అన్వేషించండి
Rasgulla Recipe : టేస్టీ స్వీట్ రసగుల్లా.. ఇంట్లో చేసుకునేందుకు సింపుల్ని ఫాలో అయిపోండి
Rasgulla Sweet : ఇంట్లోనే టేస్టీగా రసగుల్లా చేసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ సింపుల్ రెసిపీ మీ కోసమే. రుచిగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
రసగుల్ల రెసిపీ (Image Source : Envato)
1/6

టేస్టీ స్వీట్లలో రసగుల్లా ఒకటి. చాలామంది దీనిని ఇష్టంగా తింటారు. కానీ ఇంట్లో ఈ స్వీట్ చేసుకోవడం కష్టం అనుకుంటారు. కానీ ఇంట్లోనే టేస్టీగా, స్పాంజ్‌గా రసగుల్లాను చేసుకోవచ్చు.
2/6

రసగుల్లాను తయారు చేడానికి ఫ్యాట్ మిల్క్, నిమ్మరసం లేదా వెనిగర్ సిద్ధం చేసుకోవాలి. పాలను మందపాటి గిన్నెలో వేసి మరిగించాలి. అనంతరం దానిలో నిమ్మరసం లేదా వెనిగర్ వేసి కలపాలి.
3/6

పాలు విడిపోయాక నీటిని వేరు చేసి.. చల్లని నీటితో మిగిలిన పదార్థాన్ని కడగాలి. ఇప్పుడు దానిలోని నీటిని పిండేసి 30 నుంచి 45 నిమిషాలు పక్కన ఉంచి డ్రై అయ్యేలా చూసుకోవాలి.
4/6

ఈ పిండిని బాగా కలిపితే మెత్తగా అవుతుంది. దానిని చిన్న చిన్న బాల్స్‌గా సిద్ధం చేసుకోవాలి. ఇప్పుడు ఓ గిన్నెలో షుగర్ సిరప్ సిద్ధం చేసుకోవాలి. దానిలో యాలకుల పొడి వేసి మరిగించాలి.
5/6

ఇప్పుడు రసగుల్లా బాల్స్‌ని షుగర్ సిరప్‌లో వేసి ఉడికించాలి. ఉడికితే అవి పెద్దగా ఉబ్బుతాయి. అంతే టేస్టీ టేస్టీ రసగుల్లా రెడీ.
6/6

దీనిని మీరు చల్లారిన తర్వాత డ్రై ఫ్రూట్స్‌తో గార్నిష్ చేసుకుని లాగించేయవచ్చు.
Published at : 25 Jun 2025 03:32 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















