అన్వేషించండి

YS Sharmila Letter: 'అర్ధరాత్రి అనుమతుల వెనుక దర్యాప్తు జరగాలి' - సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

Andhra News: మాజీ సీఎం జగన్ అదానీతో చేసుకున్న విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాలను రద్దు చేయాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం చంద్రబాబుకు ఆమె బహిరంగ లేఖ రాశారు.

YS Sharmila Letter To CM Chandrababu: అదానీతో మాజీ సీఎం జగన్ (Jagan) చేసుకున్న విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాలను రద్దు చేయాలని ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల (YS Sharmila) డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆమె సీఎం చంద్రబాబుకు (CM Chandrababu) లేఖ రాశారు. అదానీతో ఒప్పందం రాష్ట్రానికి పెను భారమని.. ఈ అక్రమ ఒప్పందాలతో 25 ఏళ్ల పాటు పాటు ప్రజలపై రూ.లక్షన్నర కోట్ల భారం పడుతుందని అన్నారు. 'విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందంలో గౌతమ్ అదానీ నుంచి రూ.1750 కోట్ల ముడుపులు అందుకున్న జగన్‌పై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సీబీఐతో లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి. ఈ విషయంలో లంచాలు తీసుకున్నట్లు ఇప్పటికే అమెరికాకు చెందిన దర్యాప్తు సంస్థలు నిరూపించాయి. జగన్ ఏపీ పరువును తీశారు. లంచాల కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారు. అదానీ దగ్గర నుంచి గుజరాత్ యూనిట్ ధర రూ.1.99 పైసలకు కొంటుంటే, ఏపీ మాత్రం యూనిట్ ధర రూ.2.49 పైసలుగా అగ్రిమెంట్ చేసుకున్నారు.' అని షర్మిల మండిపడ్డారు. 

'అర్ధరాత్రి అనుమతులు'

అదానీతో చేసుకున్న విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాలు మొత్తం సీఎంవో నుంచే నడిచాయని.. ఈ విషయాన్ని స్వయంగా అప్పటి విద్యుత్ శాఖ మంత్రి ఒప్పుకొన్నట్లు షర్మిల చెప్పారు. 'ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి కూడా ఎలాంటి ప్రజాభిప్రాయం సేకరించకుండా, అదే కంపెనీ ఇతర రాష్ట్రాల్లో చేసుకున్న ఒప్పందాలను పరిశీలించకుండా వెంటనే ఆమోద ముద్ర వేశారు. అర్ధరాత్రి హడావుడిగా చేసిన అనుమతుల వెనుక దర్యాప్తు జరగాలి. అత్యవసరంగా సోలార్ పవర్‌ను కొనాల్సిన అవసరం ఏమొచ్చిందో, నిజానిజాలు ఏంటో రాష్ట్ర ప్రజలకు తెలియాలి. అదానీతో ఒప్పందాల రద్దుతో పాటు కంపెనీని తక్షణమే బ్లాక్ లిస్ట్‌లో పెట్టాలి. అలాగే 2019 నుంచి 2024 మధ్య అదానీతో జరిగిన ఒప్పందాల మీద పూర్తిగా విచారణ జరగాలి.' అని లేఖలో ప్రస్తావించారు.

'చీమ కుట్టినట్లైనా లేదు'

'మన దేశం, రాష్ట్రం పరువు తీసేలా అంతర్జాతీయ మార్కెట్‌లో చర్చల మీద చర్చలు జరుగుతున్నాయి. ఇంత జరుగుతున్నా మీ కూటమి ప్రభుత్వానికి చీమ కుట్టినట్లైనా లేదు. ముడుపుల అంశంలో కనీసం మీరు నోరు విప్పడం లేదు. ఇప్పటికే అమరావతి ఇన్నర్ రింగ్ ప్రాజెక్టుతో పాటూ, రోప్‌వే నిర్మాణం, బీచ్ శాండ్ ఉత్పత్తుల ప్రాజెక్టులు, కొత్తగా సోలార్, హైడ్రో పవర్ ప్రాజెక్టులు అదానీకి కట్టబెట్టేందుకు సన్నాహాలు
చేస్తున్నట్లు తెలుస్తోంది. సీఎం గారిని డిమాండ్ చేస్తున్నాం. ముడుపుల వ్యవహారంలో అదానీ కంపెనీ చేసే కుట్ర ఏంటో తేటతెల్లం అయ్యింది. అమెరికా దర్యాప్తు సంస్థల ద్వారా అసలు విషయం బయటపడ్డాక మళ్లీ మీరు కూడా ఆ కంపెనీతోనే ముందుకు
వెళ్తారా లేక రాష్ట్రంలో అదానీ గ్రూప్స్‌ను బ్లాక్ లిస్ట్‌లో పెడతారా తేల్చుకోవాలి. గంగవరం పోర్టు అదానీకి అమ్మడంపైనా విచారణ జరగాలి. గంగవరం పోర్టు తక్కువ ధరకు కట్టబెట్టడం వెనుక దాగి ఉన్న మర్మమేంటో కూటమి ప్రభుత్వం బయటపెట్టాలి. 2008న అప్పటి ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం ప్రకారం గంగవరం పోర్ట్ తిరిగి ప్రభుత్వపరం అయ్యేలా చర్యలు చేపట్టాలి.' అని లేఖలో పేర్కొన్నారు.

