అన్వేషించండి

AP Local Body Elections 2026: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు - తాడేపల్లి హుకుం.. క్షేత్రస్థాయిలో నైరాశ్యం! వైఎస్సార్‌సీపీలో రాజకీయ సంక్షోభం కనిపిస్తోందా?

AP Local Polls: స్థానిక సంస్థల ఎన్నికలపై వైసీపీలో నైరాశ్యం వ్యక్తమవుతోంది. జగన్ ఆదేశాలు ఇస్తున్నా పోటీకి భయపడుతున్న అభ్యర్థులు, క్యూ కడుతున్న రాజీనామాలు ఆ పార్టీని ఇబ్బంది పెడుతున్నాయి.

Jagan Tadepalli Local Elections Review: ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల  ఎన్నికల సమరానికి కూటమి ప్రభుత్వం సమాయత్తమవుతున్న వేళ, ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర అంతర్మథనం, నైరాశ్యం కనిపిస్తున్నాయి. తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ వేదికగా వైఎస్ జగన్మోహన్‌రెడ్డి రీజనల్ కోఆర్డినేటర్లు, సీనియర్ నేతలతో వరుస సమీక్షలు నిర్వహిస్తూ ప్రతి వార్డు, పంచాయతీ, నియోజకవర్గంలోనూ అభ్యర్థులను దింపి గట్టిగా పోరాడాల్సిందే  అని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు. అయితే, అధినేత ఇస్తున్న ఆదేశాలకు, క్షేత్రస్థాయిలోని కఠిన వాస్తవాలకు మధ్య ఏమాత్రం పొంతన కుదరడం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

 తాడేపల్లి హుకుం vs క్షేత్రస్థాయి నెగెటివిటీ 

అధికారం కోల్పోయిన నాటి నుంచి వైస్రపీ తీవ్ర రాజకీయ ఒత్తిడిని ఎదుర్కొంటోంది. సార్వత్రిక ఎన్నికల ఓటమి షాక్ నుంచి పార్టీ క్యాడర్ ఇంకా తేరుకోకముందే స్థానిక సంస్థల సమరం వచ్చిపడింది. జగన్ ఆదేశాల ప్రకారం ఊరూరా అభ్యర్థులను నిలబెట్టాలన్నా, అసలు పార్టీ జెండా పట్టుకుని నామినేషన్ వేసేందుకు క్షేత్రస్థాయి నాయకులు, ద్వితీయ శ్రేణి కార్యకర్తలు ముందుకు రావడం లేదనే ప్రచారం సాగుతోంది. ఎన్నికల బరిలో నిలిస్తే కూటమి ప్రభుత్వం నుంచి ఎదురయ్యే రాజకీయ సమీకరణాలు, కేసుల భయంతో పాటు ఆర్థిక భారాన్ని మోయలేమని స్థానిక నేతలు వెనకడుగు వేస్తున్నారు.

 గూటికి గండి కొడుతున్న నిరంతర వలసలు 

పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఐదేళ్లపాటు అన్ని రకాల ప్రాధాన్యతలు, పదవులు అనుభవించిన మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, జడ్పీ ఛైర్మన్లు, జిల్లా స్థాయి నేతలు ఇప్పుడు ఒక్కొక్కరుగా వైఎస్సార్‌సీపీకి గుడ్‌బై చెబుతున్నారు. విజయనగరం జిల్లాలో బొత్స సత్యనారాయణ అనుచరులు, మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావు తో పాటు పలు గ్రామాల నేతలు గుత్తాధిపత్యంగా రాజీనామాలు చేయడం ఇందుకు తాజా ఉదాహరణ. జిల్లాల్లో కీలక నాయకులే పక్కచూపులు చూస్తూ అధికార కూటమి పార్టీలైన టీడీపీ, జనసేన వైపు వెళ్తుంటే.. గ్రామాల్లో ఉండే క్షేత్రస్థాయి కార్యకర్తలు దిక్కుతోచని స్థితిలో పడిపోతున్నారు.

