అన్వేషించండి
Kamindu Mendis: ఒక సెంచరీ !ఐదు రికార్డులు -బ్రాడ్‌మన్ సరసన శ్రీలంక యువ క్రికెటర్
Kamindu Mendis: శ్రీలంక క్రికెటర్ కమిందు మెండిస్ అరుదైన ఘనత సాధించాడు. టెస్టుల్లో 80.90 యావరేజ్ కలిగిన రెండో బ్యాటర్‌గా కమిందు మెండిస్ రికార్డు సృష్టించాడు. అగ్ర స్థానంలో బ్రాడ్‌మన్ ఉన్నాడు.

సూపర్ ఫామ్‌తో దూసుకెళ్తున్న శ్రీలంక యంగ్ ప్లేయర్ కమిందు మెండిస్
1/8

శ్రీలంక యువ క్రికెటర్ కమిందు మెండిస్ ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. గాలే వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతోన్న మొదటి టెస్టులో శతకం బాదిన కమిందు ఒకేసారి ఐదు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు.
2/8

పాతికేళ్ల కమిందు మెండిస్ ఇప్పటివరకు ఆడింది ఏడు టెస్టు మ్యాచులు. మొత్తం 11 ఇన్నింగ్స్‌లలో కలిపి చేసినవి 809 పరుగులు. బ్యాటింగ్ సగటు 80.90.
3/8

కమిందు ఆడిన ఏడు టెస్టుల్లో అంటే ప్రతి మ్యాచ్‌లోనూ ఒక్క అర్ధ శతకం అయినా బాదాడు. ఇలా ప్రతి మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ నమోదు చేసిన తొలి శ్రీలంక క్రికెటర్ అతడే.
4/8

శ్రీలంక బ్యాటర్ మెండిస్ 11 ఇన్నింగ్స్‌లో నాలుగు సెంచరీలు నమోదు చేశాడు. క్రికెట్ దిగ్గజం డాన్ బ్రాడ్‌మన్ కూడా తన మొదటి నాలుగు సెంచరీలను 11 ఇన్నింగ్స్‌లలోనే సాధించాడు. దీంతో కమిందు మెండిస్ బ్రాడ్‌మన్ సరసన చేరాడు.
5/8

ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ 2023-25 సీజన్‌లో కనీసం 10 ఇన్నింగ్స్ కన్నా ఎక్కువగా ఆడిన బ్యాటర్లలో కమిందు మెండిస్‌దే అత్యుత్తమ సగటు. ప్రస్తుతం కమిందు సగటు 80.90 . న్యూజిలాండ్ ప్లేయర్ కేన్ విలియమ్సన్ ను మెండిస్ దాటేశాడు.
6/8

ఒకే డబ్ల్యూటీసీ సీజన్‌లో ఎక్కువ శతకాలు బాదిన ఆటగాడిగా ఇప్పటివరకు లంక బ్యాటర్ దిముత్ కరుణరత్నెరికార్డులలో ఉన్నాడు. ఇప్పుడు మెండిస్ అతడితో సమంగా నిలిచాడు.
7/8

2022లో టెస్టు కెరీర్‌ను ప్రారంభించిన మెండిస్ తొలి మ్యాచ్‌లో 61 పరుగులతో ఇన్నింగ్స్ ఆడాడు. 2024లో టెస్టు ఆడే అవకాశం దక్కించుకున్న మెండిస్ బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ సెంచరీ సాధించాడు.
8/8

బంగ్లాదేశ్, ఇంగ్లండ్, న్యూజిలాండ్ వంటి బలమైన జట్లపై మెండిస్ టెస్టు సెంచరీలు సాధించాడు.
Published at : 19 Sep 2024 03:02 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
పాలిటిక్స్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion