అన్వేషించండి
Wayanad Tragedy: వయనాడ్ పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో చూశారా, ABP దేశం ఎక్స్‌క్లూజివ్ ఫొటోలు
Kerala: వయనాడ్‌లో ప్రకృతి ప్రకోపం సృష్టించిన బీభత్సం నుంచి ఇప్పట్లో ప్రజలు కోలుకునేలా లేరు. ఇళ్లన్నీ ధ్వంసమయ్యాయి. రోడ్లు ఎక్కడికక్కడ చీలిపోయాయి.

వయనాడ్‌లో ప్రకృతి ప్రకోపం సృష్టించిన బీభత్సం నుంచి ఇప్పట్లో ప్రజలు కోలుకునేలా లేరు. ఇళ్లన్నీ ధ్వంసమయ్యాయి. రోడ్లు ఎక్కడికక్కడ చీలిపోయాయి.
1/8

వయనాడ్ విధ్వంసంలో మృతుల సంఖ్య 358కి పెరిగింది. ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాదాపు 300 మంది గల్లంతైనట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. శిథిలాల కింద చాలా మంది చిక్కుకుని ఉన్నారన్న అనుమానంతో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు.
2/8

వయనాడ్‌లో పరిస్థితులపై ABP దేశం గ్రౌండ్ రిపోర్ట్ అందిస్తోంది. మందక్కై, చూరల్‌మల్ ప్రాంతాల్లో ఇళ్లు ఇలా బురదలో చిక్కుకున్నాయి. వరద ప్రవాహాన్ని పూర్తిగా ధ్వంసమయ్యాయి. కొన్ని చోట్ల అయితే అసలు అక్కడ ఇళ్లు ఉన్న దాఖలాలు కూడా లేకుండా చేసింది ఈ విపత్తు.
3/8

వరద ఉద్ధృతికి బలమైన నిర్మాణాలు కూడా కూలిపోయాయి. వాటి స్థానంలో అక్కడ ఇలా బండరాళ్ల ఆనవాళ్లు మాత్రమే మిగిలిపోయాయి. అన్ని చోట్లా మట్టి దిబ్బలే కనిపిస్తున్నాయి.
4/8

మరమ్మతు చేసే అవకాశం కూడా లేని స్థాయిలో ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఇప్పట్లో అసలు కోలుకుంటామో లేదో అని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నప్పటికీ అందరిలోనూ ఏదో తెలియని భయం మాత్రం అలాగే ఉండిపోయింది.
5/8

పలు చోట్ల ఇళ్లు ప్రమాదకర స్థాయిలో ఉన్నాయి. ఎప్పుడైనా పైకప్పు ఊడిపోయే పరిస్థితి ఉంది. అలాంటి ఇళ్లలో ఎవరైనా ప్రాణాలతో ఉన్నారేమో అని సహాయక సిబ్బంది గాలింపు చర్యలు చేపడుతోంది.
6/8

కూలిపోయే దశలో ఉన్న ఇళ్లను రెస్క్యూ టీమ్ పరిశీలిస్తోంది. జాగ్రత్తగా అక్కడి శిథిలాల్ని తొలగిస్తోంది. వాటి కింద ఎవరైనా చిక్కుకుని ఉంటే సురక్షితంగా బయటకు తీసుకొస్తోంది. సహాయక చర్యలు ఐదో రోజుకు చేరుకున్నాయి. బాధితులను గుర్తించేందుక రేడార్ డ్రోన్‌లు వినియోగిస్తున్నారు.
7/8

సహాయక చర్యల్లో డాగ్‌స్క్వాడ్‌లు కూడా కీలకంగా మారాయి. తమిళనాడు నుంచి ప్రత్యేకంగా ఓ బృందం ఇక్కడికి వచ్చింది. కేవలం టెక్నాలజీపైనే ఆధారపడకుండా ఇలా డాగ్‌స్వ్కాడ్‌తోనూ రెస్క్యూ కొనసాగిస్తున్నారు.
8/8

ఈ కుక్కలు బురదలో 2-5 అడుగుల లోతులో కూరుకుపోయిన మనుషుల వాసననూ పసిగడతాయి. సహాయక చర్యల్లో రెస్క్యూ టీమ్‌కి ఇవి ఎంతగానో సహకరిస్తున్నాయి. థర్మల్ స్కానర్‌లతో పాటు డాగ్‌స్క్వాడ్‌పైనా ఆధారపడుతున్నారు అధికారులు.
Published at : 03 Aug 2024 06:09 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఐపీఎల్
క్రైమ్
తెలంగాణ
అమరావతి
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion