అన్వేషించండి
Foods for Stamina : లైంగిక ఆరోగ్యాన్ని మెరుగుపరిచే టాప్ 5 ఫుడ్స్ ఇవే.. మగవారికే కాదు ఆడవారికి కూడా
Intimacy Health : కొన్ని ఫుడ్స్ రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల లైంగిక ఆరోగ్యం మెరుగవుతుందని చెప్తున్నారు. మగవారికి, ఆడవారికి కూడా ఇవి మంచి ఫలితాలు ఇస్తాయట. అవేంటంటే.
లైంగిక ఆరోగ్యానికి మేలు చేసే ఫుడ్స్ (Image Source : Envato)
1/8

లైంగికంగా ఆరోగ్యంగా ఉండాలనుకున్నప్పుడు లైఫ్స్టైల్లో కొన్ని మార్పులు చేయడంతో పాటు కొన్ని ఫుడ్స్ రెగ్యులర్‌గా తీసుకుంటే మంచిదని చెప్తున్నారు నిపుణులు. ఇంతకీ ఆ ఫుడ్స్ ఏంటి.. వాటివల్ల కలిగే ఫలితాలు ఏంటో చూసేద్దాం.
2/8

అరటిపండ్లలో బ్రోమేలైన్ ఎంజైమ్ ఉంటుంది. పొటాషియం, విటమిన్ బి ఉంటుంది. ఇది టెస్టోస్టిరాన్ లెవెల్స్ పెంచి లైంగిక ఆరోగ్యానికి హెల్ప్ చేస్తాయి.
3/8

వాల్నట్స్ వంటి నట్స్, గుమ్మడి గింజలు వంటి సీడ్స్‌లో జింక్, మెగ్నీషియం, ఎమినో యాసిడ్స్ ఉంటాయి. ఇవి టెస్టోస్టిరాన్ పెంచడంతో పాటు ఫెర్టిలిటీ సమస్యలన్ను దూరం చేస్తాయి.
4/8

డార్క్ చాక్లెట్ అంటే ఇష్టముండే వారు కూడా వాటిని రెగ్యులర్‌గా తీసుకోవచ్చు. ఇది మీ మూడ్‌ని బూస్ట్ చేస్తుంది. దీనిలో ఫ్లేవనాయిడ్స్ సెరోటోనిన్‌ను బూస్ట్ చేసి.. లిబిడోను పెంచి లైంగికంగా హెల్తీగా ఉంచడంలో హెల్ప్ చేస్తాయి.
5/8

మెంతులను లైంగిక ఆరోగ్యం కోసం ఆయుర్వేదంలో ఉపయోగిస్తారు. ఇవి లిబిడోను పెంచుతాయి. ముఖ్యంగా మహిళలకు ఇవి మంచి ఫలితాలు ఇస్తాయి.
6/8

స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ వంటి బెర్రీలలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తప్రసరణను పెంచి ఇన్ఫ్లమేషన్ను తగ్గిస్తాయి. లిబిడోని మెరుగుపరిచి లైంగిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
7/8

ఇవే కాకుండా అవకాడోలు, ఫ్యాటీ ఫిష్, ఆకుకూరలు, తేనే, గుడ్లు కూడా డైట్లో తీసుకుంటే లైంగిక ఆరోగ్యం మెరుగయ్యే అవకాశం ఉంది. అలాగే హెల్తీ లైఫ్‌స్టైల్ కూడా ముఖ్యమని గుర్తించుకోవాలి.
8/8

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Published at : 15 Jun 2025 10:28 PM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆట
ఆధ్యాత్మికం
శుభసమయం
రాజమండ్రి
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















