అన్వేషించండి
Home Remedies for Pimples : మొటిమలు తగ్గించడానికి బెస్ట్ ఇంటి చిట్కాలు.. మళ్లీ రాకూడదంటే ఫాలో అయిపోండి
Best Home Remedies for Pimples : మొటిమలు తగ్గించుకునేందుకు ఇంట్లోనే ఎన్నో చిట్కాలు అందుబాటులో ఉంటాయి. వాటిలో బెస్ట్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
పింపుల్స్ రాకుండా ఇవి ట్రై చేయండి (Image Source : Freepik)
1/7

స్పాట్ ట్రీట్మెంట్ కోసం మీరు టీ ట్రీ ఆయిల్ ఉపయోగించవచ్చు. దీనిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబియల్ లక్షణాల ఉంటాయి. కొబ్బరి నూనెలో దీనిని కాస్త కలిపి.. డైల్యూట్ చేయాలి. కాటన్ స్వాబ్‌తో మొటిమలపై దీనిని అప్లై చేయాలి. బెస్ట్ రిజల్ట్స్ కోసం రాత్రుళ్లు ఉపయోగించండి.
2/7

ఆపిల్ సైడర్ వెనిగర్ చర్మం pHని సమతుల్యం చేయడానికి, బ్యాక్టీరియా పెరగుకుండా హెల్ప్ చేస్తుంది. 1 స్పూన్ ACVని తీసుకుని మూడు రెట్లు నీటిని వేసి కలపండి. దానిలో కాటన్ ముంచి.. మొటిమలపై రాయండి. సుమారు 5–10 నిమిషాలు ఉంచి.. తరువాత శుభ్రం చేసుకోవాలి. రోజుకోసారి దీనిని అప్లై చేయాలి.
3/7

కలబంద గుజ్జు చర్మాన్ని శాంతపరిచి.. ఎరుపుదనాన్ని తగ్గిస్తుంది. మొటిమలు దూరం చేస్తుంది. ఫ్రెష్ కలబంద గుజ్జు తీసి.. ముఖానికి అప్లై చేయండి. 20 నిమిషాలు ఉంచి తరువాత శుభ్రం చేసుకోవాలి. బెస్ట్ రిజల్ట్స్ కోసం రోజూ ఉపయోగించండి.
4/7

ముల్తానీ మిట్టిని రోజ్ వాటర్‌లో కలిపి ముఖానికి అప్లై చేయాలి. 15 నిమిషాలు తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇది అదనపు నూనెను గ్రహించి.. రంధ్రాలను శుభ్రపరుస్తుంది. నూనెను నియంత్రించి పింపుల్స్ రాకుండా చేస్తుంది. వారానికి 1–2 సార్లు ఉపయోగించాలి.
5/7

వేప ఆకులలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. నీటిలో వేపాకులు వేసి.. మెత్తగా నూరాలి. ఈ పేస్ట్‌ను ప్రభావిత ప్రాంతాలలో రాసి 20 నిమిషాల తరువాత కడిగేయాలి. ఇది మొటిమలను నయం చేయడమే కాకుండా భవిష్యత్తులో మొటిమలు రాకుండా కూడా నివారిస్తుంది.
6/7

ఒక శుభ్రమైన క్లాత్‌లో మంచు ముక్కను ఉంచి.. మొటిమపై 30 సెకన్ల పాటు నెమ్మదిగా నొక్కండి. మంట, ఎరుపు, వాపునుంచి తక్షణమే విముక్తి వస్తుంది. మొటిమలను కంట్రోల్ చేయడానికి రోజులో మీకు కుదిరిన ప్రతిసారి చేస్తే మంచిది.
7/7

తేనెలో దాల్చిన చెక్క పొడి వేసి.. మొటిమలపై రాయాలి. దీనిలోని సహజమైన యాంటీ బాక్టీరియల్ లక్షణాలు పింపుల్స్‌ని తగ్గిస్తాయి. ఈ పేస్ట్‌ను 15 నిమిషాలు తరువాత శుభ్రం చేసుకోవాలి. వారానికి రెండు మూడు సార్లు చేయాలి.
Published at : 11 Jul 2025 07:30 AM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
విజయవాడ
హైదరాబాద్
పర్సనల్ ఫైనాన్స్
ఇండియా
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















