అన్వేషించండి

CJP election boycott call: సీజేపీ దీప్కే సలహా - విపక్షాలు ఎన్నికలు బహిష్కరిస్తే ఏం జరుగుతుంది?

Abhijeet Dipke : తమ ఓటములకు ఎన్నికల సంఘమే కారణమంటున్న విపక్షాలకు సీజేపీ ఫౌండర్ అభిజిత్ దీప్కే సంచలన సలహా. ఎన్నికలను బహిష్కరించాలన్నారు. మరి విపక్షాలు ఎన్నికలు బహిష్కరిస్తే ఏం జరుగుతుంది?

 What if opposition boycotts elections in India:  భారత ఎన్నికల సంఘం నిష్పాక్షికతపై విపక్ష కూటమి గురిపెట్టిన విమర్శల బాణాలు ఇప్పుడు సరికొత్త రాజకీయ చర్చకు దారితీశాయి. ఓటర్ల జాబితాలో అక్రమ తొలగింపులు   జరిగాయని, తమ ఓటములకు ఎన్నికల మేనేజ్‌మెంట్‌ , వ్యవస్థల లోపాలే కారణమని కాంగ్రెస్ సహా విపక్ష కూటమి పార్టీలు తీవ్రంగా ఆరోపిస్తున్నాయి. ఇదే క్రమంలో సీజేపీ   ఫౌండర్ అభిజిత్ దీప్కే చేసిన  ఎన్నికలను పూర్తిగా బహిష్కరించాలి అనే పిలుపు దేశ రాజధానితో పాటు జాతీయ రాజకీయాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది.

ఎన్నికలు బహిష్కరణ డిమాండ్ 

సోషల్ మీడియా వేదికగా విపక్షాలకు ఘాటైన ప్రశ్నలు సంధించిన అభిజిత్ దీప్కే..  ఎన్నికల వ్యవస్థ మేనేజ్‌మెంట్ అవుతోందని భావిస్తున్నప్పుడు, మళ్లీ అవే ఎన్నికల్లో ఎందుకు పాల్గొంటున్నారు  అని నిలదీశారు. విపక్షాలు కేవలం తమకు అనుకూలంగా ఫలితాలు రాని రాష్ట్రాల్లోనే కేకలు వేస్తూ, కొన్ని గెలిచిన స్థానాలను చూపిస్తూ ఆ సంతృప్తితోనే సంతృప్తి చెందుతున్నాయని ఆయన ఎద్దేవా చేశారు. కొన్ని సీట్లను గెలిపించి విపక్షాలను  మాయ  చేస్తున్నారని, మిగతా వ్యవస్థనంతా అధికార పార్టీ ఖాతాలో వేస్తున్నారని ఆరోపించిన దీప్కే, ఇలాంటి ప్రక్రియలో పాల్గొనడం అంటే అక్రమ వ్యవస్థకు మీరే  రాజ్యాంగబద్ధమైన చెల్లుబాటు ఇచ్చినట్లే అవుతుందని హెచ్చరించారు.

ఎన్నికలను బహిష్కరించడం అసాధ్యం

అయితే, అభిజిత్ దీప్కే ఇచ్చిన  ఎన్నికల బహిష్కరణ  సలహాను ఇండియా కూటమి లేదా ఇతర విపక్షాలు ఆచరణలో పాటిస్తాయా? అన్నది పెద్ద ప్రశ్న. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం.. విపక్షాలు ఎన్నికలను పూర్తిగా బహిష్కరించడం దాదాపు అసాధ్యం. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఎన్నికలను బహిష్కరిస్తే పొలిటికల్ స్పేస్ నుండి పూర్తిగా తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఉందనే భయం ప్రతి రాజకీయ పార్టీకి ఉంటుంది. బరిలో లేకపోతే క్షేత్రస్థాయిలో పార్టీ కేడర్ చెల్లాచెదురై, పార్టీ ఉనికికే ప్రమాదం ఏర్పడుతుందనే ఆందోళన విపక్ష నాయకుల్లో ఉంది.

బహిష్కరించినా ఎన్నికల ప్రక్రియ ఆగిపోదు!

