అన్వేషించండి
Satyabhama Serial February 14th Episode Highlights: మహదేవయ్య ప్లాన్ సక్సెస్.. ప్రేమికుల దినోత్సవం రోజు విడిపోయిన సత్య క్రిష్ - సత్యభామ ఫిబ్రవరి 14 ఎపిసోడ్ హైలెట్స్!
Satyabhama Today Episode: క్రిష్.. మహదేవయ్య కొడుకు కాదని సత్య బయటపెడదాం అనుకుంటే ప్లాన్ రివర్సైంది. MLA గా పోటాపోటీగా బరిలో దిగారు మామా కోడలు.. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే....

Satyabhama Serial February 14th Episode Highlights
1/11

మహదేవయ్య, రుద్ర నాటకం ఆడి క్రిష్ తో నర్సింహంని చంపించేందుకు ప్లాన్ చేస్తారు. ఆ ట్రాప్ లో ఇరుక్కుపోతాడు క్రిష్
2/11

సత్య ఎంత చెప్పినా వినకుండా క్రిష్ నర్సింహని చంపేస్తానంటూ వెళతాడు. బయటకు వచ్చిన రుద్ర..ఇంట్లో మగాడు బయటకు వెళితే అడ్డుకోవడం ఆడవాళ్ల పని కాదంటూ సెటైర్స్ వేస్తాడు
3/11

అయితే అక్కా హారతి తీసుకురా ఈ కత్తి సంజయ్ చేతిలో పెట్టి పంపిద్దాం అంటుంది సత్య. మహదేవయ్య షాక్ అవుతాడు. సంజయ్ కి ఏంటి సంబంధం అని నిలదీస్తుంది సంధ్య
4/11

సంజయ్ కొడుకులాంటివాడే అన్నారు కదా. నిన్ను ఇంటి కోడలిగా చూసుకున్నారు కదా.. అత్తగారు ఇచ్చిన నగలు కులుక్కుంటూ పెట్టుకున్నప్పుడు సంజయ్ కూడా బాధ్యతలు తీసుకోవాలి కదా అంటుంది.
5/11

ఎగ్జిట్ పోల్స్ నాకు అనుకూలంగా రావడంతో ఈ నాటకాలు ఆడుతున్నారు అంటుంది సత్య. నీకు ఏవేవో చెప్పి ఆపుతోంది..నేను పోతా అంటాడు మహదేవయ్య. నేను ఉండగా నీకు కత్తిపట్టే అవసరం రానివ్వను అని వెళ్లిపోతాడు
6/11

మహదేవయ్య ఓడిపోతున్నాడనే సంతోషంతో నర్సింహ తాగుతుంటాడు. అక్కడకు వెళ్లిన క్రిష్ వాళ్లపై దాడి చేస్తాడు. నర్సింహని చంపేద్దాం అనుకుని సత్యమాటలు గుర్తొచ్చి ఆగిపోతాడు.
7/11

క్రిష్ అటు వెళ్లగానే రుద్ర వచ్చి నర్సింహంని చంపేస్తాడు.
8/11

నర్సింహంని చంపేశారని ఎన్నికలు రద్దు అయ్యాయనే వార్త వస్తుంది. హత్య చేయలేదు కాబట్టి సత్య మెచ్చుకుంటుంది అనుకుంటాడు. లోపలకు వెళ్లేసరికి నర్సింహం చావు వార్త విని షాక్ అవుతాడు. సత్య కోపంగా వెళ్లిపోతుంది
9/11

నేను నర్సింహంని చంపలేదని క్రిష్ అంటున్నా రుద్ర-మహదేవయ్య నవ్వుతారు. చంపాలనుకున్న కానీ సత్య మాట గుర్తొచ్చి ఆగిపోయాను అంటాడు.నువ్వు మరింత దిగజారిపోయావ్ అంటుంది సత్య
10/11

image 10
11/11

సత్యభామ ఫిబ్రవరి 15 ఎపిసోడ్ లో సత్య పుట్టింటికి వెళ్లిపోయేందుకు బయలుదేరుతుంది. క్రిష్ ఎంత చెప్పినా కానీ కానీ సత్య వినదు
Published at : 14 Feb 2025 09:21 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఐపీఎల్
అమరావతి
రాజమండ్రి
నల్గొండ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion