టోక్యో ఒలింపిక్స్‌లో భాగంగా భారత పురుషుల జట్టు సెమీఫైనల్లో బెల్జియంతో తలపడింది.
ఈ మ్యాచ్‌లో భారత్ 2-5 తేడాతో డిఫెండింగ్ ఛాంపియన్ బెల్జియం చేతిలో పోరాడి ఓడింది.
దీంతో భారత పురుషుల హాకీ జట్టు పసిడి ఆశలు గల్లంతయ్యాయి. ఫైనల్ చేరాలన్న కోరిక తీరలేదు.
కాంస్యం కోసం భారత్ మరో మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఆగస్టు 5న భారత్ ఒలింపిక్స్‌లో తన ఆఖరి పోరు ఆడనుంది.
ఈ మ్యాచ్ అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ... కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్‌కు ఫోన్ చేసి మాట్లాడారు.
బాగా ఆడారని, గెలుపోటములు జీవితంలో భాగమని, ఆటగాళ్లను చూసి భారత్ గర్విస్తోందని, కాంస్య పోరులో రాణించాలని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇప్పటి వరకు విశ్వక్రీడల్లో 8 స్వర్ణాలతో సహా 11 పతకాలు భారత్ ఖాతాలో ఉన్నాయి. ఈ జాబితాలో మరో పతకం చేర్చాలని మన్‌ప్రీత్ బృందం ఉవ్విళ్లూరుతోంది.
చివరిగా 1980 మాస్కో ఒలింపిక్స్‌లో భారత్ స్వర్ణ పతకం సాధించింది.
ఈ రోజు సాయంత్రం ఆస్ట్రేలియా X జర్మనీ మధ్య జరిగే మ్యాచ్‌లో ఓడిన జట్టుతో భారత్ కాంస్యం కోసం పోటీపడనుంది.
PBKS vs RCB: మ్యాచ్ ఓడాక.. తొడ గొడుతూ భాంగ్రా స్టెప్పులేసిన కోహ్లీ!
CSK, SRH: వార్నర్‌ను SRH చేసినట్టే జడ్డూను 'సైడ్' చేసేసిన CSK! నెటిజన్ల ఫైర్!
IPL 2022: తండ్రేమో గుజరాత్ కెప్టెన్ కొడుకేమో LSGకి సపోర్ట్! బుల్లి పాండ్య భలే భలే!
IPL 2022, RCB: సన్‌రైజర్స్ మ్యాచులో జెర్సీ మారుస్తున్న ఆర్సీబీ- రీజన్ తెలుసా?
IPL 2022: మిట్ట మధ్యాహ్నం.. 45 డిగ్రీల ఎర్రటెండలో.. ఈ ప్రాక్టీస్ ఏంటి సామీ!!
Parag Agrawal On Twitter Spam: పరాగ్ X మస్క్- స్పామ్ అకౌంట్లపై తగ్గేదేలే అంటూ ట్వీట్ వార్!
Prabhas Project K Update: ప్రభాస్ ఇంట్రడక్షన్ కంప్లీట్ చేశాం, ప్రాణం పెట్టి పని చేస్తున్నాం - నాగ్ అశ్విన్ రిప్లై
AP PCC New Chief Kiran : వైఎస్ఆర్సీపీతో పొత్తు దిశగా ప్లాన్ - ఏపీ పీసీసీ చీఫ్‌గా మాజీ సీఎం !?
Cabs Bundh: అలర్ట్! ఈ నెల 19న క్యాబ్స్ బంద్, ఆటోలు కూడా - పెద్ద ఎత్తున నిరసనలకు పిలుపు