అన్వేషించండి
Nizamabad News: కొత్తగా నిర్మించిన సీహెచ్ కొండూరు ఆలయంలో భక్తిశ్రద్దలతో క్షిరాధివాస వేడుక
సీహెచ్ కొండూరులో ఆలయ జీర్ణోద్ధరణలో భాగంగా శ్రీ రాజ్యలక్ష్మి సమేత నరసింహ స్వామి క్షేత్రంలో మూడోరోజు కార్యక్రమాలు
1/7

నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలం సీహెచ్ కొండూరులో ఆలయ జీర్ణోద్ధరణలో భాగంగా శ్రీ రాజ్యలక్ష్మి సమేత నరసింహ స్వామి క్షేత్రంలో మూడోరోజు ఉదయం ప్రాతఃకాల ఆరాధన వేదవిన్నపాలతో మొదలైన కార్యక్రమాలు ఆధ్యాత్మికత ప్రవాహంలో భక్తులను ముంచెత్తుతున్నాయి.
2/7

నిన్నటి రోజు జలాధివాసంలో ఉంచిన ప్రతిష్టాపనమూర్తులను ఇవాళ క్షీరాధివాసం చేశారు. పాంచరాత్ర ఆగమ శాస్త్ర నియమాల ప్రకారం దాదాపు ద్వాదశ లీటర్ల గోక్షీరాన్ని ఉపయోగించి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. వేలాది భక్తులు భక్తిప్రపత్తులతో సమర్పించిన ఆవు పాలను క్షీరాధివాసంలో ఉపయోగించారు.
Published at : 06 Jun 2022 08:36 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















