అన్వేషించండి

AP Local Body Elections: మూడు నెలల్లో ఏపీ స్థానిక ఎన్నికల నగారా? కూటమిలో సీట్ల పంచాయతీ.. బాబు ముందున్న సవాల్ ఇదే!

Local Polls 2026: ఆంధ్రప్రదేశ్లో అందరి దృష్టి స్థానిక సంస్థల ఎన్నికలపై పడింది. ఎస్‌ఈసీగా అనిల్ కుమార్ పునేఠా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కసరత్తు వేగవంతం కావడం రాజకీయ వర్గాల్లో వేడి పుట్టిస్తోంది.

AP local body elections:  ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. కొత్త ఎస్‌ఈసీ అనిల్ కుమార్ పునేఠా నిర్వహించిన సమీక్షా సమావేశం రాష్ట్రంలో ఎన్నికల వేడిని ఒక్కసారిగా పెంచింది. వచ్చే మూడు నెలల కాలంలో పెండింగ్‌లో ఉన్న పంచాయతీ, పరిషత్  ,  మున్సిపల్ ఎన్నికలను పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఏకపక్ష ఎన్నికల ఆరోపణల కారణంగా , ఈసారి అత్యంత పారదర్శకంగా ఎన్నికలు జరపాలని యంత్రాంగం లక్ష్యంగా పెట్టుకుంది.

 కూటమికి  సొంత  చిక్కులు 

స్థానిక ఎన్నికల నిర్వహణ కూటమి ప్రభుత్వానికి అంత సులభం కాదు. సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి అద్భుత విజయం సాధించినప్పటికీ.. క్షేత్రస్థాయిలో సీట్ల సర్దుబాటు ఇప్పుడు అతిపెద్ద సవాల్‌గా మారింది. ముఖ్యంగా జనసేన, బీజేపీలు ఈసారి గతంలో కంటే ఎక్కువ స్థానాల్లో పోటీ చేసేందుకు పట్టుబట్టే అవకాశం ఉంది. పొత్తులో భాగంగా తమకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆ పార్టీల కిందిస్థాయి నేతలు ఇప్పటికే ఒత్తిడి పెంచుతున్నారు.   ఐదేళ్లుగా క్షేత్రస్థాయిలో వైఎస్సార్‌సీపీ వేధింపులను తట్టుకుని నిలబడిన టీడీపీ గ్రామస్థాయి కార్యకర్తలు.. ఇప్పుడు తమకు రావాల్సిన పదవులను పొత్తుల పేరుతో ఇతర పార్టీలకు వదులుకోవాల్సి వస్తుందన్న ఆందోళనలో ఉన్నారు. క్షేత్రస్థాయిలో బలమైన నెట్‌వర్క్ ఉన్న టీడీపీ క్యాడర్‌ను కాదని జనసేన లేదా బీజేపీకి ఎక్కువ స్థానాలు కేటాయిస్తే, అది తిరుగుబాటుకు దారితీయవచ్చు. ఇదే జరిగితే కూటమి ఐక్యత దెబ్బతినే ప్రమాదం ఉందని చంద్రబాబు నాయుడు గ్రహించారు.

 చంద్రబాబు వెయిట్ అండ్ వాచ్  వ్యూహం? 

ఎన్నికల నిర్వహణపై ప్రకటనలు వస్తున్నప్పటికీ, లోలోపల చంద్రబాబు కొంత జాప్యం చేస్తున్నట్లు కనిపిస్తోంది. దీనికి ప్రధాన కారణం పార్టీల మధ్య సమన్వయం కుదర్చడమేనని తెలుస్తోంది. ముందుగా నియోజకవర్గాల వారీగా సమన్వయ కమిటీలను వేసి, అసంతృప్తిని తగ్గించిన తర్వాతే నోటిఫికేషన్‌కు వెళ్లాలని ఆయన భావిస్తున్నారు. అందుకే ఎస్‌ఈసీ కసరత్తు చేస్తున్నా, ప్రభుత్వం నుండి గ్రీన్ సిగ్నల్ రావడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది.  

భారీ ప్రాధాన్యత కోరుతున్న జనసేన 

మరోవైపు పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన ఈసారి స్థానిక సంస్థల్లో తన బలాన్ని నిరూపించుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. ఎంపీటీసీ, సర్పంచ్ స్థానాల్లో తమకు గౌరవప్రదమైన సంఖ్య దక్కాలని ఆ పార్టీ కోరుతోంది. అటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా ఏపీలో తన ఉనికిని చాటుకోవడానికి ఈ ఎన్నికలను వేదికగా మార్చుకోవాలని చూస్తోంది. ఈ మూడు పార్టీల డిమాండ్లను సమతూకం చేయడం చంద్రబాబుకు కత్తిమీద సాము లాంటిదే. వచ్చే మూడు నెలలు ఏపీ రాజకీయాల్లో అత్యంత కీలకం కానున్నాయి. అటు వైఎస్సార్‌సీపీని ఎదుర్కోవడం కంటే, ఇటు కూటమిలోని పార్టీల మధ్య సఖ్యతను కాపాడుకుంటూ సీట్ల పంపిణీ పూర్తి చేయడమే చంద్రబాబు ముందున్న ప్రధాన లక్ష్యం. ఒకవేళ ఏకాభిప్రాయం కుదరకపోతే, కొన్ని చోట్ల  'ఫ్రెండ్లీ కాంటెస్ట్  జరిగే అవకాశాలను కూడా తోసిపుచ్చలేం.                      

