By: ABP Desam | Updated at : 03 Feb 2022 04:18 PM (IST)
5 నుంచి పెన్ డౌన్.. 7 నుంచి సమ్మె .. ప్రభుత్వానికి పీఆర్సీ సాధన సమితి అల్టిమేటం !
ఉవ్వెత్తున ఎగసిన ఉద్యోగుల ఉద్యమాన్ని చూసైనా ప్రభుత్వం తీరు మార్చుకోవాలని పీఆర్సీ సాధన సమితి నేతలు హితవు పలికారు. కొత్త పీఆర్సీ అమలుతో జీతాలు పెరిగాయంటూ.. మోసపూరిత మాటల్ని ప్రభుత్వం మానుకోవాలన్నారు. చర్చలతో డిమాండ్ల సాధనకు తాము ఇప్పటికీ కట్టుబడి ఉన్నామని.. ముఖ్యమంత్రి స్వయంగా జోక్యం చేసుకుని ఆ దిశగా అడుగులు వేయాలని డిమాండ్ చేశారు. " చలో విజయవాడ" కార్యక్రమం విజయవంతమైందని ఇది బలప్రదర్శన కాదు.. ఉద్యోగుల వేదనేనన్నారు.
ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా.. చలో విజయవాడ విజయవంతమైందన్నారు. 'ప్రభుత్వంతో మేం ఘర్షణ వైఖరి కోరుకోవట్లేదు. గడిచిన కొన్నాళ్లుగా మీ చుట్టూ తిరుగుతూనే ఉన్నాం అని కమిటీలతో మేము ఇక చర్చించే ప్రశ్నే లేదు అని సీఎంతో చర్చించే అవకాశం కల్పించకుండా అధికారులు మాయ చేశారనివిమర్శించారు. ఈనెల 5 నుంచి పూర్తిగా సహాయ నిరాకరణ.. 6వ తేదీ అర్ధరాత్రి నుంచి సమ్మెలోకి వెళ్తున్నామని ప్రకటించారు. సమ్మెతో ప్రజలకు అసౌకర్యం కలిగితే ప్రభుత్వానిదే బాధ్యత అని హెచ్చరించారు. ఇలాంటి పీఆర్సీ ప్రకటించడం ఒక చరిత్ర. ఉద్యోగుల ఉద్యమం కూడా ఒక చరిత్రే. ప్రభుత్వం చెబుతుందీ అన్నీ దొంగలెక్కలే. డిమాండ్లు నెరవేర్చేవరకు ఉద్యమం ఆగదు. ప్రభుత్వానికి ఇప్పటికైనా కనువిప్పు కలగాలన్నారు.
ఉద్యోగ సంఘాలుగా చర్చలకు వెళ్లకుంటే పరిపక్వత లేదని అన్నారని పీఆర్సీ సాధన సమితి ప్రతినిధి బొప్పరాజు మండిపడ్డారు. ఉద్యోగ సంఘాల వెనుక ఎవరో ఉన్నారని వైఎస్ఆర్‌సీపీ నేతలంటున్నారని.. తమ వెనుక లక్షలాదిగా ఉద్యోగులున్నారని స్పష్టం చేశారు. అర్థరాత్రి 12 గంటల వరకు సెక్రటేరీయేట్‌లో వెయిట్ చేయించి అవమానించారని బొప్పరాజు ఆవేదన వ్యక్తం చశారు. ఉద్యోగుల ఉద్యమం అంటే ఏంటో ఈ ప్రభుత్వానికి తెలిసి వచ్చేలా చేస్తామన్నారు.
ప్రభుత్వం ఎంత చెప్పినా వినకుండా కొత్త జీతాలు వేసిందని.. ఉద్యోగులకు స్లిప్పులు కూడా అర్థం కావా.. అని పీఆర్సీ సాధన సమితి నేత వెంకట్రామిరెడ్డి ప్రశ్నించారు. ఉద్యోగ సంఘ నేతలుగా తాము చేసిన పొరపాటు గుర్తించామని.. ప్రసంగాలు ఇవ్వడానికి రాలేదు.. ఉద్యోగుల ఆవేదనను తెలియచెప్పేందుకే వచ్చామన్నారు. ద్యోగులుగా మనం తగ్గేదేలేదని స్పష్టం చేశారు. తీవ్ర నిర్బంధాల మధ్య కూడా లక్ష మంది విజయవాడ వచ్చారని వెల్లడించారు. మరో 3 లక్షల మందిని ప్రభుత్వం అడ్డుకుందని ఆరోపించారు. ప్రభుత్వాధినేతగా ముఖ్యమంత్రి జగన్ ఉద్యోగులను చర్చలకు పిలవాలని మరో ఉద్యోగ నేత బండి శ్రీనివాసరావు డిమాండ ్చేశారు. ఉద్యోగుల సమస్యలపై సీఎం జగన్ నేరుగా చర్చించి న్యాయం చేయాలన్నారు.
Chandrababu New Style : 40 శాతం సీనియర్ల సీట్లకు గండి - చంద్రబాబు కొత్త ఫార్ములా !
Subrahmanyam Death Case: ఎమ్మెల్సీ డ్రైవర్ మృతి కేసులో ఎఫ్ఐఆర్ నమోదు: ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి వెల్లడి
Panakala Swamy Temple :ప్రసాదం తాగే స్వామి, కష్టాలు తీరేందుకు అమృతాన్నిచ్చే దైవం
Hindupur YSRCP : హిందూపురం వైఎస్ఆర్‌సీపీ నేతల తిరుగుబాటు - ఆయనొస్తే ఎవరూ వెళ్లరట !
Buggana On Jagan London Tour : జగన్ లండన్ వెళ్లింది నిజమే కానీ అసలు కారణం వేరే - బుగ్గన వివరణ !
MLC Kavitha Comments : జైశ్రీరాం నినాదాలకు కౌంటర్ గా జైహనుమాన్ - టీఆర్ఎస్ కార్యకర్తలకు ఎమ్మెల్సీ కవిత పిలుపు !
IPL 2022 TV Ratings: ఐపీఎల్ టీవీ రేటింగ్స్ ఢమాల్! పరిహారం డిమాండ్ చేస్తున్న అడ్వర్టైజర్లు
Telangana TET Exam : తెలంగాణ టెట్ వాయిదాపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు
US Formula Milk Shortage : అమెరికాలో ఫార్ములా మిల్క్ కొరత - ఎక్కడ చూసినా నో స్టాక్ !