అన్వేషించండి

AP BJP Leaders : త్యాగాలు చేసిన ఏపీ బీజేపీ సీనియర్లకు నిరాశే - వారి రాజకీయ భవిష్యత్‌కు హైకమాండ్ గ్యారంటీ ఇస్తుందా ?

Andhra Politics : ఏపీలో కూటమి తొలి విడత నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసింది. ఇందులో బీజేపీ నుంచి ఒక్క లంకా దినకర్‌కే చాన్సిచ్చింది. మరి త్యాగాలు చేసిన మిగిలిన వారి సంగతేమిటి ?

AP BJP senior leaders Not to get even nominated posts : పొత్తుల కారణంగా టిక్కెట్లు త్యాగం చేసిన వారికి గుర్తింపునిస్తూ టీడీపీ నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసింది. అయితే ఇలా త్యాగాలు చేసిన వారు ఒక్క టీడీపీ నేతలే కాదు.. భారతీయ జనతా పార్టీ నేతలు కూడా ఉన్నారు. ముఖ్యంగా పార్టీలో దశాబ్దాలుగా ఉంటూ.. పోటీ చేయడానికి కూడా అవకాశం రాని వారు ఉన్నారు. వారు నామినేటెడ్ పోస్టుల్లో అయినా కేబినెట్ ర్యాంకు పోస్టులు దక్కాయని ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ మొదటి జాబితాలో వారి పేర్లు కనిపించలేదు. 

టీడీపీ వ్యతిరేకులు అన్న ముద్ర ఉన్న వారిపై శీతకన్ను 

ఆంధ్రప్రదేశ్ బీజేపీలో కొంత మంది నేతలపై టీడీపీ వ్యతిరేకులన్న ముద్ర బలంగా వేశారు కొంత మంది. వారంతా వైసీపీతో సన్నిహితంగా ఉంటారని అంటారు. కానీ వారు దశాబ్దాలగా బీజేపీతో కలిసి పయనిస్తున్న నేతలు. సిద్ధాంత పరంగా పార్టీ విధానాల ప్రకారం.. ఇతర పార్టీల్ని వ్యతిరేకిస్తారు. టీడీపీతో కలిసి ఉన్నప్పుడు అ పార్టీకి పని చేశారు. వైసీపీ ప్రభుత్వంపైనా పోరాడారు . కానీ వైసీపీ ప్రభుత్వంపై వారు చేసిన పోరాటాలకు పెద్దగా ప్రచారం రాలేదు. వారికి ఉన్న ఇమేజ్ మారలేదు. ఇది వారికి ఎక్కువ మైనస్ గా మారుతోంది. ఈ కారణంగా సీనియర్లు ఎక్కువగా నష్టపోతున్నారు. ఇలాంటి వారిలో సోము వీర్రాజు, విష్ణవర్ధన్ రెడ్డి, జీవీఎల్ నరిసంహరావు, పీవీఎన్ మాధవ్ వంటి వారు ఉన్నారు. వీరెవరికి ప్రాధాన్యం దక్కడం లేదు. 

సనాతన ధర్మానికి అవమానం జరుగుతుంటే హిందువులకు బాధ్యత లేదా? పవన్ కల్యాణ్ సంచనల వ్యాఖ్యలు

నామినేటెడ్ పోస్టులు ఇవ్వడానికీ పనికి రారా  ?

తమ తరవాత పార్టీలోకి వచ్చిన వారికి టిక్కెట్లు వచ్చాయి. అప్పటికప్పుడు పార్టీలో చేర్చుకుని టిక్కెట్లు ఇచ్చారు కానీ..తాము దశాబ్దాలుగా రాజకీయం చేస్తున్నా.. టిక్కెట్ దక్కనివ్వలేదన్న అసంతృప్తిలో ఆ పార్టీ సీనియర్లు ఉన్నారు. అయితే తమ అసంతృప్తిని ఎన్నికల్లో కనిపించనివ్వలేదు. కూటమి అభ్యర్తుల కోసం పని చేశారు. పీవీఎన్ మధవ్ , విష్ణువర్దన్ రెడ్డి వంటి నేతలు విస్తృతంగా పర్యటించారు. యువనేతలు అయిన వారికీ అయినా ప్రాధాన్యం ఇస్తారా లేదా అన్నదానిపై ఇప్పటికీ స్పష్టత లేదు. 

రాజకీయాల్లోనూ నందా వర్సెస్ బద్రి - 30 తర్వాత చూసుకుందామని పవన్‌కు ప్రకాష్ రాజ్ కౌంటర్

సైలెంట్ అయిపోయిన నేతలు - స్తబ్దుగా బీజేపీ 

కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మరింత యాక్టివ్ గా ఉండాల్సిన ఏపీ బీజేపీ ఇప్పుడు స్తబ్దుగా మారిపోయింది. పార్టీ మెంబర్ షిప్ డ్రైవ్ చేపట్టారు కానీ...ట్రాక్ లోకి తీసుకెళ్లడానికి నేతలు ఎవరూ పెద్దగా ఆసక్తి చూపించలేదు. అందుకే అటూ ఇటూ కాకుండా ఉండిపోయింది. ఎంపీగా ఉన్న పురందేశ్వరి ఇతర బాధ్యతలతో తీరిక లేకండా ఉన్నారు. ఈ కారణంగా కొత్త బీజేపీ అధ్యక్షుడ్ని ఏపీకి నియమిస్తారన్న ప్రచారం జరుగుతోంది. అలాంటి మార్పలు ఏమైనా వచ్చి.. అందరకీ ప్రాధాన్యం ఇస్తే తప్ప ఏపీ బీజేపీలో ఇప్పుడల్లా కదలికలు ఉండే అవకాశం లేదని అనుకోవచ్చు.   

