అన్వేషించండి
Prabhutva Junior Kalasala OTT Streaming: ప్రభుత్వ జూనియర్ కళాశాల... రెండు ఓటీటీల్లో యూత్‌ఫుల్ లవ్ స్టోరీ స్ట్రీమింగ్
యూత్‌ఫుల్ అండ్ ఎమోషనల్ మ్యూజికల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన సినిమా 'ప్రభుత్వ జూనియర్ కళాశాల'. ఇప్పుడీ సినిమా రెండు ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఎక్కడెక్కడో తెలుసా?
'ప్రభుత్వ జూనియర్ కళాశాల'లో ప్రణవ్ ప్రీతం, షాజ్ఞ శ్రీ వేణున్
1/4

ప్రణవ్ ప్రీతం, షాజ్ఞ శ్రీ వేణున్ జంటగా నటించిన సినిమా 'ప్రభుత్వ జూనియర్ కళాశాల'. ఇదొక యూత్‌ఫుల్ అండ్ ఎమోషనల్ మ్యూజికల్ ఎంటర్‌టైనర్. బ్లాక్ ఆంట్ పిక్చర్స్ సంస్థ నిర్మించింది. శ్రీమతి కొవ్వూరి అరుణ సమర్పణలో భువన్ రెడ్డి కొవ్వూరి నిర్మించిన ఈ చిత్రానికి శ్రీనాథ్ పులకురం దర్శకుడు. జూన్ 21న థియేటర్లలో ఈ సినిమా విడుదలైంది. ఇప్పుడీ సినిమా రెండు ఓటీటీ వేదికల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఏయే ఓటీటీల్లో వీక్షకులకు అందుబాటులో ఉందో తెలుసా?
2/4

'ప్రభుత్వ జూనియర్ కళాశాల' కొన్ని గంటల క్రితం ఆహా ఓటీటీలో విడుదలైంది. ఈ మూవీ ప్రస్తుతం అందులో స్ట్రీమింగ్ అవుతోంది. వచ్చే వారం నుంచి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోనూ వీక్షకులకు అందుబాటులోకి రానుంది. ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉంది... అమెరికా ఆడియన్స్ కోసం అమెజాన్ ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నారు. ఇండియన్ ఆడియన్స్ కోసం ఆహా అయితే... అమెరికన్ ఆడియన్స్ కోసం అమెజాన్. అదీ సంగతి.
Published at : 30 Aug 2024 03:43 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
బిగ్‌బాస్

Nagesh GVDigital Editor
Opinion




















