పాలబుగ్గల సుందరి హన్సిక చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలుపెట్టింది. బుల్లితెరపై పలు యాడ్స్ లో కూడా కనిపించింది. చైల్డ్ ఆర్టిస్ట్ గా హ్రితిక్ రోషన్ తో కలిసి నడిచిన 'కోయి మిల్ గయా' సినిమా హన్సికకు మంచి గుర్తింపును తీసుకొచ్చింది.
2007లో 'దేశముదురు' సినిమాతో టాలీవుడ్ కి హీరోయిన్ గా పరిచయమైంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ తో ఆమె కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయింది. మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకోవడంతో వరుస అవకాశాలు వచ్చాయి.
ఎంత వేగంగా స్టార్ డం అందుకుందో.. అంతే వేగంగా టాలీవుడ్ లో ఫేడ్ అవుట్ అయింది. అదే సమయంలో ఆమెకి తమిళనాట అవకాశాలు వచ్చాయి.
బొద్దుగా ఉండే హీరోయిన్స్ ను ఇష్టపడే తమిళ ప్రేక్షకులు హన్సికను నెత్తిన పెట్టుకున్నారు. చిన్న ఖుష్బూ అంటూ ఆమెకి పేరు పెట్టేసుకొని.. ఏకంగా గుడి కూడా కట్టేశారు.
తెలుగు ప్రేక్షకులు ఆమెని మర్చిపోయినప్పటికీ తమిళంలో మాత్రం అవకాశాలు వస్తూనే ఉన్నాయి.
పెద్ద హీరోల సరసన అవకాశాలు తగ్గిపోయాయి. దీంతో అంతగా మార్కెట్ లేని హీరోల సరసన నటిస్తోంది.
అలానే తనే ప్రధానంగా నటిస్తోన్న కొన్ని సినిమాలు వస్తున్నాయి. తాజాగా ఈ బ్యూటీ ఓ రేర్ ఫీట్ అందుకుంది.
ఇండస్ట్రీలో హీరోయిన్ల లైఫ్ స్పాన్ తక్కువ. అలాంటిది హన్సిక ఇప్పటివరకు యాభై సినిమాలు చేసేసింది.
ఇప్పుడు ఆమె నటించిన 50వ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. మొత్తానికి చెన్నైలోనే సెటిల్ అయిపోయి.. చాలా మంది హీరోయిన్లకు సాధ్యం కాని రేర్ ఫీట్ ను అందుకుంది.
క్యూట్ స్మైల్ తో కట్టిపడేస్తున్న లావణ్య త్రిపాఠి
టర్కీ అందాలను ఆస్వాదిస్తున్న సమంత!
actress sada: పసుపు రంగు చీరలో బంతి పువ్వులా మెరిసిపోతున్న సదా
Rahul Sipligunj: వైభవంగా రాహుల్ సిప్లిగంజ్ తమ్ముడి పెళ్లి, ఫోటోలు వైరల్
Sravanthi Chokarapu: బ్లాక్ డ్రెస్సులో మెరిసిపోతున్న బిగ్ బాస్ బ్యూటీ
Apple Vision Pro: ప్రపంచాన్ని కళ్ల ముందుకు తెస్తున్న యాపిల్ - విజన్ ప్రో హెడ్సెట్ లాంచ్ - రేటు ఎంతంటే?
KTR Mulugu Tour: ఈ 7న ములుగు జిల్లాలో కేటీఆర్ పర్యటన, కలెక్టరేట్ సహా పలు పనులకు శంకుస్థాపన
యాపిల్ విజన్ ప్రో హెడ్ సెట్ ఎలా ఉంది? - ఎలా పని చేస్తుంది? - ఈ ఫొటోలు చూస్తే ఫుల్ క్లారిటీ!
iOS 17 Features: ఐవోఎస్ 17లో మూడు సూపర్ ఫీచర్లు - లాంచ్ చేసిన యాపిల్!