లడ్డూ మరోసారి పాచిపోయిందా? చంద్రబాబు, పవన్ వరుస భేటీల మర్మం ఏంటి?
చంద్రబాబు, పవన్ వరుస భేటీలతో ఏపీ రాజకీయాలు వేడెక్కాయి. బీజేపీతో పొత్తులో ఉన్న జనసేన టీడీపీ దగ్గరవుతుందని రాజకీయవర్గాలు అంటున్నాయి.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వాడివేడి మీద ఉన్నాయి. జగన్ సర్కార్ ను ఓడించేందుకు ప్రజాస్వామ్య వాదులంతా ఏకం కావాలని చంద్రబాబు గతంలోనే పిలుపునిచ్చారు. అయితే ఇప్పటి వరకు బీజేపీతో పొత్తులో ఉన్న జనసేన టీడీపీకి దగ్గర కావటం చర్చకు దారితీసింది. చంద్రబాబు, పవన్ మరోసారి భేటీ కావటంతో ఇక పొత్తు ఫైనల్ అయ్యిందనే ప్రచారం జరుగుతుంది.
లడ్డూ మరో సారి పాచిపోయిందా?
జనసేన పార్టీ గత ఎన్నికల్లో ఒక్క సీటును మాత్రమే గెల్చుకుంది. ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ సైతం ఓటమి పాలయ్యారు. 2014ఎన్నికల తరువాత పరిణామాలు, 2019 ఎన్నికల తరువాత పరిస్థితులు, రాబోయే 2024 ఎన్నికల ముందు వాతావరణం చాలా భిన్నంగా ఉంది. పొత్తుల విషయంలో ఇప్పటి వరకు రాజకీయ పార్టీలు బహిరంగంగా ప్రకటన చేయకపోయినా, వాటి పనితీరు బట్టి చూస్తుంటే ఎవరెవరు, కలుస్తారనేది క్లారిటీగా కనిపిస్తోంది. అయితే ఈసారి మాత్రం బీజేపీ పరిస్థితి ఇప్పట వరకు ఆగమ్యగోచరంగా మారింది. గతంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజధాని శంకుస్దాపనకు వచ్చిన ప్రధాని ఆ తరువాత ఆంధ్రప్రదేశ్ కు రెండు పాచిపొయిన లడ్డూలు ఇచ్చారంటూ పవన్ ఘాటుగా స్పందించారు. అయితే 2019 ఎన్నికల తరువాత పవన్ బీజేపికి దగ్గరయ్యి, పొత్తు కూడా పెట్టుకున్నారు. దాదాపుగా మూడున్నర సంవత్సరాలు పైగా పవన్ బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. ఇటీవల ప్రధాని మోదీ విశాఖపట్టణం పర్యటన సందర్బంగా, పవన్ కు మోదీతో సమావేశం అయ్యే ఛాన్స్ దొరికింది. ఆ సమావేశం తరవాత పవన్ మీడియాతో మాట్లాడారు. పూర్తి విషయాలు పవన్ మీడియాకు వెల్లడించలేదు. ప్రధానితో భేటీ రాష్ట్రానికి మేలుచేకూరేలా జరిగిందని పవన్ వ్యాఖ్యానించారు. ఆ తరువాత రెండు రోజులకు జనసేన పార్టీ కీలక నేత నాదెండ్ల మనోహర్ కూడా ప్రదానితో పవన్ భేటికి సంబంధించిన అంశంపై వ్యాఖ్యలు చేశారు. ప్రధానితో సమావేశం విషయాలను బయటకు చెప్పాల్సిన అవసరం లేదని, చెప్పాల్సినవి పవన్ చెప్పారంటూ వ్యాఖ్యలు చేశారు. అప్పుడే ఈ వ్యవహరంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరిగింది. ఏదో తేడా కొడుతుందంటూ రాజకీయ నేతలు అనుమానాలు వ్యక్తం చేశారు. అనుకున్నట్లుగానే ఇప్పుడు లడ్డూ మరోసారి పాచిపోయిందని జనసేన చెప్పకనే చెప్పేసిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
చంద్రబాబు,పవన్ వరుస భేటీలు
రెండు నెలల కాలంలో జనసేన అధినేత పవన్, టీడీపీ అధ్యక్షుడు పవన్ రెండుసార్లు భేటీ అయ్యారు. అటు జనసేన తమతో పొత్తులో ఉందని బీజేపీ నేతలు పదే పదే ప్రకటనలు చేస్తుంటే, ఇటువైపున జనసేన నేత పవన్ కళ్యాణ్, చంద్రబాబుతో వరుస భేటీలు నిర్వహించటం కూడా చర్చకు దారితీస్తోంది. దీంతో జనసేన, టీడీపీ పొత్తు కుదిరిందనే ప్రచారం రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. విశాఖపట్టణం వేదికగా పవన్ పై వైసీపీ ప్రభుత్వం నిర్బందంపై చంద్రబాబు విజయవాడలో పవన్ తో సమావేశం అయ్యి, మద్దతు ఇచ్చారు. ఇప్పుడు చంద్రబాబు సభల్లో 11మంది చనిపోవటం, జీవో నెంబర్ వన్ ను వైసీపీ ప్రభుత్వం అమలులోకి తీసుకురావటం పరిణామాలు పవన్ చంద్రబాబును హైదరాబాద్ వేదికగా కలిసి మాట్లాడటం కూడా రాజకీయంగా చర్చకు దారితీస్తోంది.
జనసేన సేఫ్ గేమ్
2019 ఎన్నికల్లో ఊహించని పరాజయాన్ని జనసేన చవిచూపింది. కేవలం ఒక్క సీటు మాత్రమే గెల్చుకుంది. దీంతో రాజకీయంగా మనుగడ సాధ్యం కాదని అంతా అనుకున్నారు. కానీ పవన్ రాజకీయాల్లో నెట్టుకువస్తున్నారు. ఇందులో భాగంగానే పవన్ వ్యూహత్మంగా కేంద్రంలోని బీజేపీతో టచ్ లోకి వెళ్లి పొత్తు పేరుతో ముందుగానే కేంద్ర ప్రభుత్వంతో దోస్తి పెట్టుకున్నారు. దీంతో ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు ఆసక్తిగా మారాయి. అయితే అదే సమయంలో బీజేపీ కూడా అధికార పార్టీ వైసీపీని పరోక్షంగా దగ్గరకు తీసుకుంది. ఇక మిగిలింది టీడీపీ..దీంతో రాష్ట్రంలో అధికార పక్షంలో ఉన్న వైసీపీ నుంచి జనసేనకు అంతగా వేధింపులు టచ్ కాలేదు.వైసీపీ టార్గెట్ అంతా టీడీపీ పైనే పెట్టింది. సో జనసేన ఇన్నాళ్లు సేఫ్ గేమ్ ఆడిందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.