 జగన్ వన్-మ్యాన్ షో వ్యూహం 

కష్టకాలంలో పర్యటనలు చేస్తూ, కార్యకర్తలకు నేరుగా అండగా నిలవాల్సిన అధినేత జగన్.. ఇప్పటికీ కేవలం తాడేపల్లి ఆఫీస్‌కే పరిమితమై రివ్యూ సమావేశాల ద్వారానే నడిపిస్తున్నారనే విమర్శలు స్వంత పార్టీలోనే వినిపిస్తున్నాయి. పార్టీని వీడుతున్న నేతలను బుజ్జగించడానికి లేదా క్షేత్రస్థాయిలో వేధింపులకు గురవుతున్నామంటున్న కార్యకర్తలకు ప్రత్యక్షంగా రోడ్డుపైకి వచ్చి నమ్మకం కలిగించేందుకు జగన్ పెద్దగా ప్రయత్నించడం లేదన్న అసంతృప్తి క్యాడర్‌లో ఉంది. అధినేత విధానాలు కేవలం ప్రకటనలకే పరిమితమవుతున్నాయని, క్షేత్రస్థాయి రక్షణ కల్పించలేకపోతున్నారని ద్వితీయ శ్రేణి నేతలు భావిస్తున్నారు.

 సింబాలిక్ పోరు గా మారుతున్న పోటీ 

స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికారంలో ఉన్న పార్టీలకే ఎప్పుడూ పైచేయి ఉంటుంది. అధికారిక యంత్రాంగం, నిధుల బలం, స్థానిక సర్పంచ్, ఎంపీటీసీ పదవుల ద్వారా వచ్చే ప్రాధాన్యతలు అధికార పార్టీ అభ్యర్థులకే అనుకూలంగా మారతాయి. ఇలాంటి సమయంలో ప్రతిపక్షంలో ఉన్న వైస్రపీ అన్ని స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టడం దేవుడెరుగు, కనీసం పోటీ ఇచ్చే బలమైన అభ్యర్థులను వెతకడమే సవాలుగా మారింది. ఫలితంగా చాలా చోట్ల అభ్యర్థులు దొరకక పార్టీ 'సింబాలిక్'గా మాత్రమే నామినేషన్లు వేయించే పరిస్థితి రావచ్చు.  మరోవైపు టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ప్రభుత్వం స్థానిక ఎన్నికలను ఏకపక్షం చేయాలనే పక్కా వ్యూహంతో ముందుకు వెళ్తోంది. గతంలో వైస్రపీకి కంచుకోటలుగా ఉన్న రాయలసీమ, ఉమ్మడి విశాఖ, విజయనగరం, నెల్లూరు జిల్లాల్లో స్థానిక నాయకత్వాన్ని తమవైపు తిప్పుకోవడం ద్వారా వైస్రపీ ఓటు బ్యాంకును దెబ్బకొడుతోంది. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలతో పాటు స్థానిక ఎన్నికల్లో సత్తా చాటి ప్రతిపక్షాన్ని మానసికంగా మరింత దెబ్బతీయాలని కూటమి భావిస్తోంది.

 వైఎస్సార్‌సీపీ మనుగడకు అత్యంత కీలకమైన పరీక్ష 

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు కేవలం పదవుల కోసం జరుగుతున్న పోరు మాత్రమే కాదు.. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఇది ఉనికికి సంబంధించిన 'లిట్మస్ టెస్ట్'. తాడేపల్లి నుంచి హుకుం జారీ చేయడం వల్ల మాత్రమే ఓట్లు రాలవు. జగన్ ఇప్పటికైనా తన శైలిని మార్చుకుని, తాడేపల్లి దాటి జిల్లాల పర్యటనలు చేపట్టి, స్థానిక కార్యకర్తల్లో ఆత్మవిశ్వాసం నింపకపోతే.. ఈ ఎన్నికల ఫలితాలు వైసీపీకి కోలుకోలేని దెబ్బగా మారే ప్రమాదం ఉంది.  

 


  

