైసీపీ మేనిఫెస్టో ప్రకారం.. పార్లమెంటరీ నియోజకవర్గాలను జిల్లా కేంద్రం చేయాల్సి ఉంది. కానీ హిందూపురాన్ని మాత్రం జిల్లా కేంద్రం చేయకుండా పుట్టపర్తిని జిల్లా కేంద్రంగా ప్రకటించారు. దీంతో నందమూరి  బాలకృష్ణ అసంతృప్తికి గురయ్యారు.  మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన విధంగా ప్రతీ పార్లమెంట్ నియోజకవర్గం కేంద్రంగా  జిల్లాలు ఏర్పాటు చేయాల‌ని డిమాండ్ చేస్తున్నారు.

తగ్గేదే లే.. 5 నుంచి పెన్ డౌన్.. 7 నుంచి సమ్మె .. ప్రభుత్వానికి పీఆర్సీ సాధన సమితి అల్టిమేటం !
 
కొత్త జిల్లాలు ఏర్పాటు చేయడాన్ని  టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఎప్పటి నుండో సమర్థిస్తున్నారు. హిందూపురం నియోజకవర్గం కేంద్రాన్ని జిల్లా చేయాలని ఎప్పట్నుంచో డిమాండ్ ఉంది. పార్లమెంట్ నియోజకవర్గ కేంద్రం కూడా . దీంతో ప్రభుత్వం ఎప్పుడు కొత్త జిల్లాలు ప్రకటించినా హిందూపురం జిల్లా అవుతుందని అనుకున్నారు. కానీ అలా జరగలేదు. జిల్లాల విభజన అనేది మంచిపని అని అయితే రాజకీయం చేయడం మంచిది కాదని తక్షణం హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని బాలకృష్ణ కోరుతున్నారు. 

ఆంధ్ర ఉద్యోగుల్లో ఇంత ఆవేశం ఎందుకు ? జీతాలు పెరుగుతున్నాయన్న ప్రభుత్వ వాదన అబద్దమేనా ?

జిల్లా కేంద్రానికి అవసరమైన అన్ని రకాల మౌలిక సదుపాయాలు హిందూపురంలో ఉన్నాయని ..  ప్రభుత్వ కార్యాల‌యాల ఏర్పాటుకు అవ‌స‌ర‌మైన భూమి పుష్కలంగా ఉంద‌ని బాలకృష్ణ చెబుతున్నారు.అందుకే  జిల్లాల‌ ఏర్పాటులో రాజ‌కీయం చేయవద్ద ..హిందూపురం ప్రజ‌ల మ‌నోభావాల‌ను గౌర‌వించి వారి చిరికాల కోరికైన హిందూపురం జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాల‌ని  బాలకృష్ణ కోరుతున్నారు.  ఉద్యమం పై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. 

టాప్ హెడ్ లైన్స్

ECI Special Summary Revision: తెలుగు రాష్ట్రాల్లో కోటికిపైగా ఓట్ల గల్లంతు - రాజకీయ పార్టీలు ఎందుకు సీరియస్‌గా తీసుకోవడం లేదు?
తెలుగు రాష్ట్రాల్లో కోటికిపైగా ఓట్ల గల్లంతు - రాజకీయ పార్టీలు ఎందుకు సీరియస్‌గా తీసుకోవడం లేదు?
Telangana Political War: డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
BJP All Cells Joint Coordinator: విద్యార్థి నాయకుడి నుంచి జాతీయ పదవి దాకా.. బీజేపీ ఆల్ సెల్స్ జాయింట్ కో-ఆర్డినేటర్‌గా ఎస్. విష్ణువర్ధన్ రెడ్డి నియామకం !
విద్యార్థి నాయకుడి నుంచి జాతీయ పదవి దాకా.. బీజేపీ ఆల్ సెల్స్ జాయింట్ కో-ఆర్డినేటర్‌గా ఎస్. విష్ణువర్ధన్ రెడ్డి నియామకం !
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
Telangana Political War: డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
Shiva Srishti Vyakaranam: మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
చాణక్య నీతి: వైవాహిక జీవితంలో ఈ 5 తప్పులు ఇంటి శాంతి, సంతోషం, ఐశ్వర్యాన్ని దూరం చేస్తాయి!
చాణక్య నీతి: వైవాహిక జీవితంలో ఈ 5 తప్పులు ఇంటి శాంతి, సంతోషం, ఐశ్వర్యాన్ని దూరం చేస్తాయి!
Maruti Fronx చౌకైన మోడల్ రూ.1 లక్ష చెల్లించాక నెలవారీ EMI ఎంత కట్టాలి
Maruti Fronx చౌకైన మోడల్ రూ.1 లక్ష చెల్లించాక నెలవారీ EMI ఎంత కట్టాలి
Hyderabad Traffic Diversion: నేటి నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ వన్-వే అమలు.. 7 ఫ్లైఓవర్లు, 7 అండర్‌పాస్‌లతో ట్రాఫిక్ సమస్యకు చెక్
నేటి నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ వన్-వే అమలు.. 7 ఫ్లైఓవర్లు, 7 అండర్‌పాస్‌లతో ట్రాఫిక్ సమస్యకు చెక్
Kondagattu Accident: కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
Embed widget