అన్వేషించండి
Satyabhama Serial Today January 31th Highlights: సత్యకు చెప్పకుండా పెళ్లి చేసేసిన క్రిష్.. పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన సంధ్య - సత్యభామ జనవరి 31 ఎపిసోడ్ హైలెట్స్!
Satyabhama Today Episode: క్రిష్.. మహదేవయ్య కొడుకు కాదని సత్య బయటపెడదాం అనుకుంటే ప్లాన్ రివర్సైంది. ఇప్పుడు MLA గా బరిలో దిగారు మహదేవయ్య సత్య . ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే....

Satyabhama Serial Today January 31st Highlights (Image Credit: Disney Plus Hotstar/ Star Maa)
1/8

ఇంట్లో లెటర్ పెట్టి వెళ్లిపోతుంది సంధ్య. సంజయ్ గుడి దగ్గర వెయిట్ చేస్తాడు. క్రిష్ కి కాల్ చేసి హెల్ప్ చేయమంటుంది సంధ్య. నీకోసం అందర్నీ వదిలేసి వచ్చానంటుంది సంధ్య. కన్విన్స్ చేసేందుకు ప్రయత్నించినా వినదు
2/8

క్రిష్ రావడం చూసి సంజయ్ టెన్షన్ పడతాడు..నేనే రమ్మని చెప్పానని షాక్ ఇస్తుంది సంధ్య. నేను వచ్చింది మిమ్మల్ని దూరం చేయడానికి కాదు పెద్దలను ఒప్పించి పెళ్లిచేసుకోవాలని నచ్చచెబుతాడు కానీ సంధ్య వినదు. నేను చెప్పినా వినడం లేదంటాడు సంజయ్
3/8

తనకు కుటుంబం అవసరం లేదు సంజయ్ కావాలని పట్టుబడుతుంది. క్రిష్ కాళ్లు పట్టుకుంటుంది. మీ ఇద్దరకీ దగ్గరుండి పెళ్లిచేస్తానంటాడు క్రిష్.
4/8

విశ్వనాథం కుటుంబాన్ని పెళ్లివారు అవమానిస్తారు. గొప్ప కుటుంబం అన్నారు ఇదేనా అని నోటికొచ్చినట్టు తిట్టేసి వెళ్లిపోతారు. విశ్వనాథం, విశాలాక్షి కన్నీళ్లు పెట్టుకుంటారు. చెల్లెలు ఫొటో కోపంగా విసిరేసి ఏడుస్తుంది సత్య
5/8

గడ్డం పట్టుకుని బతిమలాడాను అన్నయ్యా జీవితం పాడుచేసుకోవద్దన్నాను కానీ వినలేదని సత్య బాధపడుతుంది
6/8

క్షమించు సత్య ఈ పెళ్లి ఆపడం నా వల్ల కాలేదని మనసులో అనుకుంటూ సంధ్య, సంజయ్ కి పెళ్లి చేసేస్తాడు క్రిష్
7/8

జరిగిన విషయం క్రిష్ కి చెప్పాలని కాల్ చేస్తుంది సత్య.. కాల్ లిఫ్ట్ చేయడు. పెళ్లయ్యాక కాల్ లిఫ్ట్ చేస్తాడు. సంధ్య మోసం చేసి పారిపోయిందని సత్య ఏడుస్తుంది . సంధ్యని వెతికి తీసుకురావాలి సంజయ్‌ని కలవనివ్వకూడదు అంటుంది.
8/8

సంజయ్ - సంధ్య పెళ్లి బట్టలతో రావడం చూసి మహదేవయ్య, భైరవి షాక్ అవుతారు. నేను ఈ పెళ్లికి ఒప్పుకోను అంటూ సత్య ఎంట్రీ ఇస్తుంది. సంధ్యను బలవంతంగా తీసుకెళ్లేందుకు విశ్వనాథం కుటుంబం ప్రయత్నిస్తారు కానీ... తల్లిదండ్రులపై పోలీస్ కంప్లైంట్ ఇస్తుంది సంధ్య..
Published at : 31 Jan 2025 08:31 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
జాబ్స్
ఇండియా
హైదరాబాద్
జాబ్స్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion