అన్వేషించండి

Jagan Review : వైఎస్ఆర్‌సీపీలోనూ వాలంటీర్ తరహా వ్యవస్థ - ప్రతి యాభై ఇళ్లకు ఓ నేతను పెట్టాలని జగన్ నిర్ణయం !

ఏపీలో ప్రతి యాభై ఇళ్లకు ఓ వైఎస్ఆర్‌సీపీ ప్రతినిధిని వాలంటీర్ తరహాలో పెట్టనున్నారు. పరిశీలకులతో జరిపిన భేటీలో జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు.

Jagan Review : వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ 175 నియోజకవర్గాలకు 175 మంది పరిశీలకుల్ని నియమించారు. వీరందరితో తాడేపల్లిలోని క్యాంప్ ఆఫీసులో సమావేశమయ్యారు. ప్రభుత్వం తరపున ప్రతి యాభై ఇళ్లకు ఓ వాలంటీర్‌ను పెట్టినట్లుగా.. పార్టీ తరపున కూడా ఓ వ్యవస్థను ఏర్పాటు చేయాలని.. ప్రతీ ఇంటికీ పార్టీ ప్రతినిధి ఉండేలా చూసుకోవాలని జగన్ పరిశీలకుల్ని ఆదేశించారు. పార్టీ అభ్యర్థులను గెలిపించాల్సిన బాధ్యత పరిశీలకులపైనే ఉందని జగన్ స్పష్టం చేశారు.  

పార్టీ తరపున ప్రతి యాభై ఇళ్లకు ఓ వాలంటీర్  

నియోజకవర్గాలకు పరిశీలకుల నియామకం వైసీపీలో తీవ్ర చర్చకు దారితీసింది. కొంత మంది ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే స్దానిక ఎమ్మెల్యేలు,ఇంచార్జ్ ల పనితీరును మెరుగు పరచేందుకు పరిశీలకుల నియామకం దోహదపడుతుందని ..జగన్ తన అభిప్రాయాన్ని పార్టీ వర్గాలకు స్పష్టం చేశారు.  175 నియోజకవర్గాలకు పరిశీలకును నియమించిన తరువాత జగన్ తొలి సారిగా సమావేశం నిర్వహించారు. జిల్లా అధ్యక్షులు ,రీజినల్ కోఆర్డినేటర్లు,  పరిశీలకులతో  జగన్ సుదీర్ఘంగా సమావేశం నిర్వహించారు. 

పనితీరు మెరుగుపర్చుకోవాలని ఎమ్మెల్యేలు, ఇంచార్జులకు జగన్ ఆదేశం

జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తరువాత వాలంటీర్ వ్యవస్దను అందుబాటులోకి తీసుకువచ్చింది. వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రభుత్వ కార్యకలాపాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళటంలో జగన్ ప్రభుత్వం సక్సెస్ అయ్యిందనే అభిప్రాయం ఆ పార్టీలో ఉంది.  పార్టీ పరిశీలకులు, జిల్లా అధ్యక్షుల సమావేశంలో  పార్టీ తరపున కూడా వాలంటీర్ వ్యవస్ద తరహాలోనే ప్రతి 50 ఇళ్ళకు పార్టీ తరపున ఒకరిని నియమించాలని జగన్  ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే ఎన్నికల ప్లేవర్ ఎపీ రాజకీయాల్లో వచ్చేయటంతో ఆ దిశగా అవసరం అయిన అన్ని చర్యలను తీసుకోవాలని అన్నారు. ఎపీ లోని అన్ని నియోజకవర్గాల్లో పార్టీని మండల, గ్రామ స్దాయిలో పూర్తిగా పటిష్టపరచటం ,శాసన సభ్యులు, ఇంచార్జ్ లు పని తీరును మెరుగుపరుకోవాల్సిన అవసరం ఉందని ఇప్పటికే జగన్ ఆదేశాలు ఇచ్చారు. 
  

పార్టీ కోసం ఎక్కువ సమయం కేటాయిస్తున్న సీఎం జగన్ 

నియోజకవర్గాల వారీగా  పరిశీలకుల నియామం తరువాత జగన్ ప్రత్యేకంగా పార్టీ అంశాలకు ఎక్కువ సమయాన్ని కేటాయిస్తున్నారు.ఇప్పటికే చాలా సభల్లో జగన్ ఎన్నికలకు సంబంధించిన అంశాలను గురించి ప్రస్తావిస్తున్నారు. ఎన్నికలకు ఎన్ని నెలలు ఉంది అన్న విషయాలను జగన్ ప్రతి సభలో   గుర్తు చేస్తున్నారు.  పార్టీ నేతలంతా గడపకు ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించాలని జగన్ ఆదేశించడంతో ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తున్నారు.  వారి పనితీరును ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నారు. సర్వేల  ద్వారా పనితీరుకు సంబందించిన రిపోర్ట్ లను తీసుకొని ఆయా నియోజకవర్గాలకు చెందిన నేతలను అప్రమత్తం చేస్తున్నారు.  గత ఏడాది నుంచి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల గురించి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో  గెలవాలని.. పార్టీ నేతకు దిశానిర్దేశం చేస్తున్నారు. 175 సీట్లను లక్ష్యంగా పెట్టుకోవాలని ఆదేశిస్తున్నారు. 

