అన్వేషించండి
Surya Tilak: బాల రాముడి నుదుటిన సూర్య తిలకం, ఈ అద్భుతం ఎలా సాధ్యమైంది?
Surya Tilak: అయోధ్యలో బాల రాముడి విగ్రహంపై సూర్య తిలకం దర్శనమిచ్చి కనువిందు చేసింది. దాదాపు మూడు నిముషాల పాటు ఈ కిరణాలు ప్రసరించాయి.
అయోధ్యలో బాల రాముడి విగ్రహంపై సూర్య తిలకం దర్శనమిచ్చి కనువిందు చేసింది. దాదాపు మూడు నిముషాల పాటు ఈ కిరణాలు ప్రసరించాయి.
1/8

అయోధ్య రామ మందిరంలో అద్భుతమైన దృశ్యం ఆవిష్కృతమైంది. రాముడి నుదుటిన సూర్య తిలకం దర్శనమిచ్చింది. దాదాపు మూడు నిముషాల పాటు సూర్య కిరణాలు రాముడి నుదురుపై ప్రసరించాయి. ఈ ఘట్టాన్ని చూసి ఆలయమంతా ఒక్కసారిగా జై శ్రీరామ్ నినాదాలతో మారు మోగింది.
2/8

శ్రీరామ నవమికి ఈ అపూర్వ ఘట్టాన్ని అందరి ముందు ఉంచింది ఆలయ ట్రస్ట్. సరిగ్గా మధ్యాహ్నం 12.01 నిముషాలకు సూర్య కిరణాలు రాముడి నుదుటిపై పడ్డాయి. ఆ సమయంలో పూజారులు రామయ్యకి ప్రత్యేక హారతి ఇచ్చారు. వేదమంత్రోచ్ఛారణల మధ్య ఈ ఘట్టం విజయవంతంగా ముగిసింది.
Published at : 17 Apr 2024 01:28 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















