అన్వేషించండి
Flipkart Sale Discounts : ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో iPhone 14పై 31 వేల భారీ తగ్గింపు.. మరిన్ని మొబైల్స్పై కూడా
Flipkart Sale Offers on iPhone 14 : iPhone 14పై ధర 30 వేలకు పైగా తగ్గి ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉన్నాయి. అదేకాకుండా వేరే మొబైల్స్పై కూడా మంచి డీల్స్ ఉన్నాయి. అవేంటో చూసేయండి.
ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో iPhone 14పై భారీ తగ్గింపు
1/5

iPhone 14 ఇప్పుడు 128GB, 256GB, 512GB మూడు వేరియంట్లలో లభిస్తుంది. దీని ప్రారంభ ధర 79,900 రూపాయలు. కానీ ఇప్పుడు దీనిని 59,900 రూపాయలకు కొనుగోలు చేయవచ్చు. ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో దీని ధర మరింత తగ్గి 52,990 రూపాయలకు చేరుకుంది.
2/5

అంతేకాకుండా ఎంపిక చేసిన బ్యాంకులపై మరో 4,000 రూపాయల తక్షణ తగ్గింపు కూడా లభిస్తుంది. ఇలా చూస్తే ఐఫోన్ ధర.. ప్రారంభ ధర కంటే దాదాపు 31,000 రూపాయలు తగ్గుతుంది. అలాగే బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్లను కూడా పొందవచ్చు. దీన్ని మీరు 1,863 రూపాయల EMIతో కూడా బుక్ చేసుకోవచ్చు.
3/5

iPhone 14.. 2022లో విడుదలైంది. ఇది 6.1-అంగుళాల Super Retina XDR డిస్ప్లేను కలిగి ఉంది. ఇది క్లాసిక్ నాచ్ డిజైన్‌తో వస్తుంది. దీని వెనుక ప్యానెల్‌లో 12MP డ్యూయల్ కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం ఇందులో 12MP ఫ్రంట్ కెమెరా ఉంది. ఫోన్‌కు A15 Bionic చిప్ శక్తినిస్తుంది. ఇది 6GB RAMతో పని చేస్తుంది. iOS 16లో నడుస్తుంది. iOS 18 వరకు అప్‌గ్రేడ్ చేయవచ్చు.
4/5

అదనంగా ఫ్లిప్‌కార్ట్‌లో Vivo T3 Pro 5G పై కూడా భారీ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఫోన్ 8+128GB వేరియంట్. అసలు ధర 29,999 రూపాయలు కాగా.. ప్రస్తుతం మీరు దీనిని కేవలం 22,999 రూపాయలకు కొనుగోలు చేయవచ్చు. అంతేకాకుండా అనేక బ్యాంక్ ఆఫర్‌లు కూడా ఉన్నాయి. దీనితో మీరు మరింత తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు.
5/5

ఇది మాత్రమే కాదు. OPPO F27 Pro Plus 5G పై కూడా అద్భుతమైన తగ్గింపు లభిస్తుంది. ఈ ఫోన్ 8+256GB వేరియంట్. అసలు ధర 34,999 రూపాయలు. సేల్‌లో కేవలం 24,999 రూపాయలకు కొనుగోలు చేయవచ్చు. అలాగే ఈజీ ఈఎంఐ ఆప్షన్స్‌తో దీనిని బుక్ చేసుకోవచ్చు.
Published at : 24 Aug 2025 07:00 AM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఇండియా
ఆట
ఆధ్యాత్మికం
శుభసమయం
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