మళ్లీ వైఎస్ఆర్‌సీపీ , టీఆర్ఎస్ డ్రామా స్టార్ట్ - సజ్జల సమైక్యవాదంపై ఏపీ బీజేపీ సెటైర్ !

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad News: హైదరాబాద్‌లో ఐటీ సోదాల కలకలం-   చట్నీస్‌ హోటల్స్‌ ఓనర్‌పై ఫోకస్
హైదరాబాద్‌లో ఐటీ సోదాల కలకలం- చట్నీస్‌ హోటల్స్‌ ఓనర్‌పై ఫోకస్
Elections Commission News: ఎన్నికల్లో అక్రమాలు జరిగితే ఈల వేసి అధికారులను పిలవండి- మీ చేతిలోనే పవర్‌ అస్త్ర
ఎన్నికల్లో అక్రమాలు జరిగితే ఈల వేసి అధికారులను పిలవండి- మీ చేతిలోనే పవర్‌ అస్త్ర
SS Rajamouli: ఎన్టీఆర్ క్యారెక్టర్ మార్చిన రాజమౌళి - 'ఆర్ఆర్ఆర్'ను అలా తీస్తే ఎలా ఉండేదో?
ఎన్టీఆర్ క్యారెక్టర్ మార్చిన రాజమౌళి - 'ఆర్ఆర్ఆర్'ను అలా తీస్తే ఎలా ఉండేదో?
Sriram: అప్పుడు భూమిక పారిపోయింది, కత్తి ఉంటే తనని పొడిచేసేవాడిని - శ్రీరామ్
అప్పుడు భూమిక పారిపోయింది, కత్తి ఉంటే తనని పొడిచేసేవాడిని - శ్రీరామ్
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

MS Dhoni IPL 2024 Retirement | మహేంద్ర సింగ్ ధోనికి ఇదే లాస్ట్ ఐపీఎల్ సీజనా.? | ABP DesamSRH Captain Pat Cummins IPL 2024 | కమిన్స్ రాకతోనైనా ఆరెంజ్ ఆర్మీ ఆకట్టుకుంటుందా.? | ABP DesamPinkvilla Screen And Style Awards: ముంబయిలో ఘనంగా జరిగిన అవార్డుల వేడుక, విభిన్న డ్రెస్సుల్లో తారలుRajamouli Mahesh Babu Movie: జపాన్ లో RRR స్క్రీనింగ్స్ సందర్భంగా మహేష్ మూవీ అప్డేట్ ఇచ్చిన జక్కన్న

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad News: హైదరాబాద్‌లో ఐటీ సోదాల కలకలం-   చట్నీస్‌ హోటల్స్‌ ఓనర్‌పై ఫోకస్
హైదరాబాద్‌లో ఐటీ సోదాల కలకలం- చట్నీస్‌ హోటల్స్‌ ఓనర్‌పై ఫోకస్
Elections Commission News: ఎన్నికల్లో అక్రమాలు జరిగితే ఈల వేసి అధికారులను పిలవండి- మీ చేతిలోనే పవర్‌ అస్త్ర
ఎన్నికల్లో అక్రమాలు జరిగితే ఈల వేసి అధికారులను పిలవండి- మీ చేతిలోనే పవర్‌ అస్త్ర
SS Rajamouli: ఎన్టీఆర్ క్యారెక్టర్ మార్చిన రాజమౌళి - 'ఆర్ఆర్ఆర్'ను అలా తీస్తే ఎలా ఉండేదో?
ఎన్టీఆర్ క్యారెక్టర్ మార్చిన రాజమౌళి - 'ఆర్ఆర్ఆర్'ను అలా తీస్తే ఎలా ఉండేదో?
Sriram: అప్పుడు భూమిక పారిపోయింది, కత్తి ఉంటే తనని పొడిచేసేవాడిని - శ్రీరామ్
అప్పుడు భూమిక పారిపోయింది, కత్తి ఉంటే తనని పొడిచేసేవాడిని - శ్రీరామ్
Home Loan: క్రెడిట్‌ స్కోర్‌ తక్కువున్నా గృహ రుణం, ఈ ఉపాయాలు తెలిస్తే చాలు!
క్రెడిట్‌ స్కోర్‌ తక్కువున్నా గృహ రుణం, ఈ ఉపాయాలు తెలిస్తే చాలు!
South Costal Politics: వైసీపీ కోటలో టీడీపీ పాగా వేసేనా..? రెడ్డిరాజ్యంలో పట్టు నిలుపుకునేదెవరో..?
వైసీపీ కోటలో టీడీపీ పాగా వేసేనా..? రెడ్డిరాజ్యంలో పట్టు నిలుపుకునేదెవరో..?
Manchu Lakshmi: మంచు లక్ష్మి కాళ్లు మొక్కిన అభిమాని - ‘ఆదిపర్వం’ ట్రైలర్ లాంచ్‌లో అనూహ్య ఘటన
మంచు లక్ష్మి కాళ్లు మొక్కిన అభిమాని - ‘ఆదిపర్వం’ ట్రైలర్ లాంచ్‌లో అనూహ్య ఘటన
Rajamouli On SSMB29: మహేష్ బాబు సినిమా అప్డేట్ ఇచ్చిన రాజమౌళి
మహేష్ బాబు సినిమా అప్డేట్ ఇచ్చిన రాజమౌళి
Embed widget