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Education Reforms: ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి విద్య, తెలంగాణలో ఆక్స్‌ఫర్డ్, హార్వర్డ్ క్యాంపస్‌లు- ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్‌లో సీఎం రేవంత్ రెడ్డి విద్యారంగ విజన్!
ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి విద్య, తెలంగాణలో ఆక్స్‌ఫర్డ్, హార్వర్డ్ క్యాంపస్‌లు- ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్‌లో సీఎం రేవంత్ రెడ్డి విద్యారంగ విజన్!
Kolathur MLA VS Babu Passes Away: తమిళనాడులో విషాదం.. స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్ టీవీకే ఎమ్మెల్యే వి.ఎస్. బాబు కన్నుమూత!
తమిళనాడులో విషాదం.. స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్ టీవీకే ఎమ్మెల్యే వి.ఎస్. బాబు కన్నుమూత!
UP Elections 2027 Analysis: ఒవైసీ–చంద్రశేఖర్ ఆజాద్ సామాజిక పరివర్తన మోర్చా .. దళిత, ముస్లిం ఓట్ల చీలికతో ఎస్పీ–కాంగ్రెస్‌కు దెబ్బ, బీజేపీకి లాభమా?
ఒవైసీ–చంద్రశేఖర్ ఆజాద్ సామాజిక పరివర్తన మోర్చా .. దళిత, ముస్లిం ఓట్ల చీలికతో ఎస్పీ–కాంగ్రెస్‌కు దెబ్బ, బీజేపీకి లాభమా?
Invest Telangana Global Summit 2026: కరువు వేళ గ్లోబల్ సమ్మిట్ అవసరమా? 400 మంది మేధావుల లేఖ - రేవంత్ సర్కార్ ఏం చేస్తుంది?
కరువు వేళ గ్లోబల్ సమ్మిట్ అవసరమా? 400 మంది మేధావుల లేఖ - రేవంత్ సర్కార్ ఏం చేస్తుంది?
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rekha Naik House ED Raids: రూ.40.96 కోట్ల రైస్ మిల్లు స్కామ్.. మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్‌కు ఈడీ షాక్!
రూ.40.96 కోట్ల రైస్ మిల్లు స్కామ్.. మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్‌కు ఈడీ షాక్!
Pollution Certificate: పొల్యూషన్ రూల్స్‌ పాటించని 17,000కు పైగా వాహనాలు సీజ్.. దాదాపు 26,000 ట్రాఫిక్‌ చలాన్లు జారీ, జర జాగ్రత్త!
పొల్యూషన్ సర్టిఫికెట్ లేకుంటే తప్పదు 'జరిమానా'.. 17 రోజుల్లోనే దాదాపు 26,000 చలాన్లు జారీ
KTR On CM Revanth Reddy: 'చిన్నగా ఉన్నా ఆయన మా ముఖ్యమంత్రి..నూకేయకండి- సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ వ్యంగ్య వ్యాఖ్యలు
'చిన్నగా ఉన్నా ఆయన మా ముఖ్యమంత్రి..నూకేయకండి- సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ వ్యంగ్య వ్యాఖ్యలు
Aakasamlo Oka Tara OTT : ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఒక తార - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఒక తార - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Kolathur MLA VS Babu Passes Away: తమిళనాడులో విషాదం.. స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్ టీవీకే ఎమ్మెల్యే వి.ఎస్. బాబు కన్నుమూత!
తమిళనాడులో విషాదం.. స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్ టీవీకే ఎమ్మెల్యే వి.ఎస్. బాబు కన్నుమూత!
Polavaram Maoist Dump:చింతూరు ఏజెన్సీలో మావోయిస్టుల భారీ డంప్ స్వాధీనం.. భారీగా పేలుడు పదార్థాలు లభ్యం
చింతూరు ఏజెన్సీలో మావోయిస్టుల భారీ డంప్ స్వాధీనం.. భారీగా పేలుడు పదార్థాలు లభ్యం
Rahul Gandhi US Remarks Row: అమెరికా వేదికగా రాహుల్ గాంధీ విమర్శలు - దేశానికి వ్యతిరేకమన్న బీజేపీ - జీడీపీ గణాంకాలతో కౌంటర్!
అమెరికా వేదికగా రాహుల్ గాంధీ విమర్శలు - దేశానికి వ్యతిరేకమన్న బీజేపీ - జీడీపీ గణాంకాలతో కౌంటర్!
AICC Action on Komatireddy Rajagopal Reddy: ఢిల్లీకి చేరిన రాజగోపాల్ రెడ్డి వీడియోలు - అనిరుథ్ రెడ్డిపై కూడా పరిశీలన - సస్పెండ్ చేస్తారా, బుజ్జగిస్తారా?
ఢిల్లీకి చేరిన రాజగోపాల్ రెడ్డి వీడియోలు - అనిరుథ్ రెడ్డిపై కూడా పరిశీలన - సస్పెండ్ చేస్తారా, బుజ్జగిస్తారా?
Embed widget