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Indian Politics Instagram Reels Strategy: ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌తో మారిన రాజకీయం - జెన్ జీ ఓటర్ల పల్స్ పట్టుకునేందుకు నాయకుల బిగ్ స్విచ్!
ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌తో మారిన రాజకీయం - జెన్ జీ ఓటర్ల పల్స్ పట్టుకునేందుకు నాయకుల బిగ్ స్విచ్!
Chandrababu Naidu Narendra Modi Relation Strategy: మోదీపై చంద్రబాబు అంతులేని పొగడ్తలు - విమర్శలు వచ్చినా తగ్గేదే లే - అసలు కారణం ఇదేనా?
మోదీపై చంద్రబాబు అంతులేని పొగడ్తలు - విమర్శలు వచ్చినా తగ్గేదే లే - అసలు కారణం ఇదేనా?
Telangana Assembly Monsoon Session: అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో కాళేశ్వరమే సెంటర్ టాపిక్ - కాంగ్రెస్ వ్యూహం.. బీఆర్ఎస్ ఎదుర్కొంటుందా?
అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో కాళేశ్వరమే సెంటర్ టాపిక్ - కాంగ్రెస్ వ్యూహం.. బీఆర్ఎస్ ఎదుర్కొంటుందా?
YSRCP Leaders Legal Troubles: వైఎస్సార్‌సీపీ నేతల వరుస కేసులు, ఆజ్ఞాతం - పొలిటికల్ స్ట్రాటజీనా? దూకుడు వికటించిందా?
వైఎస్సార్‌సీపీ నేతల వరుస కేసులు, ఆజ్ఞాతం - పొలిటికల్ స్ట్రాటజీనా? దూకుడు వికటించిందా?
Advertisement

వీడియోలు

Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్
Hardik Pandya Trade to CSK IPL 2027 | రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన ముంబై ఇండియన్స్
Zaheer Abbas About Rohit Sharma & Virat | రో, కోపై పాక్ లెజెండ్ సంచలన వ్యాఖ్యలు
Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Indian Politics Instagram Reels Strategy: ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌తో మారిన రాజకీయం - జెన్ జీ ఓటర్ల పల్స్ పట్టుకునేందుకు నాయకుల బిగ్ స్విచ్!
ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌తో మారిన రాజకీయం - జెన్ జీ ఓటర్ల పల్స్ పట్టుకునేందుకు నాయకుల బిగ్ స్విచ్!
Andhra Pradesh And Telangana Weather: తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 
తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 
Amalapuram Latest News: అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో రైతులు తిరుగుబాటు- పంట విరామం ప్రకటించిన తాడికోన అన్నదాతలు! 
అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో రైతులు తిరుగుబాటు- పంట విరామం ప్రకటించిన తాడికోన అన్నదాతలు! 
Vishnu Manchu: కొరియన్ స్కిన్ కేర్ క్లినిక్‌లో మంచు ఫ్యామిలీ... మోహన్ బాబు, విష్ణు వైరల్ ఫోటోలు
కొరియన్ స్కిన్ కేర్ క్లినిక్‌లో మంచు ఫ్యామిలీ... మోహన్ బాబు, విష్ణు వైరల్ ఫోటోలు
India Pakistan:
"భారత ఏజెంట్ పాకిస్థాన్‌లోకి ప్రవేశించి 30 మంది ఉగ్రవాదులను హతమార్చాడు"లష్కర్ కార్యకర్త సంచలన ప్రకటన!
MBBS Fees in India: MBBS చదువుకు ఎంత ఖర్చు అవుతుంది? ఎన్ని సంవత్సరాలు చదవాలి? 
MBBS చదువుకు ఎంత ఖర్చు అవుతుంది? ఎన్ని సంవత్సరాలు చదవాలి? 
MLC Teenmar Mallanna: తెలంగాణ ఏమైనా రెడ్ల అయ్య జాగీరా.. చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
తెలంగాణ ఏమైనా రెడ్ల అయ్య జాగీరా.. చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
498A IPC to Live In Relationships: సుప్రీంకోర్టు సంచలన తీర్పు - లైవ్-ఇన్ భాగస్వాములకూ సెక్షన్ 498A వర్తింపు!
సుప్రీంకోర్టు సంచలన తీర్పు - లైవ్-ఇన్ భాగస్వాములకూ సెక్షన్ 498A వర్తింపు!
Embed widget