అన్వేషించండి
Sharadiya Navratri 2025: దసరా నవరాత్రుల్లో ఈ 5 చిన్న చిట్కాలు పాటించండి! ఆర్థిక, అనారోగ్య సమస్యలు దూరమవుతాయి!
Dussehra 2025: శారదీయ నవరాత్రి 2025 సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు కొనసాగుతుంది. ఈ సమయంలో అమ్మవారి పూజలో భాగంగా ఇవి పాటిస్తే బాధలు తొలగిపోతాయి.
Shardiya Navratri 2025
1/6

శారదీయ నవరాత్రుల తొమ్మిది రోజుల్లో జగత్ జనని ఆదిశక్తి దుర్గాదేవి తొమ్మిది రూపాలను ప్రత్యేకంగా పూజిస్తారు. మొదటి రోజు రాత్రి సమయంలో తల్లికి కాడలతో ఉన్న తమలపాకుల దండను సమర్పించండి. దీనివల్ల ఉద్యోగ సంబంధిత సమస్యలు తొలగిపోతాయని చెబుతారు.
2/6

శారదీయ నవరాత్రిలో శుక్రవారం నాడు పసుపు కొమ్మును ఎర్రటి వస్త్రంలో చుట్టి అమ్మవారి ముందు ఉంచి శ్రీసూక్తం పఠించాలి. తరువాత ఈ కొమ్మును ధన స్థానంలో ఉంచాలి. దీనివల్ల ఆదాయం తగ్గదు అని నమ్మకం.
3/6

నవరాత్రుల సమయంలో ఒక వక్కను పసుపు వస్త్రంలో కట్టి అమ్మవారి పాదాల చెంత సమర్పించండి. ఆపై, త్వరగా వివాహం లేదా మనసుకు నచ్చిన వివాహం కోసం అమ్మవారిని కోరుకోండి. తరువాత వక్కను మీ తలగడ కింద పెట్టుకుని నిద్రించండి. ఇది వివాహంలో వస్తున్న అడ్డంకులను తొలగిస్తుందని చెబుతారు.
4/6

చేపట్టిన పనిలో పదే పదే అడ్డంకి ఇబ్బంది పెడుతుంటే నవరాత్రి సమయంలో ఒక త్రిశూలం తెచ్చి ఇంటి పైకప్పుపై ఉంచండి. వాస్తు శాస్త్రం ప్రకారం త్రిశూలం ఉంచడం వల్ల ప్రతికూల శక్తి ఇంట్లోకి ప్రవేశించదు
5/6

ఇంట్లో ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతుంటే, నవరాత్రి సమయంలో 9 రోజుల పాటు దుర్గామాతకు హారతి ఇచ్చేటప్పుడు దీపంలో రెండు లవంగాలు వేయండి, అలాగే కర్పూరం కూడా వేయండి. దీన్ని ఇంటి మొత్తం తిప్పండి. దీనివల్ల రోగాలు నశిస్తాయి.
6/6

నవరాత్రిలో శని అశుభ ప్రభావాన్ని తగ్గించడానికి మీరు కాళరాత్రి మాతను పూజించవచ్చు. బెల్లం, నువ్వుల నైవేద్యం సమర్పించండి. 'ఓం కాలరాత్రై నమః' మంత్రాన్ని జపించండి
Published at : 16 Sep 2025 09:00 AM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
క్రికెట్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
తెలంగాణ
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion



