ఒకవేళ ఊహాజనితంగా విపక్షాలన్నీ ఏకమై ఎన్నికలను పూర్తిగా బహిష్కరిస్తే ఏం జరుగుతుంది? అనే కోణాన్ని పరిశీలిస్తే.. రాజ్యాంగ పరంగా ఎన్నికల ప్రక్రియ ఆగిపోదు. విపక్షాలు పోటీలో లేకపోయినా, బరిలో ఉన్న అధికార పార్టీ లేదా స్వతంత్ర అభ్యర్థులే ఏకగ్రీవంగానో లేదా నామమాత్రపు పోలింగ్‌తోనో విజయం సాధిస్తారు. దీనివల్ల అధికార పార్టీ మరింత సులువుగా, ఎలాంటి ప్రతిఘటన లేకుండా అధికారాన్ని కైవసం చేసుకుంటుంది. రాజ్యాంగబద్ధంగా ప్రభుత్వం ఏర్పాటు అవుతుంది తప్ప, ప్రజాస్వామ్యబద్ధంగా విపక్షాలకు ఎటువంటి ప్రయోజనం కలగదు.

విపక్షాలదే చాయిస్ 

విపక్షాల బహిష్కరణ వల్ల ప్రభుత్వానికి సిద్ధాంతపరంగా, అంతర్జాతీయంగా తీవ్ర ఎదురుదెబ్బ తగులుతుంది. దేశంలో  ఏకపక్ష ప్రజాస్వామ్యం నడుస్తోందనే ముద్ర పడటంతో పాటు, ఎన్నికల విశ్వసనీయతపై ప్రపంచ దేశాల్లో, గ్లోబల్ మీడియాలో తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతాయి. ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందనే సందేశం ప్రజల్లోకి బలంగా వెళ్తుంది. ఇది భారీ ప్రజా ఉద్యమాలకు, తీవ్ర అంతర్గత అశాంతికి దారితీసే అవకాశం ఉందనడంలో సందేహం లేదు.  ప్రస్తుతానికి విపక్షాలు ఎన్నికలను బహిష్కరించే దిశగా కాకుండా.. ఎన్నికల సంఘంపై లీగల్ పోరాటం చేయడం, ఇంటర్నల్ రివిజన్‌లను అడ్డుకోవడం, మరియు అక్టోబర్ 2 నుంచి సీజేపీ చేపట్టే నిరసనలకు మద్దతిస్తూ రోడ్లపైకి వచ్చి పోరాడే వ్యూహాలనే ఎంచుకునే అవకాశం కనిపిస్తోంది.  గేమ్ ఫిక్స్ అయిందని ప్రచారం చేస్తూనే, ఆ గేమ్‌లోనే ఆడటం వల్లే అధికార పక్షానికి లబ్ధి చేకూరుతోంది  అన్న దీప్కే వ్యాఖ్యలు విపక్షాలను ఒక ధర్మసంకటంలో పడేశాయనడంలో సందేహం లేదు. 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Renuka Chowdhury at ABP Summit: దక్షిణాది వారితో టోకనిజం చేయవద్దు.. ప్రధాని మోదీ, ఎన్నికల సంఘంపై కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి సంచలన వ్యాఖ్యలు!
దక్షిణాది వారితో టోకనిజం చేయవద్దు.. ప్రధాని మోదీ, ఎన్నికల సంఘంపై కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి సంచలన వ్యాఖ్యలు!
Asaduddin Owaisi at ABP Summit: ఆజం ఖాన్ హైదరాబాదీ బిర్యానీ వ్యాఖ్యలకు ఓవైసీ ఘాటు కౌంటర్.. అఖిలేష్ యాదవ్, ఇండియా కూటమిపై నిప్పులు చెరిగిన మజ్లిస్ అధినేత!
ఆజం ఖాన్ హైదరాబాదీ బిర్యానీ వ్యాఖ్యలకు ఓవైసీ ఘాటు కౌంటర్.. అఖిలేష్ యాదవ్, ఇండియా కూటమిపై నిప్పులు చెరిగిన మజ్లిస్ అధినేత!
KTR Speech ABP Southern Rising Summit 2026 : రేవంత్ రెడ్డి వన్ టైమ్ వండర్ లీడర్.. తెలంగాణ కా బాద్షా కేసీఆర్ మాత్రమే! ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్‌లో కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
