అన్వేషించండి

AP BJP: ఏపీ బీజేపీలో అంతర్గత కుమ్ములాట, మళ్లీ బయటపడ్డ లుకలుకలు! ఫిర్యాదుల వెల్లువ?

కేంద్రమంత్రి, ఏపీ బీజేపీ వ్యవహారాల ఇంచార్జ్‌ మురళీధరన్‌ కు ఫిర్యాదులు వెల్లువెత్తినట్లు తెలుస్తోంది. అయితే ఈ సమావేశం ముగిశాక మాత్రం ఆయన ఏ మాట మాట్లాడకుండా వెళ్లిపోయారు.

Internal Differences in AP BJP Leaders: ఏపీ భారతీయ జనతాపార్టీలో అంతర్గత కుమ్ములాటలు మరోసారి తెరపైకి వచ్చాయి.. గతంలో నెల్లూరు సమావేశం కేంద్రంగా బట్టబయలైన విభేదాలు చల్లార్చిన పార్టీ పెద్దలు త్వరలోనే రాజమండ్రిలో జరిగే సమావేశంలో పరిశీలిస్తాం.. అని ఆనాడు చక్కబెట్టగా ఆరోజూ రాగానే పలువురు అసంతృప్తితో రగిలిపోతున్న నాయకులు రాజమండ్రికి రెక్కలు కట్టుకుని వాలిపోయారు. కేంద్రమంత్రి, ఏపీ బీజేపీ వ్యవహారాల ఇంచార్జ్‌ మురళీధరన్‌ కు ఫిర్యాదులు వెల్లువెత్తినట్లు తెలుస్తోంది. అయితే ఈ సమావేశం ముగిశాక మాత్రం ఆయన ఏ మాట మాట్లాడకుండా వెళ్లిపోయారు. ఇదిలా ఉంటే కేంద్రమంత్రి, ఏపీ వ్యవహారాల ఇంచార్జ్‌ రాజమండ్రి వస్తే ఆ సమయంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మాత్రం కడప పర్యటనలో ఉండిపోయారు.

ఏపీ అధ్యక్షుడు వీర్రాజుపై పెరుగుతోన్న వ్యతిరేక స్వరం

AP BJP President Somu Veerraju: ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుపై రోజు రోజుకూ వ్యతిరేక వర్గం స్వరం పెంచుకుంటూ వస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే పార్టీ ముఖ్యనేత కన్నా లక్ష్మీనారాయణ పార్టీని వీడి తెలుగుదేశంలో చేరారు. ఇదిలా ఉంటే కన్నా వెన్నంటి ఉన్న పార్టీలోని నాయకులు తమ స్వరాన్ని బాగా పెంచుతున్నారు. పార్టీ సీనియర్‌ నాయకుడు దారా సాంబయ్య పార్టీలో దళితులకు, మైనార్టీలకు ఏ మాత్రం ప్రాముఖ్యం ఇవ్వడం లేదని  ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. తూర్పుగోదావరి జిల్లా నూతన కమిటీ నియామకంతో అసంతృప్తి జ్వాలలు మరింత పెరిగాయి. ఇక్కడ ఏకపక్ష ధోరణిలో పదవులు జరిగాయని, ఈ నేపథ్యంలో పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న అడబాల రామకృష్ణారావు తన పదవికి రాజినామా చేశారు. ఇదిలా ఉంటే ఒక్క తూర్పుగోదావరి జిల్లాలోనే కాక అటు కాకినాడ, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలోని ప్రస్తుతం బీజేపీ నాయకత్వం రెండు వర్గాలుగా చీలి అంతర్గత పోరు తారాస్థాయికి చేరిందన్న మాటలు వినిపిస్తున్నాయి.

కొన్ని వర్గాలకు ప్రాధాన్యం ఇవ్వడం లేదంటూ..

రాజమండ్రిలో పార్టీ సమావేశం నిర్వహించిన ఏపీ వ్యవహారాల ఇంచార్జి మురళీధరన్‌కు అనేక ఫిర్యాదులు పార్టీ శ్రేణుల నుంచి వెల్లువెత్తినట్లు తెలుస్తోంది. ఇతర జిల్లాల నుంచి కూడా రాజమండ్రికి పలువురు నేతలు వచ్చి రాష్ట్ర నాయకత్వంపై అనేక ఆరోపణలు చేస్తూ ఫిర్యాదులు చేసినట్లు తెలుస్తోంది. ఇదంతా ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజుపైనే అనేక ఆరోపణలు చేస్తూ వచ్చిన ఫిర్యాదులు అని తెలుస్తోంది. అయితే వీర్రాజుకు మద్దతుగా మరికొంత మంది నాయకులు వచ్చి మురళీధరన్‌కు పలు ఆర్జీలు సమర్పించారు.

కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి..

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజావ్యతిరేక కార్యక్రమాలను కూడా ప్రజలకు వివరించాలని కేంద్ర విదేశాంగ, పార్లమెంటరీ వ్యవహారాలశాఖ సహాయ మంత్రి మురళీధరన్‌ సూచించారు. జిల్లా కోర్‌ కమిటీ, పదాధికారులు, అసెంబ్లీ కన్వీనర్లు, తదితర విభాగాల నాయకులతో సమావేశం నిర్వహించిన ఆయన పార్టీని గ్రామాల్లోని బూత్‌ స్థాయి నుంచి బలోపేతం చేసేందుకు కృషి చేయాలని సూచించారు.

టాప్ హెడ్ లైన్స్

Gen Z Protests: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో కేంద్రం డిఫెన్స్ - జెన్-జీ ఉద్యమం, రాహుల్ దూకుడు -బీజేపీకి టెన్షన్
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో కేంద్రం డిఫెన్స్ - జెన్-జీ ఉద్యమం, రాహుల్ దూకుడుతో ఢిల్లీ రాజకీయం హీట్!
Telangana Cabinet Expansion Postponed: తెలంగాణ కేబినెట్ విస్తరణకు రేవంత్ సర్కార్ బ్రేక్ - ఢిల్లీలో హైకమాండ్ క్లాస్.. ఆశావహులకు నో గ్రీన్ సిగ్నల్!
తెలంగాణ కేబినెట్ విస్తరణకు రేవంత్ సర్కార్ బ్రేక్ - ఢిల్లీలో హైకమాండ్ క్లాస్.. ఆశావహులకు నో గ్రీన్ సిగ్నల్!
Harish Rao Padayatra : హరీశ్ రావు పాదయాత్ర సక్సెస్ - బీఆర్ఎస్‌లో నాయకత్వ సమరం.. కేటీఆర్ vs హరీశ్ వ్యూహాత్మక ఆధిపత్య పోరేనా?
హరీశ్ రావు పాదయాత్ర సక్సెస్ - బీఆర్ఎస్‌లో నాయకత్వ సమరం.. కేటీఆర్ vs హరీశ్ వ్యూహాత్మక ఆధిపత్య పోరేనా?
Kurnool High Court Bench: కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ - లోకేష్ ప్రకటన - సాధ్యమేనా?
కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ - లోకేష్ ప్రకటన - సాధ్యమేనా?

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Visakhapatnam Trolley Bag Murder : పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
Ram Gopal Varma : ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?
ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?
"మావిగన్" కి పోటీగా "అవిగన్" చంద్రబాబు మనసులో ఏముంది
Panchadarla Land Issue: పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం సీరియస్‌- అనకాపల్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సస్పెండ్‌
పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం సీరియస్‌- అనకాపల్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సస్పెండ్‌
90% Gen Z కి తెలియని మహాభారతం సీక్రెట్స్ ! 7 Lessons to Win in Life
90% Gen Z కి తెలియని మహాభారతం సీక్రెట్స్ ! 7 Lessons to Win in Life
Jamuna Rani : లెజెండరీ సింగర్ జమునా రాణి కన్నుమూత - తెలుగు సహా ఇతర భాషల్లో 6 వేలకు పైగా పాటలు
లెజెండరీ సింగర్ జమునా రాణి కన్నుమూత - తెలుగు సహా ఇతర భాషల్లో 6 వేలకు పైగా పాటలు
India Fertility Rate : భారతదేశంలో తగ్గిపోయిన సంతానోత్పత్తి రేటు.. పిల్లలు కావాలనుకుంటున్నారు కానీ..
భారతదేశంలో తగ్గిపోయిన సంతానోత్పత్తి రేటు.. పిల్లలు కావాలనుకుంటున్నారు కానీ..
Gen Z Protests: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో కేంద్రం డిఫెన్స్ - జెన్-జీ ఉద్యమం, రాహుల్ దూకుడు -బీజేపీకి టెన్షన్
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో కేంద్రం డిఫెన్స్ - జెన్-జీ ఉద్యమం, రాహుల్ దూకుడుతో ఢిల్లీ రాజకీయం హీట్!
Embed widget