అన్వేషించండి
Lok Sabha Election 2024: ఇది కదా ప్రజాస్వామ్యం గొప్పదనం, వీళ్లే అసలు సిసలు సెలెబ్రిటీలు
Lok Sabha Election 2024 Phase 1 Voting: లోక్‌సభ మొదటి విడత పోలింగ్‌లో వృద్ధులు, కొత్త జంటలు ఓటు హక్కు వినియోగించుకుని అందరికీ స్ఫూర్తిగా నిలిచారు.
లోక్‌సభ మొదటి విడత పోలింగ్‌లో వృద్ధులు, కొత్త జంటలు ఓటు హక్కు వినియోగించుకుని అందరికీ స్ఫూర్తిగా నిలిచారు.
1/4

మరి కొన్ని చోట్ల పండు ముసలి వాళ్లూ పోలింగ్ బూత్‌కి వచ్చి ఓటు వేశారు. తమిళనాడులో దిండిగల్ నియోజకవర్గంలో 102 ఏళ్ల చిన్నమ్మ వచ్చి ఓటు వేసింది. సరిగ్గా నిలబడలేని ఆ వయసులో కూడా చేతికర్ర సాయంతో పోలింగ్ బూత్ వరకూ వచ్చి ఓటు హక్కు వినియోగించుకుని అందరికీ స్ఫూర్తిగా నిలిచింది.
2/4

ఉధంపూర్‌లో ఓ కొత్త జంట నేరుగా పెళ్లి మండపం నుంచి పోలింగ్ బూత్‌కి వచ్చి ఓటు హక్కు వినియోగించుకుంది. పోలింగ్ స్టేషన్ వరకూ వధూ వరులు కార్‌లోనే వచ్చారు. పెళ్లి దుస్తుల్లోనే క్యూలో నిలబడి ఓటు వేశారు. దేశం అభివృద్ధి చెందాలంటే ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని ఇద్దరూ సూచించారు. పెళ్లి బట్టల్లో ఉన్న వాళ్లను ఓటర్లు ఆసక్తిగా చూశారు. ఇదే ఉధంపూర్‌లో మరో కొత్త జంట ఇదే విధంగా పెళ్లి బట్టలతో వచ్చి ఓటు వేసింది.
Published at : 19 Apr 2024 01:13 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
రాజమండ్రి
రాజమండ్రి
ఆంధ్రప్రదేశ్
ఎడ్యుకేషన్

Nagesh GVDigital Editor
Opinion




















