అన్వేషించండి
(Source: ECI | ABP NEWS)
అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌కు చేరుకున్న అట్లీ - భార్య, కొడుకుతో సహా!
గుజరాత్‌లోని జామ్ నగర్‌లో జరుగుతున్న అనంత్ అంబారీ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌కు అట్లీ కుటుంబ సమేతంగా హాజరయ్యాడు.
కొడుకుతో అట్లీ, ప్రియ అట్లీ
1/6

భారతీయ బిలియనీర్ ముకేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్‌ల వివాహం టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. వీరి ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కూడా ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ వేడుకలు గుజరాత్‌లోని జామ్ నగర్‌లో జరుగుతున్నాయి. ప్రముఖ తమిళ దర్శకుడు అట్లీ, ఆయన భార్య ప్రియ, కొడుకుతో సహా ఈ వేడుకలకు హాజరయ్యారు.
2/6

ముఖ్యంగా వీరి డ్రెస్సింగ్ కూడా హైలెట్‌గా నిలిచింది. అట్లీ పూర్తిగా బ్లాక్ డ్రస్సు ధరించగా, ప్రియ రెడ్ డ్రస్సులో వచ్చారు.
3/6

సినిమాల పరంగా కూడా అట్లీ ప్రస్తుతం పీక్ ఫాంలో ఉన్నాడు. 2013లో ‘రాజా రాణి’తో సక్సెస్‌ఫుల్‌గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వగా, 2023 నాటికి బాలీవుడ్ కింగ్ షారుక్ ఖాన్‌తో ‘జవాన్’తో ఇండస్ట్రీ హిట్ కొట్టే స్థాయికి ఎదిగాడు.
4/6

‘రాజా రాణి’ తర్వాత వరుసగా మూడు సినిమాలు తమిళ సూపర్ స్టార్ విజయ్‌తో చేశారు. ఈ మూడు సినిమాలు బ్లాక్‌బస్టర్‌గా నిలిచాయి.
5/6

దీంతో బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్‌తో సినిమా చేసే అవకాశం వచ్చింది. ఆ అవకాశాన్ని రెండు చేతులతో ఒడిసిపట్టుకున్న అట్లీ... ‘జవాన్’తో షారుక్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ ఇచ్చాడు.
6/6

ఆ తర్వాత షారుక్ ఖాన్, తమిళ హీరో విజయ్ కాంబినేషన్‌లో సినిమా కోసం స్క్రిప్టు తయారు చేస్తున్నట్లు ప్రకటించాడు. కానీ విజయ్ ఇకపై సినిమాలు చేయబోనని ప్రకటించాడు. దీంతో ఆ సినిమాకి తాత్కాలికంగా బ్రేక్ పడినట్లే.
Published at : 01 Mar 2024 01:19 PM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఎలక్షన్
విశాఖపట్నం
క్రికెట్
న్యూస్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















