By: ABP Desam | Updated at : 11 May 2022 03:20 PM (IST)
మహిళా మంత్రిపై సొంత పార్టీ నేతల దాడుల ఆరోపణలు !
అనంతపురం జిల్లా కల్యాణదుర్గం నియోజవర్గంలో శ్రీకాంత్ రెడ్డి వైఎస్ఆర్‌సీపీ కీలక నేత. ఆయన భార్య కౌన్సిలర్ కూడా. వారికి పురుగు మందుల దుకాణం ఉంది. హఠాత్తుగా ఇద్దరు వ్యక్తులు వచ్చారు. తమకు నకిలీ మందులు అమ్మారంటూ చొక్కా పట్టుకుని కొట్టడం ప్రారంభించారు. దుకాణం బయటకు తీసుకెళ్లి దాడి చేశారు. ఈ దృశ్యాలన్నీ సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.
అంత పట్టపగలు అధికార పార్టీ కౌన్సిలర్ భర్తపై దాడి చేస్తారా..? ఎంత ధైర్యం ? అని చాలా మంది అనుకున్నారు. నిజానికి వారు శ్రీకాంత్ రెడ్డి దుకాణంలో ఎలాంటి పురుగుమందులు కొనలేదు. కేవలం దాడి చేయడానికే వచ్చారు. వారు కూడా అధికార పార్టీ నేతల అనుచరులే. శ్రీకాంత్ రెడ్డి కౌన్సిలర్ భర్త అయితే.. ఆ వచ్చిన వారు మాత్రం మంత్రి ఉషాశ్రీచరణ్ అనుచరులు. మంత్రి అనుచరులుగా అందరికీ తెలిసిన బ్రహ్మసముద్రం మండలం ముప్పలకుంట, కుర్లగుండ గ్రామాలకు చెందిన జాని, వన్నూరుస్వామి దాడికి యత్నించారు తిరిగి మంగళవారం సాయంత్రం ఎరువుల దుకాణానికి వచ్చి నకిలీ మందులు ఇచ్చారని ఆరోపిస్తూ. శ్రీకాంత్ రెడ్డిపై దాడికి పాల్పడ్డారు.
కల్యాణదుర్గంలోని మధు ఫర్టిలైజర్స్ యజమాని శ్రీకాంత్‌రెడ్డి భార్య ఒంటెద్దు ప్రభావతి కళ్యాణదుర్గం మున్సిపాలిటీ 9వ వార్డు కౌన్సిలర్. ఇటీవల మంత్రి ఉషా శ్రీచరణ్, శ్రీకాంత్‌రెడ్డి మధ్య ఆర్థిక లావాదేవీల్లో వివాదం చోటుచేసుకుంది. అప్పు వసూలు కోసం శ్రీకాంత్ రెడ్డి దంపతులు గత నెల 6న మంత్రి ఇంటి వద్ద ఆందోళనకు దిగారు. దీన్ని జీర్ణించుకోలేని మంత్రి, అదే రోజు శ్రీకాంత్‌రెడ్డి బావమరిది రామిరెడ్డిపై మున్సిపల్ కార్యాలయంలో జానీ, వన్నూరుస్వామి అనే వ్యక్తులు చేత దాడి చేయించారని ఆరోపణలు వచ్చాయి. అప్పటి నుంచి మంత్రి, శ్రీకాంత్‌రెడ్డి దంపతుల మధ్య వివాదం మరింత ముదిరింది. ఈ క్రమంలో మరోసారి అదే వ్యక్తులు శ్రీకాంత్ రెడ్డిపై దాడి చేశారు.
శ్రీకాంత్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. కానీ అలా అదుపులోకి తీసుకుని నిందితుల్ని ఇలా వదిలేశారు. మంత్రి సూచనలు మేరకు దాడులకు పాల్పడిన వారితో ఫిర్యాదు చేయించి అట్రాసిటీ కేసులు పెట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని శ్రీకాంత్ రెడ్డి ారోపిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల కోసం ఆమెకు తాము అప్పుగా ఇచ్చిన మొత్తాన్ని తిరిగి ఇవ్వమని కోరడంతో దాడులు చేయిస్తున్నారని అన్నారు. మంత్రి వ్యవహార శైలిపై ఇప్పటికే పార్టీ అధినాయకత్వానికి ఫిర్యాదు చేశామని కౌన్సిలర్ దంపతులు చెబుతున్నారు.
Atmakur Elections : ఆత్మకూరులో పోటీపై తేల్చని పార్టీలు - విక్రమ్ రెడ్డికి ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థేనా ?
3 Years of YSR Congress Party Rule : "మద్యనిషేధ" హామీకి చెల్లు చిటీ - ఆ నిధులతోనే పథకాలు !
3 Years of YSR Congress Party Rule : పార్టీపై జగన్‌కు అదే పట్టు కొనసాగుతోందా ? "ఆ" అసమ్మతి నివురుగప్పిన నిప్పులా ఉందా ?
3 Years of YSR Congress Party Rule : సంక్షేమం సూపర్ - మరి అభివృద్ధి ? మూడేళ్ల వైఎస్ఆర్‌సీపీ పాలనలో సమ ప్రాథాన్యం లభించిందా ?
Modi Tour Twitter Trending : మోదీ టూర్‌పై టీఆర్ఎస్, బీజేపీ ఆన్లైన్, ఆఫ్‌లైన్ వార్ - పాలిటిక్స్ అంటే ఇట్లుంటది మరి !
KCR Comments In Bengalore : రెండు, మూడు నెలల్లో సంచలన వార్త - మార్పును ఎవరూ ఆపలేరన్న కేసీఆర్
Ante Sundaraniki: ‘అంటే సుందరానికి’ మేకింగ్, షూటింగ్లో నాని ఫన్‌కు పకపకా నవ్వులు, ఇదిగో వీడియో!
Vivo T2 5G: వివో కొత్త ఫోన్ లాంచ్ వాయిదా - కారణం ఏంటంటే?
IND vs INA, Asia Cup Hockey: ఇండోనేషియాపై టీమిండియా గోల్స్ వర్షం - ఏకంగా 16-0తో విజయం - ఇంటి బాట పట్టిన పాకిస్తాన్!