News
News
X

Chiru BJP : చిరంజీవికి నచ్చిన లీడర్ వాజ్‌పేయి - బీజేపీకి సంకేతాలు పంపినట్లేనా ?

చిరంజీవి వ్యాఖ్యలు బీజేపీకి అనుకూలంగా ఉంటున్నాయా ? మెగాస్టార్ కమలం వైపు మొగ్గుచూపుతున్నారా ?

FOLLOW US: 
 
Chiru BJP :  రాజకీయాలకు దాను దూరమయ్యాను కానీ రాజకీయాలు తనకు దూరం కాలేదని చిరంజీవి గంభీరమైన డైలాగులు చెప్పారు. కానీ ఇప్పుడు ఆయన  కూడా రాజకీయానికి దగ్గరవుతున్నారన్న అభిప్రాయం తరచూ వినిపిస్తోంది. దీనికి కారణం చిరంజీవి చేస్తున్న వ్యాఖ్యలే. తాజాగా ఆయన పూరి జగన్నాథ్‌తో మాట్లాడిన వీడియోలో... రాజకీయాల ప్రస్తావన వచ్చింది. తన నచ్చిన నేతలు లాల్ బహదూర్ శాస్త్రితో పాటు అటర్ బిహారీ వాజ్‌పేయి పర్లను చెప్పారు. లాల్ బహదూర్ శాస్త్రి రెండు తరాల కిందటి నేత. కానీ వాజ్ పేయి మాత్రం ఇప్పుడు యాక్టివ్‌గా రాజకీయాల్లో ఉన్న వారికి బాగా కనెక్ట్ అయిన నేతే. అందుకే శాస్త్రి గారి గురించి చిరంజీవి చెప్పడం కన్నా.. వాజ్‌పేయి గురించి పొగడటమే హైలెట్ అవుతోంది. వాజ్ పేయి ఎందుకు నచ్చారంటే.. హైవేలు బాగున్నాయని..దానికి కారణం ఆయనేనని చిరంజీవి వాదన. 

కారణం వెదుక్కుని మరీ బీజేపీపై చిరంజీవి సానుకూల వ్యాఖ్యలు చేస్తున్నారా ? 

చిరంజీవి ఇలా కారణం వెదుక్కుని మరీ బీజేపీని పొగిడారనిపించేలా ఆ వ్యాఖ్యలు ఉండటంతో "అన్నయ్య" మళ్లీ రాజకీయానికి దగ్గర అవుతున్నారన్న అభిప్రాయం వినిపించడానికి కారణం అవుతోంది. తాను ఓ పార్టీలో ఉండి.. తన సోదరుడు మరో పార్టీలో ఉంటే.. లీడర్‌గా ఎమర్జ్ కాలేడనే.. తాను రాజకీయాల నుంచి సెలవు తీసుకున్నానని చిరంజీవి చెప్పారు. అంటే రాజకీయాలపై విరక్తితోనే.. అవి తనకు సరిపడవనో ఆయన విరమించుకోలేదు. తన పార్టీ ఫెయిల్యూర్ తర్వాత మరో ప్రయత్నం చేస్తున్న పవన్‌కు సపోర్టుగానే విరమించుకుంటున్నారు. ఇప్పుడు తన సొంత రాజకీయం చేయాలనుకుంటే అందులో ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఎందుకంటే చిరంజీవికి ఉన్న స్టామినా కారణంగా అన్ని పార్టీలు రెడ్ కార్పెట్ వేస్తాయి. 

సూపర్ స్టార్ల విషయంలో  సానుకూల వైఖరి చూపే బీజేపీ 

News Reels

సూపర్ స్టార్లను తమ పార్టీలో చేర్చుకోవడంలో బీజేపీది అందే వేసిన చేయి. పార్టీలో చేర్చుకోకపోయినా.. తమ సానుభూతిపరులుగా ప్రజెంట్ చేసుకోవడంలో ముందు ఉంటుంది. కేరళలో మోహన్ లాల్ , తమిళనాడులో రజనీకాంత్ బీజేపీలో చేరలేదు. ..కానీ వారు బీజేపీకి సపోర్ట్ అన్న అభిప్రాయాలను కల్పించారు. కుదిరితే ఏపీలో చిరంజీవిని పార్టీలో చేర్చుకోవడం లేకపోతే..సానుభూతిపరుడిగా ప్రొజెక్ట్ చేసుకునే చాన్స్ కోసం బీజేపీ ఎదురు చూస్తోంది. ఇటీవల అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ కార్యక్రమానికి చిరంజీవికి ప్రత్యేక ఆహ్వానం వచ్చింది. వెళ్లారు కూడా. అక్కడ ప్రధాని మోదీ.. చిరంజీవితో చాలా ఆప్యాయంగా.. దగ్గరి మిత్రుడిలా మాట్లాడారు. అప్పుడే్ కొత్త స్పెక్యులేషన్లు ప్రాంభమయ్యాయి.

సోదరుడు కూడా బీజేపీతోనే పొత్తులో !

చిరంజీవికి ఇటీవల కాంగ్రెస్ పార్టీ ఐడీ కార్డు జారీ చేసింది. ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికల్లో ఓటు వేయడానికి ఆయనకు అవకాశం కల్పించారు. ఆయన ఉపయోగించుకుంటారో లేదో స్పష్టత లేదు. కానీ ఆయన మనసు మాత్రం గుర్తించలేనంతగా అయినా బీజేపీ వైపు మొగ్గుతోందని అప్పుడప్పుడూ చిరంజీవి వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలతో వెల్లడవుతోంది. ఈ విషయంలో  బీజేపీ నేతలు ఏమైనా ప్రత్యేక ఆపరేషన్ చేపట్టి.. చిరంజీవిని ఆకర్షించడానికి ప్రయత్నిస్తే ముందు ముందు కీలక పరిణామాలు చోటు చేసుకోవచ్చు.ఎందుకంటే బీజేపీతో పొత్తులోనే ... ఆయన సోదరుడు పవన్ కల్యాణ్ ఉన్నారు. 

Published at : 13 Oct 2022 01:10 PM (IST) Tags: BJP Chiranjeevi Lotus Party BJP Chiranjeevi

సంబంధిత కథనాలు

KCR Risky Politics : తెలంగాణ లేని రాజకీయం వర్కవుట్ అవుతుందా ? కేసీఆర్ ప్రతీ సారి అద్భుతం జరుగుతుందని అనుకుంటున్నారా ?

KCR Risky Politics : తెలంగాణ లేని రాజకీయం వర్కవుట్ అవుతుందా ? కేసీఆర్ ప్రతీ సారి అద్భుతం జరుగుతుందని అనుకుంటున్నారా ?

most trending news in Andhra Pradesh 2022 : కొత్త కేబినెట్ నుంచి మాధవ్ వీడియో వివాదం వరకూ - ఈ ఏడాది ఏపీలో టాప్ ట్రెండింగ్ న్యూస్ ఏమిటో తెలుసా ?

most trending news in Andhra Pradesh 2022 :  కొత్త కేబినెట్ నుంచి మాధవ్ వీడియో వివాదం వరకూ  - ఈ ఏడాది ఏపీలో టాప్ ట్రెండింగ్ న్యూస్ ఏమిటో తెలుసా ?

Challa Joins BRS: బీఆర్ఎస్‌లోకి మొదలైన చేరికలు, మాజీ ఎమ్మెల్యే చల్లాకు గూలాబీ కండువా కప్పిన సీఎం కేసీఆర్

Challa Joins BRS: బీఆర్ఎస్‌లోకి మొదలైన చేరికలు, మాజీ ఎమ్మెల్యే చల్లాకు గూలాబీ కండువా కప్పిన సీఎం కేసీఆర్

Pawan On Ysrcp : కారు నుంచి కట్ డ్రాయర్ల వరకూ - వారాహి రంగుల వివాదంపై వైఎస్ఆర్‌సీపీకి పవన్ ఇచ్చిన కౌంటర్స్ ఇవే

Pawan On Ysrcp :  కారు నుంచి కట్ డ్రాయర్ల వరకూ - వారాహి రంగుల వివాదంపై వైఎస్ఆర్‌సీపీకి పవన్ ఇచ్చిన కౌంటర్స్ ఇవే

Revant On BRS : ఏపీ, తెలంగాణలను కలిపే ప్రయత్నం చేస్తున్న కేసీఆర్ - బీఆర్ఎస్ పోటీ కోసమేనని రేవంత్ ఆరోపణ !

Revant On BRS :  ఏపీ, తెలంగాణలను కలిపే ప్రయత్నం చేస్తున్న కేసీఆర్ - బీఆర్ఎస్ పోటీ కోసమేనని రేవంత్ ఆరోపణ  !

టాప్ స్టోరీస్

Weather Latest Update: తీరందాటిన మాండస్ తుపాను, ఈ జిల్లాల్ని వణికిస్తున్న వానలు

Weather Latest Update: తీరందాటిన మాండస్ తుపాను, ఈ జిల్లాల్ని వణికిస్తున్న వానలు

BRA vs CRO, FIFA WC Quarter Final: ఫిఫా వరల్డ్ కప్‌లో సంచలనం, బ్రెజిల్‌పై విజయంతో సెమీస్‌కు క్రొయేషియా

BRA vs CRO, FIFA WC Quarter Final: ఫిఫా వరల్డ్ కప్‌లో సంచలనం, బ్రెజిల్‌పై విజయంతో సెమీస్‌కు క్రొయేషియా

ఆ జాబితాలో ‘ఆర్ఆర్ఆర్’ - ఆస్కార్‌కు లైన్ క్లియరైనట్లేనా?

ఆ జాబితాలో ‘ఆర్ఆర్ఆర్’ - ఆస్కార్‌కు లైన్ క్లియరైనట్లేనా?

Woman Kidnap Case:యువతి కిడ్నాప్ కేసులో ట్విస్ట్ - నిందితుడితో గతంలోనే పరిచయం, పెళ్లికి నో చెప్పడంతో రచ్చరచ్చ

Woman Kidnap Case:యువతి కిడ్నాప్ కేసులో ట్విస్ట్ - నిందితుడితో గతంలోనే పరిచయం, పెళ్లికి నో చెప్పడంతో రచ్చరచ్చ