Also Read: Ambati Rambabu On PusPha 2: కుట్రలు చేసినా పుష్ప-2 సినిమాని ఆపలేరని అంబటి రాంబాబు ఫైర్ - ఇంతకీ అల్లు అర్జున్ సినిమాని ఆపాలని ప్రయత్నించింది ఎవరు ?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chandrababu on Population:  ఏపీకి వయసైపోతోంది. - కుర్రాడు చంద్రబాబు చెప్పేది కాస్త వినండి !
ఏపీకి వయసైపోతోంది. - కుర్రాడు చంద్రబాబు చెప్పేది కాస్త వినండి !
IPS PV Sunil :  ఐపీఎస్ పీవీ సునీల్‌పై విచారణకు కమిటీ - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
ఐపీఎస్ పీవీ సునీల్‌పై విచారణకు కమిటీ - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
Vizag Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్‌కు 11,440 కోట్ల ప్యాకేజీ - అధికారికంగా ప్రకటించిన కేంద్ర మంత్రి అశ్వనీ వైష్ణవ్
విశాఖ స్టీల్ ప్లాంట్‌కు 11,440 కోట్ల ప్యాకేజీ - అధికారికంగా ప్రకటించిన కేంద్ర మంత్రి అశ్వనీ వైష్ణవ్
TGPSC: రేపే గ్రూప్- 2  ప్రాథమిక కీ విడుదల, జనవరి 22 వరకు అభ్యంతరాల స్వీకరణ
TGPSC: రేపే గ్రూప్- 2 ప్రాథమిక కీ విడుదల, జనవరి 22 వరకు అభ్యంతరాల స్వీకరణ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Anil Ravipudi Cringe Movies Director | Sankranthiki Vasthunnam తో వందకోట్లు కొట్టినా వేస్ట్ డైరెక్టరేనా.? | ABP DesamAI Videos Impact | ఏఐ వీడియోలు చేస్తున్న అరాచకాలు గమనించారా | ABP DesamBidar Robbers Hyderabad Gun Fire | లక్షల డబ్బు కొట్టేశారు..మనీ బాక్సుతో పారిపోతూ ఉన్నారు | ABP DesamKonaseema prabhala Teertham | కోలాహలంగా కోనసీమ ప్రభల తీర్థం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu on Population:  ఏపీకి వయసైపోతోంది. - కుర్రాడు చంద్రబాబు చెప్పేది కాస్త వినండి !
ఏపీకి వయసైపోతోంది. - కుర్రాడు చంద్రబాబు చెప్పేది కాస్త వినండి !
IPS PV Sunil :  ఐపీఎస్ పీవీ సునీల్‌పై విచారణకు కమిటీ - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
ఐపీఎస్ పీవీ సునీల్‌పై విచారణకు కమిటీ - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
Vizag Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్‌కు 11,440 కోట్ల ప్యాకేజీ - అధికారికంగా ప్రకటించిన కేంద్ర మంత్రి అశ్వనీ వైష్ణవ్
విశాఖ స్టీల్ ప్లాంట్‌కు 11,440 కోట్ల ప్యాకేజీ - అధికారికంగా ప్రకటించిన కేంద్ర మంత్రి అశ్వనీ వైష్ణవ్
TGPSC: రేపే గ్రూప్- 2  ప్రాథమిక కీ విడుదల, జనవరి 22 వరకు అభ్యంతరాల స్వీకరణ
TGPSC: రేపే గ్రూప్- 2 ప్రాథమిక కీ విడుదల, జనవరి 22 వరకు అభ్యంతరాల స్వీకరణ
CM Revanth Reddy : సింగపూర్‌లో సీఎం రేవంత్ కీలక ఒప్పందం.. ఐటీఈతో స్కిల్ యూనివర్సిటీ కీలక ఒప్పందం
సింగపూర్‌లో సీఎం రేవంత్ కీలక ఒప్పందం.. ఐటీఈతో స్కిల్ యూనివర్సిటీ కీలక ఒప్పందం
Pawan Kalyan: ఇంకా ఎన్నేళ్లు విచారిస్తారు- 3 వారాల్లో తేల్చేయండి- అధికారులపై పవన్ సీరియస్
ఇంకా ఎన్నేళ్లు విచారిస్తారు- 3 వారాల్లో తేల్చేయండి- అధికారులపై పవన్ సీరియస్
Honda Activa : భారత్ లో హోండా యాక్టివా e, QC1 ఎలక్ట్రిక్ స్కూటర్లు లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే
భారత్ లో హోండా యాక్టివా e, QC1 ఎలక్ట్రిక్ స్కూటర్లు లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే
Nara Lokesh: పవన్ బాటలోనే నారా లోకేశ్‌- దుర్గ గుడి భక్తులకు క్షమాపణలు చెప్పిన మంత్రి
పవన్ బాటలోనే నారా లోకేశ్‌- దుర్గ గుడి భక్తులకు క్షమాపణలు చెప్పిన మంత్రి
Embed widget