రేవంత్ రెడ్డి వన్ టైమ్ వండర్ లీడర్.. తెలంగాణ కా బాద్షా కేసీఆర్ మాత్రమే! ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్‌లో కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
Telangana Education Reforms: ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి విద్య, తెలంగాణలో ఆక్స్‌ఫర్డ్, హార్వర్డ్ క్యాంపస్‌లు- ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్‌లో సీఎం రేవంత్ రెడ్డి విద్యారంగ విజన్!
ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి విద్య, తెలంగాణలో ఆక్స్‌ఫర్డ్, హార్వర్డ్ క్యాంపస్‌లు- ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్‌లో సీఎం రేవంత్ రెడ్డి విద్యారంగ విజన్!
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Movie Piracy Gang Arrest: సినిమా పైరసీ ముఠా గుట్టురట్టు.. ఇద్దరు విద్యార్థులను అరెస్ట్ చేసిన TGCSB పోలీసులు!
సినిమా పైరసీ ముఠా గుట్టురట్టు.. ఇద్దరు విద్యార్థులను అరెస్ట్ చేసిన TGCSB పోలీసులు!
Reliance Beverage Plant: 12 నెలల్లోనే పనులు పూర్తి.. రాయలసీమ గడ్డ నుంచి ప్రపంచ మార్కెట్లకు కాంపా కోలా- మంత్రి లోకేశ్
12 నెలల్లోనే పనులు పూర్తి.. రాయలసీమ గడ్డ నుంచి ప్రపంచ మార్కెట్లకు కాంపా కోలా- మంత్రి లోకేశ్
Union Minister Kishan Reddy On Drugs: హైదరాబాద్‌లో విచ్చలవిడిగా డ్రగ్స్‌.. టెర్రాస్‌లపై గంజాయి సాగు- కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
హైదరాబాద్‌లో విచ్చలవిడిగా డ్రగ్స్‌.. టెర్రాస్‌లపై గంజాయి సాగు- కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
Job Fraud: మంత్రి పేషీ పేరుతో ఉద్యోగాల దందా.. నలుగురి వద్ద రూ.50 లక్షలు వసూలు చేసిన నకిలీ ఓఎస్డీ!
మంత్రి పేషీ పేరుతో ఉద్యోగాల దందా.. నలుగురి వద్ద రూ.50 లక్షలు వసూలు చేసిన నకిలీ ఓఎస్డీ!
Rukmini Kota Vs Nagarjuna Yadav: ఆధారాలు చూపకపోతే రూ.10 కోట్ల దావా.. నాగార్జున యాదవ్‌కు రుక్మిణి కోటా అల్టిమేటం
ఆధారాలు చూపకపోతే రూ.10 కోట్ల పరువు నష్టం దావా.. నాగార్జున యాదవ్‌కు రుక్మిణి కోటా అల్టిమేటం
CM Chandrababu: ఎన్నిక ఏదైనా విజయం కూటమిదే.. పరిషత్ ఎన్నికల్లో 96.4 శాతం స్ట్రైక్ రేట్: సీఎం చంద్రబాబు
ఎన్నిక ఏదైనా విజయం కూటమిదే.. పరిషత్ ఎన్నికల్లో 96.4 శాతం స్ట్రైక్ రేట్: సీఎం చంద్రబాబు
Consumer Loan: దీపావళికి భారత్‌లో ప్రతి 100 లోన్లలో 74 మంది ఏం కొన్నారో తెలుసా.. ఆ విషయంలో తెలంగాణ టాప్
దీపావళికి భారత్‌లో ప్రతి 100 లోన్లలో 74 మంది ఏం కొన్నారో తెలుసా.. ఆ విషయంలో తెలంగాణ టాప్
UP CM Yogi Tears: తల్లికి చివరి వీడ్కోలు.. భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్న UP CM యోగి ఆదిత్యనాథ్
తల్లికి చివరి వీడ్కోలు.. భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్న UP CM యోగి ఆదిత్యనాథ్
Embed widget