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jagan Tirumala Tour: రిజిస్టర్ లో సంతకం పెట్టాలని టీడీపీ, జనసేన డిమాండ్- జగన్ తిరుమల టూర్ వివాదం అవుతుందా?
రిజిస్టర్ లో సంతకం పెట్టాలని టీడీపీ, జనసేన డిమాండ్- జగన్ తిరుమల టూర్ వివాదం అవుతుందా?
IPS Transfers: ఏపీలో 16 మంది ఐపీఎస్‌‌ల బదిలీ - సీఐడీ ఐజీగా వినీత్ బ్రిజ్ లాల్, ఇంటెలిజెన్స్ ఐజీగా రామకృష్ణ
ఏపీలో 16 మంది ఐపీఎస్‌‌ల బదిలీ - సీఐడీ ఐజీగా వినీత్ బ్రిజ్ లాల్, ఇంటెలిజెన్స్ ఐజీగా రామకృష్ణ
Devara OTT: దేవర ఓటీటీ రిలీజ్... గ్యాప్ ఉంది గురూ, విజయ్ టీమ్ చేసిన తప్పు ఎన్టీఆర్ చేయలేదు!
దేవర ఓటీటీ రిలీజ్... గ్యాప్ ఉంది గురూ, విజయ్ టీమ్ చేసిన తప్పు ఎన్టీఆర్ చేయలేదు!
Karnataka Khir City : రేవంత్ కంటే ఫాస్ట్ గా ఉన్న సిద్ధరామయ్య - గురువారమే బెంగళూరు శివారులో కొత్త ఖిర్ సిటీకి శంకుస్థాపన!
రేవంత్ కంటే ఫాస్ట్ గా ఉన్న సిద్ధరామయ్య - గురువారమే బెంగళూరు శివారులో కొత్త ఖిర్ సిటీకి శంకుస్థాపన!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Donald Trump: ట్రంప్ మావయ్యను ఏసేస్తారా? ఎందుకురా ఇంత స్కెచ్చేశారు?Nirmal News: చెట్టులో వెలిసిన దుర్గామాత, చీరకట్టి పసుపు కుంకుమతో పూజలుMahabubnagar News: ఈ వాగు దాటాలంటే సాహసం అనే చెప్పాలిHarsha Sai: న్యూ*డ్ వీడియోలతో హర్షసాయి వేధింపులు - ఇన్‌స్టాలో క్లారిటీ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jagan Tirumala Tour: రిజిస్టర్ లో సంతకం పెట్టాలని టీడీపీ, జనసేన డిమాండ్- జగన్ తిరుమల టూర్ వివాదం అవుతుందా?
రిజిస్టర్ లో సంతకం పెట్టాలని టీడీపీ, జనసేన డిమాండ్- జగన్ తిరుమల టూర్ వివాదం అవుతుందా?
IPS Transfers: ఏపీలో 16 మంది ఐపీఎస్‌‌ల బదిలీ - సీఐడీ ఐజీగా వినీత్ బ్రిజ్ లాల్, ఇంటెలిజెన్స్ ఐజీగా రామకృష్ణ
ఏపీలో 16 మంది ఐపీఎస్‌‌ల బదిలీ - సీఐడీ ఐజీగా వినీత్ బ్రిజ్ లాల్, ఇంటెలిజెన్స్ ఐజీగా రామకృష్ణ
Devara OTT: దేవర ఓటీటీ రిలీజ్... గ్యాప్ ఉంది గురూ, విజయ్ టీమ్ చేసిన తప్పు ఎన్టీఆర్ చేయలేదు!
దేవర ఓటీటీ రిలీజ్... గ్యాప్ ఉంది గురూ, విజయ్ టీమ్ చేసిన తప్పు ఎన్టీఆర్ చేయలేదు!
Karnataka Khir City : రేవంత్ కంటే ఫాస్ట్ గా ఉన్న సిద్ధరామయ్య - గురువారమే బెంగళూరు శివారులో కొత్త ఖిర్ సిటీకి శంకుస్థాపన!
రేవంత్ కంటే ఫాస్ట్ గా ఉన్న సిద్ధరామయ్య - గురువారమే బెంగళూరు శివారులో కొత్త ఖిర్ సిటీకి శంకుస్థాపన!
Chandrababu : బెజవాడ ప్రజలకు సాయం చేసింది ప్రజలే - రూ. 400 కోట్లు విరాళాలు !
బెజవాడ ప్రజలకు సాయం చేసింది ప్రజలే - రూ. 400 కోట్లు విరాళాలు !
Sobhita Dhulipala: నాగచైతన్యతో పెళ్లి, పిల్లల గురించి ఓపెన్‌గా మాట్లాడిన శోభితా ధూళిపాళ
నాగచైతన్యతో పెళ్లి, పిల్లల గురించి ఓపెన్‌గా మాట్లాడిన శోభితా ధూళిపాళ
KTR About Devara: మేం అధికారంలో ఉంటే ఎన్టీఆర్ కి ఆ కష్టాలు ఉండేవా? - దేవర మూవీపై కేటీఆర్
మేం అధికారంలో ఉంటే ఎన్టీఆర్ కి ఆ కష్టాలు ఉండేవా? - దేవర మూవీపై కేటీఆర్
Tirumala Laddu: ప్రాయశ్చిత్తానికి పోటీగా పాప ప్రక్షాళణ- ఈనెల 28న వైసీపీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్త పూజలు
ప్రాయశ్చిత్తానికి పోటీగా పాప ప్రక్షాళణ- ఈనెల 28న వైసీపీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్త పూజలు
Embed widget